
హెచ్‌ఎంను సస్పెండ్ చేసిన డీఈవో
హొళగుంద: కర్నూలు జిల్లా హొళగుంద మండలం ముద్దటమాగి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎం జయరాజ్ విధులు నిర్వర్తిస్తున్నారు. జయరాజ్ సోమవారం తనవెంట తెచ్చుకున్న మద్యం బాటిల్ తీసుకుని పాఠశాల టాయిలెట్‌లోకి వెళ్లారు. మద్యం బాటిల్ తీసుకుని వెళుతుండటాన్ని విద్యార్థులు గమనించి బాత్రూం దగ్గరకు వెళ్లి చూశారు.
దీంతో హెచ్‌ఎం కోపంతో ఊగిపోతూ ప్లాస్టిక్ పైప్‌తో విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టాడు. కొందరు విద్యార్థులు ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. హెచ్‌ఎం మద్యం మత్తులో ఊగుతుండడాన్ని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో–2 జగన్నాథం అక్కడికి చేరుకోవడంతో గ్రామస్తులు హెచ్‌ఎంపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడంతో పాటు పాఠశాలకు తాళాలు వేశారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎంను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి శామ్యూల్‌పాల్ ఉత్తర్వులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment