పాట్నా : ఈ నోట్ల కట్టల్ని చూసి ఏఐ జనరేటెడ్ ఫొటో అనుకునేరు. ఓ జిల్లా విద్యాశాఖ అధికారి ఇంట్లో దొరికిన నోట్ల కట్టలు. బెడ్ కింద, సోఫా కింద ఇలా ఎక్కడ పెట్టినా నోట్ట కట్టలే దర్శనమిస్తున్నారు. దీంతో నోట్ల ఈ నోట్ల కట్టల్ని చూసిన అవినీతి నిరోధక శాఖ అధికారులు సైతం ముక్కున వేలేసేకుంటున్నారు. ఇంతకీ ఆ విద్యాశాఖ అవినీతి అధికారి ఎవరనుకుంటున్నారా?
జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO).రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతిష్ఠాత్మక ఉద్యోగాల్లో ఒకటి. డీఈవోగా జిల్లాల్లో విద్యా నాణ్యతను మెరుగుపరచడం, పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుంది. అలాంటి అత్యున్నత పదవిలో ఉన్న రజనీకాంత్ ప్రవీణ్. భారీ అవినీతికి పాల్పడ్డారు. బీహార్ రాష్ట్రం బెతియా జిల్లా విద్యాశాఖలో పనిచేస్తున్న సీనియర్ అధికారి రజనీకాంత్ ప్రవీణ్ ఇంటిపై విజిలెన్స్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీ మొత్తంలో నగదును వెలుగులోకి వచ్చింది.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో విజిలెన్స్ శాఖ చేసిన దాడిలో ప్రవీణ్ ఇంటి బెడ్‌రూమ్,సోఫాల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ప్రస్తుతం సంబంధిత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాగా ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది.
KE PAISA BOLTA HAI
Bihar: Mountain of cash found at DEO’s residence, vigilance dept orders machines to count currency notes pic.twitter.com/kaCw2coEfR— Shakeel Yasar Ullah (@yasarullah) January 24, 2025
Comments
Please login to add a commentAdd a comment