సాక్షి, హైదరాబాద్: డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటులో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా అతి కీలకమైన నెట్‌వర్క్ ప్రధాన సమస్యగా మారుతోంది. ఇంటర్నెట్ సదుపాయం లేకుంటే రూ.కోట్లు వెచి్చంచినా ప్రయోజనం ఏమిటని సర్వశిక్షా అభియాన్ సందేహాలు లేవ నెత్తుతోంది. మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా 3 వేల ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి రూ.300 కోట్లు వెచి్చంచాలనుకున్నారు. ఎంపిక చేసిన స్కూల్‌లో రెండు స్మార్ట్ క్లాస్ రూముల చొప్పున, మొత్తం 6 వేలు ఏర్పాటు చేయాలని భావించారు. దీనిపై ప్రభుత్వం అధికారుల చేత సర్వే చేయించింది.
మొబైల్ డేటా కూడా అంతంత మాత్రమే..
ప్రైవేటు స్కూల్స్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆశయం. ఇందులో భాగంగానే స్మార్ట్ క్లాసు రూంల ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తెచి్చంది. డిజిటల్ క్లాస్ రూంలో ప్రొజెక్టర్, కంప్యూటర్లు, డిజిటల్ తెర, ఇంటరాక్టివ్ వైట్ బోర్డులను అమర్చాల్సి ఉంటుంది. క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా డిజిటల్ పాఠాలను విద్యార్థులకు చేరవేయాలని భావించారు.
అయితే, రాష్ట్రవ్యాప్తంగా 3 వేల స్కూల్స్‌ను డిజిటల్ క్లాసు రూంల ఏర్పాటుకు ఎంపిక చేస్తే 131 మండలాల పరిధిలోని 878 గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేదని తేలింది. ఈ ప్రాంతాల్లో కనీసం మొబైల్ నెట్‌వర్క్ కూడా అంతంత మాత్రమేనని అధికారులు గుర్తించారు. కుమ్రుం భీం ఆసిఫాబాద్, నిర్మల్, ములుగు జిల్లాల్లో సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై అధికారులు దృష్టి పెట్టారు.
హార్డ్ డిసు్కతో నెట్టుకు రావలసిందేనా?
6 నుంచి 10వ తరగతి వరకూ డిజిటల్ పాఠాలు అందించాలని భావిస్తున్నారు. అవసరమైన పాఠాలను నిపుణుల చేత ముందే రికార్డు చేసి, వాటిని క్లౌడ్‌లో నిక్షిప్తం చేస్తారు. నెట్‌వర్క్ ద్వారా ప్రతి పాఠశాల క్లౌడ్‌కు కనెక్ట్ అవ్వొచ్చు, ఇది వీలుకాని పక్షంలో హార్డ్ డిస్క్ సాయంతో పాఠాలు వినే ఏర్పాటు చేస్తారు. మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం లేనప్పుడు ఇదే సరైన విధానంగా భావిస్తున్నారు. కానీ దీనివల్ల ప్రయోజనం పెద్దగా ఉండదని అధికారులు చెబుతున్నారు.
నెట్‌వర్క్ ఉంటే విద్యార్థి అర్థం కాని పాఠాన్ని మళ్ళీ మళ్ళీ వినే అవకాశం ఉంది. ఇంటి వద్ద కూడా డిజిటల్ లే»ొరేటరీకి కనెక్ట్ అవ్వొచ్చని నిపుణులు చెబుతున్నారు. సెంట్రల్ సర్వర్‌లో ఉంటుంది కాబట్టి డేటా పోయే అవకాశం ఉండదు. అదే హార్డ్ డిస్క్ స్కూల్లో ఒకచోటే ఉంటుంది. డేటా పోయేందుకూ, ఎర్రర్ వచ్చేందుకూ అవకాశం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎంపిక చేసిన గ్రామాలకు ఇంటర్నెట్ సేవలు విస్తరింపజేయడమా? హార్డ్ డిస్క్‌ల ద్వారా పాఠాలు చెప్పించడమా? అనే దానిపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోవలసి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment