Command
-
నాసా వ్యోమనౌక నుంచి సిగ్నల్స్ కట్, వోయేజర్–2కు మళ్లీ జీవం!
ఇతర గ్రహాలపై పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష పశోధనా సంస్థ 46 ఏళ్ల క్రితం ప్రయోగించిన వోయేజర్–2 వ్యోమనౌక మళ్లీ యథాతథంగా పనిచేయడం ప్రారంభించింది. ఒకరకంగా చెప్పాలంటే కీలకమైన ఈ స్పేస్‌క్రాఫ్ట్ మళ్లీ ప్రాణం పోసుకుంది. ఈ వ్యోమనౌక ప్రస్తుతం భూమికి దాదాపు 12 బిలియన్ల మైళ్ల (దాదాపు 2,000 కోట్ల కిలోమీటర్లు) దూరంలో ఉంది. కమ్యూనికేషన్ వ్యవస్థలో చోటుచేసుకున్న పొరపాటు వల్ల గత నెల 21 తేదీన వోయేజర్–2 నుంచి భూమికి సంకేతాలు ఆగిపోయాయి. కంట్రోలర్లు పొరపాటున తప్పుడు కమాండ్ పంపించడమే కారణమని సమాచారం. ఫలితంగా వోయేజర్–2 యాంటెనా స్వల్పంగా పక్కకు జరిగింది. దాంతో సంకేతాలు నిలిచిపోయాయి. నాసా సైంటిస్టులు వెంటనే రంగంలో దిగారు. సంకేతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. భారీ రేడియో యాంటెనాలతో కూడిన డీస్ స్పేస్ నెట్వర్క్ ద్వారా కమాండ్ పంపించారు. దీనికి వోయేజర్–2 స్పందించి 18 గంటల తర్వాత భూమిపైకి సంకేతాలను పంపించింది. నాసా శాస్త్రవేత్తలు వోయేజర్–2 యాంటెనాను సరిచేసే పనిలో విజయం సాధించారు. ఇందుకోసం కమాండ్‌ను పంపించారు. స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్‌ను దాదాపు పూర్తిస్థాయిలో పునరుద్ధరించినట్లు ఇస్రో సైంటిస్టులు ప్రకటించారు. వోయేజర్–2 ఎప్పటిలాగే పనిచేస్తోందని, యధావిధిగా సేవలు అందిస్తోందని హర్షం వ్యక్తం చేసింది. ఏమిటీ వోయేజర్–2? అంతరిక్షంలో భూమికి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న శనిగ్రహం, కుజ గ్రహం, బృహస్పతి, గురుగ్రహంపై పరిశోధనల కోసం ‘నాసా’ 1977 సెప్టెంబర్ 5న వోయేజర్–1, 1977 ఆగస్టు 20న వోయేజర్–2 వ్యోమనౌకలను పంపించింది. కాలిఫోర్నియాలో నాసాకు చెందిన జెట్ ప్రొపల్షన్ ల్యాబ్‌లో వీటిని రూపొందించారు. భూమికి సంబంధించిన శబ్ధాలు, చిత్రాలు, సందేశాలను ఇందులో చేర్చారు. గత 36 ఏళ్లుగా నిరి్వరామంగా పనిచేస్తున్నాయి. ఇతర గ్రహాల సమాచారాన్ని భూమిపైకి చేరవేస్తున్నాయి. 2012 ఆగస్టులో వోయేజర్–1 ఇంటర్స్టెల్లార్ స్పేస్‌లోకి ప్రవేశించింది. అంటే అంతరిక్షంలో లక్షల కోట్ల ఏళ్ల క్రితం కొన్ని నక్షత్రాలు అంతరించిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీ ప్రదేశంలోకి చేరుకుంది. ఆ తర్వాత వోయేజర్–2 కూడా ఈ స్పేస్‌లోకి ప్రవేశించింది. వోయేజర్–2 1986లో యురేనస్ గ్రహం సమీపానికి వచి్చంది. దాని ఉపగ్రహాలను గుర్తించింది. గురు, శనిగ్రహాలకి సంబంధించిన యూరోపా, ఎన్సిలాడస్ అనే ఉపగ్రహాలపై మంచు కింద సముద్రాల ఆనవాళ్లు ఉన్నట్లు కనిపెట్టింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన ఈస్టర్న్ నేవీ కమాండ్ చీఫ్
-
అంత సమయం ఇవ్వలేం
సాక్షి, హైదరాబాద్: అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయంపై ఉగ్రవాద దాడిలో మృతిచెందిన ఐఎఫ్ఎస్ అధికారి వి.వెంకటేశ్వర్రావు కుటుంబానికి ఇంటిస్థలం అప్పగింతకు మూడు నెలల సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కోరడంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. దాదాపు 12 ఏళ్లుగా బాధిత కుటుంబం స్థలం కోసం ఎదురు చూస్తోందని, అంత సమయం ఇవ్వలేమని, 3 వారాల్లో ఇంటి స్థలం కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేసింది. భరణి లేఔట్లో కేటాయించనున్న ప్లాట్ నంబర్ 54ను వారం రోజుల్లో వెంకటేశ్వర్రావు భార్య మాలతీరావుకు చూపించాలని, ఆ ప్లాట్ తీసుకునేందుకు ఆమె అంగీకరిస్తే మరో 2 వారాల్లో కేటాయించాలని, ఆగస్టు 23లోగా ప్లాట్ అప్పగింతకు సంబంధించిన పూర్తి వివరాలను పేర్కొంటూ సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. తన భర్త 2008లో తీవ్రవాదుల దాడిలో చనిపోయారని, ఇంటి స్థలం కేటాయిస్తూ 2014లో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం జీవో జారీచేసినా ఇప్పటికీ స్థలం అప్పగించలేదంటూ మాలతీరావు రాసిన లేఖను ధర్మాసనం గతంలో సుమోటో పిటిషన్‌గా విచారణకు స్వీకరించింది. మాలతీరావు అంగీకరిస్తే భరణి లేఔట్‌లోనే గతంలో కేటాయించిన ప్లాట్ నంబర్ 58 బదులుగా 475 గజాల స్థలం ఉన్న ప్లాట్ నంబర్ 54 ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రెవెన్యూ శాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది భాస్కర్‌రెడ్డి నివేదించారు. ఇందుకు ధర్మాసనం నిరాకరించడంతో...కనీసం 4 వారాల సమయం అయినా ఇవ్వాలని కోరారు. ఈ మేరకు స్పందించిన ధర్మాసనం ఆగస్టు 23లోగా ప్లాట్ కేటాయింపు ప్రక్రియ పూర్తిచేసి మాలతీరావుకు అప్పగించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. -
ప్రణాళికల రూపకల్పనపై దృష్టి సారించండి
సాక్షి, హైదరాబాద్: ప్రణాళిక సంచాలకులు (డీటీసీపీ), హైదరాబాద్ మెట్రోపాలిటన్ అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లు.. ఇకపై భవన నిర్మాణ అనుమతులు, వాటి అమలు వంటి నియంత్రణ అంశాలపై కాకుండా ప్రణాళికల రూపకల్పన, వాటి అమలుపై దృష్టి పెట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీ రామారావు ఆదేశించారు. అన్ని నగరాభివృద్ధి సంస్థలు, మునిసిపాలిటీలు, మండల కేం ద్రాలకు సంబంధించిన మాస్టర్ ప్లాన్లను రూపొందించాలని సూచించారు. నియంత్రణ చర్యలు, అనుమతుల బాధ్యతను జిల్లా కలెక్టర్లు చూసుకుంటారని స్పష్టం చేశారు. మంత్రి ఆదేశాలను మెమో రూపంలో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్ గురువారం జారీ చేశారు. డిజిటల్ నంబరింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేయాలి పట్టణాలు, నగరాల్లోని ఇళ్లకు డిజిటల్ నంబరింగ్ విధానాన్ని అమలు చేసేలా ప్రణాళిక సిద్ధం చేయా లని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జీఐఎస్ బేస్ మ్యాప్‌ను రూపొందించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. అన్ని మండల కేంద్రాలు, గ్రామీణ స్థానిక సంస్థలకు భూ వినియోగ ప్రణాళికలు రూ పొందించాలని సూచించారు. హెచ్ఎండీఏ అవతల ఉండే పట్టణాలు, నగర పాలక సంస్థల పరిధిలో ల్యాండ్ పూలింగ్ పథకాన్ని రూపొందించడంలో సాంకేతిక సాధికార సంస్థగా ఉండాలని తెలిపారు. టీఎస్ బి పాస్‌కు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అవసరమైన సలహాలు ఇవ్వాలని, సాంకేతిక అంశాల పై మార్గనిర్దేశనం చేయాలని మంత్రి ఆదేశించారు. -
పేపర్ రహిత ఫైళ్లు పంపండి
అధికారులకు జాయింట్ కలెక్టర్ ఆదేశం అనంతపురం అర్బన్: జిల్లాలోని ప్రభుత్వాధికారులు తప్పని సరిగా ఫైళ్లను ఈ–ఆఫీసు ద్వారానే పంపించాలని జాయింట్ కలెక్టర్ టి.కె.రమామణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో మీ కోసం అనంతరం డీఆర్ఓ సి.మల్లీశ్వరిదేవితో కలిసి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. గ్రీవెన్స్ ద్వారా పరిష్కరించేవాటిని కూడా ఈ–ఆఫీసులో ఆన్లైన్ ద్వారా అప్లోడ్ చేయాలని చెప్పారు. అలర్ట్ మేనేజ్‌మెంట్‌సిస్టం, ముఖ్యమంత్రి కార్యాలయం అందే ఉత్తర్వులతో పాటు, ప్రజా వేదిక అర్జీలను 24 గంటల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆర్థికపరమైనవి మినహా మిగిలిన సమస్యలు వెనువెంటనే పరిష్కారం కావాలన్నారు. డీఆర్ఓ మాట్లాడుతూ కోర్టు పెండింగ్ కేసులకు సంబంధించిన వాటిపై కూడా జిల్లా అధికారులు ప్రత్యేక శ్రద్ధపెట్టి సమగ్ర నివేదికలు అందించి, ముగింపు ఉత్తర్వులను పొందాలని సూచించారు. ‘ఫీల్డ్ విజిట్ మేనేజ్మెంట్’పై అధికారులకు డెమో ద్వారా ఎన్ఐసీ ఇన్చార్జి డీఐఓ దీక్షితులు వివరించారు. -
రోడ్లకు మరమ్మతులు చేయండి
అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో దెబ్బతిన్న నగర రహదారులను వెంటనే పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా మెట్రో రైల్ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు బాగా దెబ్బతిన్నాయని... వాటి పనులు చేపట్టేందుకు వెంటనే జీహెచ్ఎంసీ, హైద్రాబాద్ మెట్రో రైల్ అధికారులతో సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఇఎన్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఇటీవల నాబార్డ్ సహకారంతో ప్రభుత్వం చేపట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణ పనులను వేగిరం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ఆమోదించిన 2,600 కిలోమీటర్ల జాతీయ రహదారులను కేంద్రానికి అప్పగించేవరకు రాష్ట్ర ప్రభుత్వమే నిర్మాణ బాధ్యతలు చూసుకోవాల్సి ఉంటుందన్నారు. డిసెంబర్ 15-18 వరకు హైటెక్స్‌లో ఇండియన్ రోడ్ కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్లు మంత్రి చెప్పారు. దాదాపు 5వేల మంది ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సును సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రమాదాల నివారణ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ పటిష్టత, ట్రాఫిక్ నిబంధనలు తదితర అంశాలపై ఈ సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. -
వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దు
కంట్రోలింగ్ అథారిటీకి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: పెంచిన గ్రాట్యుటీని తమకూ వర్తింపజేయాలని కోరుతూ 2010 మే 24కు ముందు పదవీ విరమణ చేసిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) ఉద్యోగులు పెట్టుకున్న దరఖాస్తులను కంట్రోలింగ్ అథారిటీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల తీర్పునిచ్చారు. గ్రాట్యుటీ పెంపు నిర్ణయాన్ని 2010 మే 24 తర్వాత ఈసీఐఎల్ బోర్డ్ తీసుకున్న విషయాన్ని న్యాయమూర్తి గుర్తుచేశారు. పెంచిన గ్రాట్యుటీని వర్తింపజేయాలని కోరుతూ 2008లో పదవీ విరమణ చేసిన డాక్టర్ టీఎస్.కృష్ణారావు కంట్రోలింగ్ అథారిటీ వద్ద దరఖాస్తు చేసుకున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలని అథారిటీ నిర్ణయించింది. అథారిటీ చర్యలను సవాలు చేస్తూ ఈసీఐఎల్ సీఎండీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ రామలింగేశ్వరరావు విచారణ జరిపారు. గ్రాట్యుటీని రూ.3.50 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాలని 2010 మే 24న బోర్డ్ తీర్మానం చేసిందని పేర్కొన్నారు. కృష్ణారావు 2008లోనే పదవీ విరమణ చేశారని, దీంతో ఆయనకు కొత్త గ్రాట్యుటీ సాధ్యం కాదన్నారు. వాదనలను పరిగ ణించిన న్యాయమూర్తి, 2010 మే 24కు ముందు విరమణ చేసిన ఈసీఐఎల్ ఉద్యోగుల దరఖాస్తులను పరిగణించడానికి వీల్లేదంటూ తీర్పునిచ్చారు. -
కబ్జా స్థలాలు స్వాధీనం చేసుకోండి
ఆర్అండ్బీ అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన రోడ్లు భవనాలశాఖ స్థలాల ను తిరిగి స్వాధీనం చేసుకుని, వాటి సరిహద్దులు నిర్ధారించి శాశ్వత రక్షణ చర్యలు చేపట్టాలని ఆ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వాటిని తిరిగి రికార్డుల్లో పొందుపరచాలన్నారు. సోమవారం ఆయన ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం చేపట్టిన రోడ్లు, వంతెనల పనులను వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. భూవివాదాల వల్ల పనుల్లో జాప్యం లేకుం డా చూడాలన్నారు. ఆ వివాదాలను సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో చర్చించి పరిష్కరించుకోవాలని సూచించా రు. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చ టం, శిథిలమైన రహదారులకు మరమ్మతు చేయటం, మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరసల రహదారుల నిర్మాణం, నదులు, వాగులు వంకలపై చేపట్టిన బ్రిడ్జిల నిర్మాణాన్ని గడువులోగా పూర్తిచేయాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు ఇల్లు, కార్యాలయా ల సముదాయం నిర్మాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున డిసెంబరు నాటికి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలన్నారు. గడువులోగా రోడ్లు పూర్తి చేయని కాంట్రాక్టర్లను ఉపేక్షించబోమన్నారు. హైదరాబాద్‌లో తుదిదశకు చేరుకున్న న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ను డిసెంబరు కల్లా పూర్తిచేయాలన్నారు. ఎర్రమంజిల్‌లో పూర్తయిన రోడ్లు భవనాల శాఖ కార్యాలయ భవనాన్ని త్వరలో ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ, ఈఎన్సీలు బిక్షపతి, రవీందర్రావు, గణపతిరెడ్డి తదితరులు హాజరయ్యారు. -
మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు
ఈపీఎఫ్‌వో, ఈఎస్ఐసీకి కార్మిక శాఖ ఆదేశం న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ప్రారంభమైన మూడేళ్ల దాకా రిటర్నుల దాఖలు నుంచి, తనిఖీల నుంచి వాటికి మినహాయింపులిచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో, కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్ఐసీకి కే ంద్ర కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశిత 9 కార్మిక చట్టాలను సక్రమంగా పాటిస్తున్నట్లు స్వయం ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. తొలి ఏడాది ఇందుకు సం బంధించి ఆన్లైన్లో సెల్ఫ్-డిక్లరేషన్ ఫారం సమర్పిం చాల్సి ఉం టుంది. తదుపరి రెండేళ్లు కూడా తనిఖీలు, రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు విశ్వసనీయమైన ఫిర్యాదు రాతపూర్వకంగా వచ్చిన పక్షంలో ఆయా విభాగాలు తనిఖీలు చేయొచ్చు. -
బీజేపీ రథసారధి ఎన్నికకు రంగం సిద్ధం
-
‘డిజిటల్’ చదువులు
► ఉన్నత పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేయాలి ► వీడియో కాన్ఫరెన్స్‌లో హెచ్ఎంలకు డీఈఓ ఆదేశం తెలంగాణలోనే మొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో డిజిటల్ క్లాసుల బోధన సోమవారం జిల్లాలో ప్రారంభమైంది. ప్రైవేట్‌కు తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు డీఈఓ రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. - తాండూరు తాండూరు: తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో దృశ్యశ్రవణం ద్వారా పాఠ్యాంశాల (డిజిటల్ క్లాసుల) బోధ న జిల్లాలో సోమవారం మొదలైంది. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలతోపాటు విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లా విద్యాధికారి రమేష్ డిజిటల్ క్లాసుల బోధనకు శ్రీకారం చుట్టారు. ఈ విషయాన్ని ఈనెల 15న ‘సాక్షి’ దినపత్రికలో జిల్లాలో ఇక ‘డిజిట ల్ చదువులు’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. రాష్ట్ర మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) నుంచి ఇందుకోసం సుమారు రూ.50 వేల నిధులను కేటాయించారు. ఇందులో భాగంగా వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు హైదరాబాద్ నుంచి తెర, ప్రొజెక్టర్, రెండు స్పీకర్లు తదితర సాంకేతిక పరికరాలను కొనుగోలు చేశారు. కొన్ని ఉన్నత పాఠశాలల్లో సోమవారం లాంఛనంగా డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు ప్రారంభించారు. డిజిటల్ క్లాసుల అమలుపై డీఈఓ రమేష్ సోమవారం ప్రధానోపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయులు పక్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. తాండూరులోని ప్రభుత్వ నంబ ర్-1 పాఠశాలలో డిజిటల్ క్లాసులను ప్రధానోపాధ్యాయుడు ప్రారంభించారు. యాలాల బా లుర ఉన్నత పాఠశాలలో ఎంఈఓ ప్రారంభిం చారు. బషీరాబాద్, యాలాల, తాండూరు, పెద్దేముల్ మండలాల పరిధిలోని దామర్‌చెడ్, బెన్నూర్, యాలాల (బాలికల), దేవనూర్, రెడ్డిఘనాపూర్, మంతట్టి, బషీరాబాద్ (ఉర్దూమీడియం), నవల్గ, గోటిగ, జీవన్గీ, పెద్దేముల్ పాఠశాలలకు సాంకేతిక పరికరాలు వచ్చాయి. అందరికీ డిజిటల్ విద్య అవసరం: యాంకర్ సుమ శంషాబాద్: నేటి సమాజంలో అందరికీ డిజి టల్ విద్య అవసరమని యాంకర్ సుమ అ న్నారు. శంషాబాద్ పట్టణంలోని జిల్లా పరి షత్ బాలికల ఉన్నత పాఠశాలకు సోమవా రం సొంత ఖర్చులతో డిజిటల్ విద్యకు సం బంధించిన పరికరాలను ఆమె అందజేశారు. గతంలో పాఠశాలలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న యాంకర్ సుమ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించేం దుకు సిద్ధమయ్యారు. ఇటీవలే పాఠశాలకు కొంత మొత్తాన్ని ఆర్థిక సాయంగా అందజేసిన సుమ తాజాగా డిజిటల్ పరికరాలను అందజేయడంతో పాఠశాల హెచ్ఎం ఉమామహేశ్వరి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మేలు.. డిజిటల్ క్లాసులతో ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుంది. దృశ్యశ్రవణబోధనతో విద్యార్థులకు పాఠ్యాంశాలపై అవగాహన పెరుగుతుంది. త ద్వారా విద్యాప్రమాణాలు మెరుగుపడతాయి. - డి.రమేష్, హెచ్ఎం, రెడ్డి ఘనాపూర్, ఉన్నత పాఠశాల -
ద రోబో ‘నర్స్’
రిమోట్ తీసుకురా.. అనగానే టక్కున ఇచ్చేస్తుంది.. నీరు కావాలంటే వెంటనే అందిస్తుంది.. పెన్ను, పేపర్ తీసుకురమ్మంటే రయ్‌మని తెచ్చిస్తుంది.. ఇంతకీ ఇవన్నీ చేసేదెవరనుకుంటున్నారా..! రోబో..! అవును రోబోనే.. ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి పెట్టేందుకు కూడా సిద్ధమైంది. టొయోటో కంపెనీ ప్రత్యేకంగా ఈ రోబోను తయారుచేసింది. వస్తువు ఎక్కడుందో కమాండ్ ఇస్తే చాలు దానికున్న చేతితో తీసుకొచ్చిస్తుంది. 4 అడుగుల 4 అంగుళాలు ఉండే ఈ రోబో.. చిన్న కాగితపు ముక్క నుంచి దాదాపు 1.2 కిలోల బరువున్న ఏ వస్తువునైనా మోయగలుగుతుంది. దీనికున్న కెమెరాలు, స్కానర్ల సాయంతో గదిలో ఏక్కడ ఏ వస్తువున్నా వెంటనే గుర్తుపట్టగలుగుతుంది. గంటకు దాదాపు 800 మీటర్ల వేగంతో మాత్రమే నడవగలిగే ఈ రోబోను ఎక్కడినుంచైనా ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ సాయంతో ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు వృద్ధులకు, వికలాంగులకు, ఆస్పత్రుల్లోని రోగులకు ఈ రోబోలు ఎంతో ఉపయోగపడతాయి కూడా.