నేటి నుంచి డిజిటల్ బోధన
నిజామాబాద్ అర్బన్ : నేటి నుంచి ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కానుంది. ఇందుకు జిల్లా విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. వారం రోజులుగా ఆర్మూర్‌లో డిజిటల్ విద్యాబోధనకు సంబంధించి ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. మొదట 241 ప్రభుత్వ పాఠశాలలను ఎంపిక చేయగా సౌకర్యాల ఏర్పాటులో ఆలస్యం కావడంతో ప్రస్తుతం 141 పాఠశాలల్లో బోధించనున్నారు.
గతంలోనే డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కావల్సి ఉండేది. జిల్లాల పునర్ విభజన ప్రక్రియతో ఆటంకం ఏర్పడింది. అనంతరం మళ్లీ ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు సర్కారు శ్రీకారం చుట్టింది. కామారెడ్డి జిల్లాలో కూడా 111 పాఠశాలల్లో డిజిటల్ విద్యా ప్రారంభం కానుంది.
141 పాఠశాలలు
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 283 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. ఇందులో 141 పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి ప్రొజెెక్టర్లు, కంప్యూటర్ ఏర్పాటు, హార్డ్‌డిస్క్‌లు, ఎల్‌ఈడీలను విద్యాశాఖ ఆయా పాఠశాలల్లో ఏర్పాటు చేసింది. ఉన్నత పాఠశాలల్లో ఈ డిజిటల్ విద్యాబోధనను ఏర్పాటు చేస్తున్నారు. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు మన టీవీ ద్వారా ప్రసారమయ్యే విద్యాబోధనను చేపట్టనున్నారు. ఆయా పాఠశాలల్లో ప్రొజెక్టర్, హార్డ్‌డెస్క్‌లను అందుబాటులో ఉంచనున్నారు. దీని ద్వారా మన టీవి కార్యక్రమం రోజూ ఏ సమయంలోనైతే పాఠాలు ప్రసారమవుతాయో దానికి సంబంధించి సమయానికి ముందుగానే తెలియజేస్తారు. ఆ సమయంలో సంబంధిత ఉపాధ్యాయుడు పాఠాలను బోధించనున్నారు. తరగతుల వారిగా షెడ్యుల్‌ను కేటారుుంచనున్నారు. సంబంధిత పాఠశాల ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కూడా పూర్తి చేశారు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులకు సాంకేతిక పరిజ్ఞానంపై అనుభవం లేదు. నెట్‌వర్క్ సమస్యలు వంటి తలెత్తనున్నారుు. ఆ సమయంలో ప్రసారం అయ్యే విద్యాబోధన మళ్లీ అందుబాటులో ఉండదు.
తదనంతరం ఉపాధ్యాయుడు విద్యార్థులకు ఏలా బోధిస్తాడన్నది అధికారులు పేర్కొనలేదు. మరో వైపు జిల్లాలోని సరిహద్దు ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నారుు. సంబంధిత పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధన పరికరాలకు సరైన రక్షణ లేకుండా పోరుుంది. ఇదివరకే పాఠశాలల్లో కంప్యూటర్లు, వంట సామగ్రిని దొంగలించడం తరచుగా జరుగుతుంది. ప్రస్తుతం విలువైన పరికరాలకు సరైన రక్షణ లేకుండా పోవడం ఉపాధ్యాయకులకు ఆందోళన కలిగిస్తోంది. దీనిపై కూడా ఉన్నతాధికారులు రక్షణకు సంబంధించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కాగా, డీఈవో రాజేశ్‌ను అడగగా.. నేటి నుంచి డిజిటల్ విద్య ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.