జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు
కొండాపూర్(సంగారెడ్డి): రాష్ట్ర ప్రభుత్వం హైస్కూల్ విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు కసరత్తు చేస్తోంది. కరోనా నేపథ్యంలో ప్రత్యక్ష తరగతులు లేకపోవడంతో విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యం తగ్గింది. ఈ విషయాన్ని పలు సర్వే సంస్థలు సైతం వెల్లడించాయి. ఈ క్రమంలోనే ప్రాథమిక స్థాయిలో తొలిమెట్టు (ఎఫ్‌ఎల్‌ఎన్) కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇదే తరహాలో ఉన్నత పాఠశాలలో కూడా కనీస అభ్యసన సామర్థ్యాలు పెంచేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ విద్యా సంవత్సరం నుండి లిప్ (లర్నింగ్ ఇంప్రూవ్ మెంట్ ప్రోగ్రాం) అమలుకు కసరత్తు చేస్తున్నారు.
● కరోనా కారణంగా 2020–21 సంవత్సరం నుంచి విద్యార్థులు రెండేళ్లు పాఠశాలలకు వెళ్లలేదు. దీంతో డిజిటల్ తరగతులు నిర్వహించారు. ఈ విధానంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి.
● తెలుగు, హిందీ, ఆంగ్లం చదవడం, రాయడం రాని వారు కూడా 9వ తరగతిలోనూ ఉన్నారని, అదే విధంగా చిన్నచిన్న కూడికలు, తీసివేతలు, గుణకారాలు, బాగాహారాలు రానివారు కూడా ఉన్నారని పలు సర్వే సంస్థలు వెల్లడించాయి.
● ఇలాంటి విద్యార్థులలో కనీస అభ్యసన సామర్థ్యాలను పెంచేందుకు ఈ లిప్ కార్యక్రమం ఉపయోగపడనుంది.
● గత సంవత్సరం విద్యాశాఖ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే ఇదే తరహాలో తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ప్రస్తుతం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
● విద్యా సంవత్సరం ప్రారంభం నుండే విద్యార్థుల ను చదివించడం, రాయించడం, పాఠాలు వినేలా చేయడం, సాధనల్లో పిల్లల భాగస్వామం, ప్రతి స్పందనలు, స్లిప్ టెస్ట్‌లు వంటి వాటిని నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 192 ప్రాథమికోన్నత పాఠశాలలు, 240 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమికోన్నత పాఠశాలలో 6 నుంచి 8వ తరగతి వరకు 11 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు 92 వేల మంది ఉన్నారు.
విద్యార్థులకు ఉపయోగకరం
కరోనా నేపథ్యంలో విద్యార్థులు రెండు సంవత్సరాలుగా డిజిటల్ తరగతులకే పరిమితమమాయ్యరు. దీంతో చాలా మంది విద్యార్థులకు చదవడం, రాయడం కూడా పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు తొలిమెట్టు కార్యక్రమం ద్వారా రాయడం, చదవడం వంటి వాటిని నేర్పించారు. ఈ తరహాలోనే విద్యా సంవత్సరం నుంచి ఉన్నత పాఠశాల విద్యార్థులకు లిప్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment