ఆంగ్లమాద్యమాన్ని ప్రోత్సహించేందుకే డిజిటల్ తరగతులు
నాయుడుపేట:
ఆంగ్లమాద్యమాన్ని ప్రోత్సహించేందుకే డిజిటల్ తరగతులు ప్రవేశ పెడుతున్నట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పీ మాణిక్యం పేర్కొన్నారు. నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం డిజిటల్ తరగతులు ప్రారంభించిన ఆయన మాట్లాడారు.
-
జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి మాణిక్యం
నాయుడుపేట:
ఆంగ్లమాద్యమాన్ని ప్రోత్సహించేందుకే డిజిటల్ తరగతులు ప్రవేశ పెడుతున్నట్లు జిల్లా వృత్తి విద్యాశాఖాధికారి పీ మాణిక్యం పేర్కొన్నారు. నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం డిజిటల్ తరగతులు ప్రారంభించిన ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అధిక భాగం జూనియర్ కళాశాలలు తెలుగు మీడియం ఉండటంతో ఆంగ్లమాద్యమాన్ని ప్రవేశ పెట్టి ఆంగ్లంపై మక్కువ పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరు ప్రభుత్వం జూనియర్ కళాశాలల్లో డిజిటల్ తరగతులు ప్రవేశ పెడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా నాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు వివరించారు. జిల్లా కేంద్రంలోని రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, విడవలూరు, కోవూరు, గూడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా డిజిటల్ తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో ఆంగ్ల అధ్యాపకుడు డాక్టర్ కల్లూరు గురవయ్య పాల్గొన్నారు.