మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు | 700 startups ask PM Narendra Modi to speak up on net neutrality | Sakshi

మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు

Published Tue, Jan 26 2016 2:01 AM | Last Updated on Sun, Sep 3 2017 4:18 PM

మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు

మూడేళ్ల దాకా స్టార్టప్స్ జోలికెళ్లొద్దు

ఈపీఎఫ్‌వో, ఈఎస్‌ఐసీకి కార్మిక శాఖ ఆదేశం
 న్యూఢిల్లీ: స్టార్టప్ సంస్థలకు ఊతమిచ్చేలా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించింది. ప్రారంభమైన మూడేళ్ల దాకా రిటర్నుల దాఖలు నుంచి, తనిఖీల నుంచి వాటికి మినహాయింపులిచ్చింది. ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్‌వో, కార్మిక రాజ్య బీమా సంస్థ ఈఎస్‌ఐసీకి కే ంద్ర కార్మిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

నిర్దేశిత 9 కార్మిక చట్టాలను సక్రమంగా పాటిస్తున్నట్లు స్వయం ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. తొలి ఏడాది ఇందుకు సం బంధించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్-డిక్లరేషన్ ఫారం సమర్పిం చాల్సి ఉం టుంది. తదుపరి రెండేళ్లు కూడా తనిఖీలు, రిటర్నుల దాఖలు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే, నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్లు విశ్వసనీయమైన ఫిర్యాదు రాతపూర్వకంగా వచ్చిన పక్షంలో ఆయా విభాగాలు తనిఖీలు చేయొచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement