బీజేపీ మహిళా సురక్షా యాత్ర బహిరంగ సభలో జయంతి, సుభాషిణి, సురమా, నమితా తదితరులు
బరంపురం : మహిళలపై అత్యాచారాల కేసుల్లో రాష్ట్రంలో గంజాం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇటీవల ఒక సర్వేలో తేలిందని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి ఆరోపించారు. స్థానిక రామలింగేశ్వర్ ట్యాంక్ రోడ్‌లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మహిళా సురక్షా యాత్ర సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి మాట్లాడుతూ రాష్టాంలో బీజేడీ ప్రభుత్వం మహిళల హక్కులను కాల రాస్తోందని మండిపడ్డారు. ఇందుకు స్వయా న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని విమర్శించారు. జిల్లాలో ప్రతి రోజూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో గంజాం జిల్లా నిలిచిందని ఆవేదన వెలిబుచ్చారు.
భారత రాజ్యాంగం కల్పించిన మహిళల హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాటం సాగించాలని ఇందుకు అందరూ కృషి చేయాలని కోరారు. బహిరంగ సభలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుభాషిణి పట్నాయక్, బీఎంసీ కార్పొరేటర్ నమి తా పాఢి, మాజీ మంత్రి సురమా పాఢి తదితర వందలాది మంది మహిళలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment