బెర్లిన్: అంతర్జాతీయంగా అగ్రరాజ్యాలైన బ్రిటన్, అమెరికా ప్రభ మరింతగా దిగజారిపోతున్నట్టుగా కనిపిస్తోంది. బ్రిటన్‌ను అత్యుత్తమ దేశంగా అక్కడ ప్రజలు అనుకుంటారేమో కానీ జర్మనీకి చెందిన వర్జ్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో టాప్ –10 దేశాల్లో బ్రిటన్‌కు చోటు లభించలేదు. అత్యంత సమర్థంగా పని చేస్తున్న దేశాల జాబితాలో ఫిన్‌లాండ్ వంటి దేశాల తర్వాత 13వ స్థానంలో బ్రిటన్ నిలిస్తే, అగ్రరాజ్యం అమెరికా 23వ స్థానంలో ఉంది.
నిఫ్తీ పొలిటికల్ టూల్ సాయంతో 173 దేశాల్లో రోడ్లు, నీళ్లు, విద్యుత్, స్కూళ్లు, ఆస్పత్రులు, పోలీసులు వంటివన్నీ పరిగణనలోకి తీసుకుని ర్యాంకులు ఇచ్చారు. డాక్టర్ దగ్గర వేచి చూసే సమయం దగ్గర్నుంచి విద్యుత్ సదుపాయం వరకు ప్రతీ రంగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక అత్యుత్తమ పని తీరు కనబరిచిన దేశంగా సింగపూర్ అగ్రభాగంలో ఉంటే లిబియా అట్టడుగున నిలిచింది. సింగపూర్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఎస్తోనియా అగ్రభాగంలో ఉన్నాయి. భారత్ 110వ స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment