మీ పిల్లలను ఇలా చదివించండి | Corona Lockdown india: Digital Learning for Students | Sakshi
Sakshi News home page

మీ పిల్లలను ఇలా చదివించండి

Published Mon, Mar 23 2020 3:48 PM | Last Updated on Mon, Mar 23 2020 4:05 PM

Corona Lockdown india: Digital Learning for Students - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో పిల్లలను డిజిటల్‌/ ఇ–లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫారమ్స్‌ ద్వారా చదివించుకోవాల్సిందిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ సూచించింది. ఈ మేరకు తమ తమ రాష్ట్రాల్లోని విద్యార్ధులకు ఈ సమాచారం అందేలాగ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. ఈ డిజిటల్‌/ఇ–లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫారŠమ్స్‌ అన్నీ కూడా ఉచితంగానే లభ్యమవుతాయని స్పష్టం చేసింది. (కరోనా ఎఫెక్ట్‌: బాధ్యత లేని మనుషులు)

స్కూలు విద్య: దీక్ష వెబ్‌సైట్‌లో సీబీఎస్‌ఈ, ఎన్‌సీఈఆర్‌టీ, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సిలబస్‌లతో కూడిన పాఠ్యపుస్తకాలు బహుళ భాషల్లో అందుబాటులో ఉన్నాయి. 1వ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు 80,000కు పైగా ఈ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన యాప్‌ను ఐఒఎస్‌ లేదా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వెబ్‌సైట్‌ చిరునామా: https://diksha.gov.in/

► ఇ–పాఠశాల వెబ్‌సైట్‌లో 1వ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు బహుళ భాషల్లో 1,886 ఆడియోలు, 2,000 వీడియోలు, 696 ఇ–బుక్స్, 504 ఫ్లిప్‌ బుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. వెబ్‌సైట్‌ చిరునామా:  http://epathshala.nic.in/

► ఎన్‌ఆర్‌ఓఇఆర్‌ పోర్టల్‌లో వివిధ భాషల్లో మొత్తం 14,527 ఫైల్స్‌ ఉన్నాయి. ఇందులో 401 కలెక్షన్స్, 2,779 డాక్యుమెంట్స్, 1,345 ఇంటరాక్టివ్స్, 1,664 ఆడియోలు, 2,586 ఇమేజెస్, 6,153 వీడియోలు ఉన్నాయి. వెబ్‌సైట్‌ చిరునామా https://nroer.gov.in/welcome

► స్వయం నేషనల్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫాంలో తొమ్మిదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు గ్రాడ్యుయేషన్, పీజీ, ఇంజనీరీంగ్, మానవ వనరులు, సోషల్‌ సైన్స్, లాకు చెందిన 1,900 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వెబ్‌ చిరునామా: http://swavam.qov.in/

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement