‘డిజిటల్’ చదువులు
► ఉన్నత పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలి
► వీడియో కాన్ఫరెన్స్‌లో హెచ్‌ఎంలకు డీఈఓ ఆదేశం
తెలంగాణలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల బోధన సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రైవేట్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు డీఈఓ రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు.
- తాండూరు
తాండూరు: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల (డిజిటల్ క్లాసుల) బోధ న జిల్లాలో సోమవారం మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాధికారి రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఈనెల 15న ‘సాక్షి’ దినపత్రికలో జిల్లాలో ఇక ‘డిజిట ల్ చదువులు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.
రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) నుంచి ఇందుకోసం సుమారు రూ.50 వేల నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హైదరాబాద్ నుంచి తెర, ప్రొజెక్టర్, రెండు స్పీకర్లు తదితర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేశారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో సోమవారం లాంఛనంగా డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. డిజిటల్ క్లాసుల అమలుపై డీఈఓ రమేష్ సోమవారం ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు పక్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. తాండూరులోని ప్రభుత్వ నంబ ర్-1 పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయుడు ప్రారంభించారు. యాలాల బా లుర ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభిం చారు. బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల పరిధిలోని దామర్‌చెడ్, బెన్నూర్, యాలాల (బాలికల), దేవనూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, బషీరాబాద్ (ఉర్దూమీడియం), నవల్గ, గోటిగ, జీవన్గీ, పెద్దేముల్ పాఠశాలలకు సాంకేతిక పరికరాలు వచ్చాయి.
అందరికీ డిజిటల్ విద్య అవసరం: యాంకర్ సుమ
శంషాబాద్: నేటి సమాజంలో అందరికీ డిజి టల్ విద్య అవసరమని యాంకర్ సుమ అ న్నారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాలకు సోమవా రం సొంత ఖర్చులతో డిజిటల్ విద్యకు సం బంధించిన పరికరాలను ఆమె అందజేశారు. గతంలో పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించేం దుకు సిద్ధమయ్యారు. ఇటీవలే పాఠశాలకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందజేసిన సుమ తాజాగా డిజిటల్ పరికరాలను అందజేయడంతో పాఠశాల హెచ్‌ఎం ఉమామహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు మేలు..
డిజిటల్ క్లాసులతో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది. దృశ్యశ్రవణబోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుంది. త ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి.
- డి.రమేష్, హెచ్‌ఎం,
రెడ్డి ఘనాపూర్, ఉన్నత పాఠశాల