Ganjam district
-
పెళ్లింట విషాదం.. రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి..
భువనేశ్వర్: ఒడిశాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పెళ్లి వేడుక జరుగుతున్న ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆర్టీసీ బస్సును పెళ్లి బృందంతో వెళ్తున్న ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ఘటనా స్థలంలోనే మృతిచెందగా మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వివరాల ప్రకారం.. ఒడిశాలోని గంజాం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున దిగపహండి సమీపంలో ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనా స్థలంలోనే 10 మంది మృతిచెందగా.. మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, రోడ్డు ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన పోలీసులు, సహాయక బృందం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంతో గాయపడిని వారిని బ్రహ్మపురలోని ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించి వైద్యసాయం అందిస్తున్నారు. Odisha | 10 people died and 8 injured in a bus accident in Ganjam district, on Sunday late night. Injured were immediately rushed to the MKCG Medical College in Berhampur for treatment. "Two buses collided in which 10 people died. The injured were immediately admitted to MKCG… pic.twitter.com/OE3G3BhMFl — ANI (@ANI) June 26, 2023 అయితే, ఓ పెళ్లికి హాజరయ్యేందుకు పెళ్లి బృందం ప్రైవేటు బస్సులో వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు రాయ్‌గఢ్ నుంచి భువనేశ్వర్‌కు వెళ్తోంది. కాగా, మృతుల్లో ఎక్కువ మంది ప్రైవేటు బస్సులో ప్రయాణిస్తున్నవారే ఉన్నారని పోలీసులు తెలిపారు. #ଦିଗପହଣ୍ଡିରେ_ଭୟଙ୍କର_ଦୁର୍ଘଟଣା ଗଂଜାମ ଦିଗପହଣ୍ଡିରେ ଦୁଇ ବସ୍ ମଧ୍ୟରେ ମୁହାଁମୁହିଁ ଧକ୍କା..ସମସ୍ତ ଆହତ ବ୍ରହ୍ମପୁର ବଡ଼ ମେଡିକାଲରେ ଭର୍ତ୍ତି କରାଯାଇଛି#MKCG #accident #Ganjam #Odisha #OTV pic.twitter.com/t52OfjNgxB — ଓଟିଭି (@otvkhabar) June 26, 2023 ఇక, ఈ ప్రమాదంపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడినవారికి మెరుగైన వైద్యసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో మృతుల కుటుంబాలకు రూ.3 లక్షలు ఆర్థికసాయం చేస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ఇది కూడా చదవండి: టిక్కెట్ లేకుండా ‘వందేభారత్’ ఎక్కి.. భయంతో వాష్‌రూమ్‌లో నక్కి.. -
ఎగ్జామ్ సెంటర్‌కు ఎమ్మెల్యే వస్తున్నాడని హడావుడి.. తీరా ఆయన చూస్తే..
సాక్షి, గంజాం: కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలు నిర్వహించకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మెట్రిక్ ఫలితాలను ప్రకటించిన విషయం విదితమే. అయితే ఈ ఫలితాల పట్ల ఎవరైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో వారికి మరోసారి ఆఫ్‌లైన్‌లో పరీక్షలు రాసి, మంచి మార్కులు సాధించుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో గంజాం జిల్లాలో శుక్రవారం మెట్రిక్ పరీక్షలు (టెన్త్ ఎగ్జామ్స్) ప్రారంభమయ్యాయి. కాగా తొలిరోజు పరీక్షకు సురడా నియోజకవర్గానికి చెందిన బీజేడీ ఎమ్మెల్యే పూర్ణచంద్ర స్వంయి హాజరు కావడం సంచలనం రేకెత్తించింది. బంజనగర్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రానికి ఉదయం చేరిన ఈయనను చూసి, అక్కడి సిబ్బంది ఎమ్మెల్యే సందర్శనకు వస్తున్నారని అంతా హడావిడి చేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యే ఎగ్జామ్ రాసేందుకు వచ్చారని తెలుసుకుని అంతా అవాక్కయ్యారు. -
పెళ్లయిన కొన్నాళ్లకే వరుడు కన్నుమూత.. విషాదంలో వధువు
బరంపురం: గంజాం జిల్లా సరగడ సమితిలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సూర్యకాంత్ గౌడ కరోనా మహమ్మారి బారిన పడి మృతి చెందారు. సమితిలోని చికిలి గ్రామంలో నివాసం ఉంటున్న సూర్యకాంత్ గౌడకు మార్చి 10వ తేదీన వివాహం జరిగింది. వివాహం జరిగి మూడు నెలలు కాకముందే ఆయన మృతిచెందిన వార్త జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితుల్లో తీవ్ర విషాదం నింపింది. సూర్యకాంత్ గౌడకు కొద్ది రోజుల క్రితం కరోనా పాజిటివ్ నమోదు కావడంతో జిల్లా కోవిడ్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుదూ సోమవారం ఉదయం 10 గంటల సమయంలో మృతి చెందారు. అయితే కరోనా భయంతో ఉపాధ్యాయుడి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు బంధువులు, స్నేహితులు ఎవరూ ముందుకు రాలేదు. చివరికి తహసీల్దార్ స్పందించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తి చేశారు. చదవండి: తండ్రి సాహసం.. బిడ్డకు ప్రేమతో 300 కి.మీ సైకిల్‌పై.. -
పదహారేళ్ల బాలికపై లైంగికదాడి
బరంపురం: గంజాం జిల్లాలోని బుగడా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న కొందపతరా గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికపై అదే గ్రామానికి చెందిన అక్షయ మజ్జి(26) లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేసి, జైలుకి తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. ఈ నెల 19వ తేదీన గ్రామంలో బాలిక కనిపించకపోవడంపై బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఈ నెల 22వ తేదీన బాలికతో పాటు బైక్‌పై వస్తున్న అక్షయ మజ్జిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బాలికను వైద్య పరీక్షల నిమిత్తం తొలుత బుగడా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్యులు ఎంకేసీజీ మెడికల్‌కి తరలించారు. ఈ క్రమంలో ఆ బాలికపై సదరు యువకుడు లైంగికదాడికి పాల్పడినట్లు నిర్ధారణ కాగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకి తరలించినట్లు సమాచారం. బాలికని బైక్‌పై తీసుకువెళ్లి, నిర్మానుష్య ప్రదేశంలో యువకుడు లైంగిక దాడి చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. -
కరోనా సోకిన మహిళ పండంటి పాపకు జన్మ
బరంపురం: గంజాం జిల్లా పులసరా బ్లాక్ ప్రాంతానికి చెందిన కోవిడ్ బాధిత గర్భిణి సోమవారం మహిళా సిటీ అసుపత్రిలో ప్రసవించారు. డెడికేటెడ్ కోవిడ్‌కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్న ఆమె అడశిశువుకు జన్మనిచ్చారు. శిశువుకు పరీక్షలు నిర్వహించిన వైద్యుడు ప్రశాంతకుమార్ మాట్లాడుతూ.. బిడ్డకు కోవిడ్ లక్షణాలేమీ లేవని తెలిపారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కొందమాల్ జిల్లా చకాపదా సమితి పరిధిలో ఓ నిండు గర్భిణి కరోనాతో బాధపడుతూ బ్రాహ్మణపధా ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ అడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక్కడ కూడా తల్లి, బిడ్టా క్షేమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
కరోనా భయం.. మూడు రోజులు గడిచినా!
సాక్షి, ఒడిశా: రాష్ట్రంలో గంజాం జిల్లా అంటే కరోనా అన్న భయం ప్రతి ఒక్కరికీ పట్టుకుంది. బరంపురం నుంచి గజపతి జిల్లాకు తిరిగొచ్చిన పేషెంట్లను గ్రామాల్లోకి ప్రజలు రానివ్వకుండా ఆంక్షలు విధిస్తున్నారు. ఇలాంటి ఘటనే గజపతి జిల్లా రాయఘడ సమితి డోంబా పంచాయితీ మునిసింగి గ్రామంలో జరిగింది. మునిసింగి గ్రామానికి చెందిన సావిత్రి రయితో బరంపురంలోని ఎంకేజీసీ మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఆమెతో పాటు కూతురు నిత్యా రయితో కూడా సహాయం కోసం ఉంది. చనిపోయిన తల్లి సావిత్రి రయితోను మునిసింగి గ్రామానికి తీసుకువచ్చి దహన సంస్కారాలు చేశారు. అయితే అక్కడికి వారం రోజుల తరువాత అస్వస్థతతో నిత్యారయితో (48) కూడా చనిపోవడంతో గ్రామస్తులు కరోనా వైరస్ వల్లే చనిపోయిందని భావించి ఆ కుటుంబ సభ్యులను దూరం పెట్టారు. వారి కుటుంబసభ్యులు 14 మందిని గ్రామానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో క్వారంటైన్లో ఉంచారు. గ్రామంలో ఉన్న వారందరూ చందాలు వేసుకుని వారికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. వారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన జమ్ము వీధికి చెందిన ఏడుగుర్ని కూడా పాఠశాలలోనే క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. ఇప్పటికి మూడు రోజులు గడిచినా గ్రామస్తులు వారిని వదలడం లేదు. వారందరినీ ప్రభుత్వ క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందించాలని రాయఘడ సమితి మాజీ అధ్యక్షుడు మోహన్ భుయ్యాన్, సమితి సభ్యులు ఫుల్లోమతి గొమాంగో, గచ్చురాం రయితోలు కలెక్టర్‌ను, గ్రామస్తులను కోరుతున్నారు. -
ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం
సాక్షి, భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది దుర్మరణం చెందగా, మరో 41మంది ప్రయాణికులు గాయపడ్డారు. గంజాం జిల్లాలోని తప్తపాని ఘాటి సమీపంలో బుధవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి బోల్తా పడటంతో 9మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా బస్సు తెక్రీ నుంచి బెర్హాంపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయిదుగురిని ప్రాణాలతో కాపాడారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం బెర్హంపూర్, దిగపహండి ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. -
21 ఏళ్ల జైలు జీవితం.. తర్వాత నిర్దోషిగా తీర్పు
కటక్: సాక్ష్యాధారాలను క్షుణ్నంగా పరిశీలించడంలో జిల్లా కోర్టు పొరపాటు చేయడంతో ఓ వ్యక్తి 21 ఏళ్ల 9 నెలల జైలు శిక్ష అనుభవించి... ఆ తరవాత నిర్దోషిగా విడుదలైన ఘటన ఒడిశాలో జరిగింది. గంజామ్ జిల్లాలోని కంటపాడ గ్రామానికి చెందిన సాధు ప్రధాన్ 1997 నవంబర్‌లో హత్య కేసులో అరెస్టయ్యారు. మహిళను హత్య చేయడంతో పాటు ఆమె ఆభరణాలను కూడా దొంగిలించాడని జిల్లా కోర్టు అతన్ని దోషిగా తేలుస్తూ 1999 ఆగస్టులో జీవిత ఖైదు విధించింది. అనంతరం అతడు హైకోర్టులో తీర్పును సవాల్ చేశారు. ఈ వ్యాజ్యం జూలైలో జస్టిస్ ఎస్కే మిశ్రా, ఏకే మిశ్రాల ధర్మాసనం ఎదుటకు వచ్చింది. సాక్ష్యాధారాలను సరైన కోణంలో పరిశీలించని కింది కోర్టు పొరపాటు చేసిందని పేర్కొంటూ... తీర్పును సవరించి హైకోర్టు సోమవారం ఆయన్ను విడుదల చేసింది. హత్య వెనుక కారణాలను నిరూపించడంలో ప్రాసెక్యూషన్ విఫలమైందని తీర్పు సందర్భంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. -
అత్యాచారాల్లో.. మొదటిస్థానంలో గంజాం జిల్లా
బరంపురం : మహిళలపై అత్యాచారాల కేసుల్లో రాష్ట్రంలో గంజాం జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని ఇటీవల ఒక సర్వేలో తేలిందని రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి ఆరోపించారు. స్థానిక రామలింగేశ్వర్ ట్యాంక్ రోడ్లో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ మహిళా సురక్షా యాత్ర సభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు జయంతి పోడియారి మాట్లాడుతూ రాష్టాంలో బీజేడీ ప్రభుత్వం మహిళల హక్కులను కాల రాస్తోందని మండిపడ్డారు. ఇందుకు స్వయా న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లా ఉదాహరణగా నిలుస్తోందని విమర్శించారు. జిల్లాలో ప్రతి రోజూ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో గంజాం జిల్లా నిలిచిందని ఆవేదన వెలిబుచ్చారు. భారత రాజ్యాంగం కల్పించిన మహిళల హక్కుల కోసం అందరం కలిసికట్టుగా పోరాటం సాగించాలని ఇందుకు అందరూ కృషి చేయాలని కోరారు. బహిరంగ సభలో బీజేపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సుభాషిణి పట్నాయక్, బీఎంసీ కార్పొరేటర్ నమి తా పాఢి, మాజీ మంత్రి సురమా పాఢి తదితర వందలాది మంది మహిళలు పాల్గొన్నారు. -
వస్తా..వెళ్లొస్తా..తల్లినై మళ్లొస్తా..
ఇక్కడే పుట్టాను..ఎక్కడో పెరుగుతాను..మళ్లీ ఇక్కడికే వచ్చి పిల్లల్ని కంటాను..అంటూ ఇప్పుడే భూమిని చీల్చుకుని బయటపడిన తాబేలు పిల్లలు తల్లి దగ్గరికి చేరేందుకు ప్రయాణం మొదలు పెట్టాయి. పుడమి తల్లిని చీల్చుకుని భూమిపైకి వచ్చి స్వచ్ఛమైన బుడి అడుగులు వేసుకుంటూ సోదరులు, స్నేహితులతో కలిసి తన తల్లి దగ్గరకి చేరేందుకు గుంపులు గుంపులుగా లక్షలాది తాబేలు పిల్లలు సముద్రంలో కలిసిన దృశ్యం కనువిందు చేస్తోంది. బరంపురం: రెండు రోజులుగా వరుసగా గంజాం జిల్లాలోని రుశికుల్యా నది బంగాళాఖాతం ముఖద్వారం తీరాన పుర్ణబొందా, గొకురకుధా, పనిగొండా ప్రాంతంలో భూమి నుంచి అరుదైన తాబేలు పిల్లలు బయటకు రావడంతో సాగర తీర ప్రదేశం ఒక్కసారిగా అందంగా మారింది. గుడ్ల నుంచి బయటికి వచ్చిన తాబేలు పిల్లలకు ప్రకృతి అందాలు, స్వచ్ఛమైన గాలి స్వాగతం పలుకుతున్నాయి. గత జనవరి చివరివారం నుంచి ఫిబ్రవరి 2వ వారం వరకు ఇక్కడ తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టిన సుమారు 5 లక్షల పిల్లలు ఇప్పటి వరకు సుమారు 3 లక్షలకి పైగా రికార్డ్ స్థాయిలో భూమి నుంచి బయటికి వచ్చి బుడి బుడి అడుగులు వేసుకుంటూ సాగరంలో కలుస్తున్నాయి. రక్షణగా ఫారెస్ట్ గార్డ్స్ తాబేలు పిల్లల రక్షణ కోసం సుమారు 200 మంది ఫారెస్ట్ గార్డులు, 200 మంది వలంటరీస్ను జిల్లా అటవీ శాఖ అధ్వర్యంలో నియమించారు. వారు రాత్రంతా తీరంలో ఉండి భూమి నుంచి బయటకి వచ్చిన తాబేలు పిల్లలను బకెట్లలో సేకరించి సముద్రంలోకి వదులుతున్నారు. నదికి అటువైపు బోట్లలో ఫారెస్ట్ గార్డ్స్, వలంటీర్లు కలిసి సముద్ర తీరం వైపు వెళ్లి తాబేలు పిల్లలను వేలాదిగా సముద్రంలో విడిచిపెడుతున్నారు. తీరంలో ప్రత్యేకంగా తాబేలు పిల్లలు ఎటు వెళ్లకుండా వలలు ఏర్పాటు చేశారు. వల నుంచి తాబేలు పిల్లలను సేకరించి సముద్రంలోకి వదులుతున్నారు. తాబేలు పిల్లలను కాకులు, గద్దలు ఎత్తుకెళ్లకుండా ఫారెస్ట్ గార్డ్లు బాంబులు పేలుస్తున్నారు. వేళ్లే ముందు తాబేలు పిల్లలు పిల్లగా వెళ్తూ..తల్లినై తిరిగి ఇదే స్థలానికి వస్తానని పుడమి తల్లిని ముద్దాడి మరీ వెళ్తున్నట్లు పిల్ల తాబేలు ముచ్చట గొల్పుతున్నాయి. -
కాబోయే భర్త కళ్లెదుటే దారుణం
భువనేశ్వర్(ఒడిశా): కొరాపుట్ గ్యాంగ్‌రేప్ ఘటనకు సంబంధించి రాష్ట్రంలో ఆగ్రహ జ్వాలలు చల్లారకమునుపే అలాంటిదే మరో దారుణం చోటుచేసుకుంది. గంజాం జిల్లాలో ఓ డిగ్రీ విద్యార్థినిని చెరబట్టిన ఆరుగురు దుండగులు ఆమె కాబోయే భర్త ఎదుటే అత్యాచారానికి ఒడిగట్టారు. భాంజానగర్‌కు చెందిన డిగ్రీ చదువుకుంటున్న యువతి, కాబోయే భర్తతో కలిసి సోమవారం మధ్యాహ్నం గంగాపూర్ సమీపంలోని బుధకేందూ థాకూరాణి ఆలయానికి వెళ్లారు. పూజల అనంతరం వారిద్దరూ బైక్‌పై వస్తుండగా రెండు మోటారు సైకిళ్లపై వచ్చిన ఆరుగురు దుండగులు వారిని అడ్డగించారు. యువకుడిని తీవ్రంగా కొట్టి, ఇద్దరి వద్ద ఉన్న సెల్ఫోన్లను లాక్కున్నారు. ఒకరి తర్వాత ఒకరు యువతిపై రేప్‌నకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలను తమ సెల్లో చిత్రీకరించారు. అనంతరం వారిద్దరినీ వదలి వెళ్లిపోయారు. దీనిపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ ఆశిష్ సింగ్ వెంటనే దర్యాప్తునకు ఆదేశించారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని కోర్టులో ముందు హాజరుపరిచారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. ఇదిలా ఉండగా, కొరాపుట్‌లో తొమ్మిదో తరగతి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను ఇప్పటివరకు పోలీసులు పట్టుకోలేకపోయారు. ఈ నెల 10వ తేదీన భద్రతా సిబ్బంది వేషధారణలో ఉన్న నలుగురు దుండగులు తనపై అత్యాచారానికి పాల్పడినట్టు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
మృతదేహంతో 5 కి.మీ. నడక
బరంపురం: మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తరలించేందుకు డబ్బులు లేక కాలినడకన మోసుకుంటూ వెళ్లిన మరో ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోనే ఈ సంఘటన జరగడం గమనార్హం. సురడా నియోజకర్గ పరిధి సోరిస్బిలి గ్రామానికి చెందిన భానుమతి నాయక్(70) కొద్దిరోజుల క్రితం అనార్యోగం బారినపడి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయింది. మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లడానికి 108 వాహనం లభించలేదు. ప్రైవేటు వాహనంలో తరలించేందుకు భానుమతి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేవు. దీంతో మృతదేహానికి దుప్పటి చుట్టి కర్ర సహాయంతో డోలీలా తయారు చేసి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. కొన్ని నెలల క్రితం ఒడిశాలోనే కలహండి జిల్లాలో ధనమజ్జి అనే వ్యక్తి భార్య మృతదేహాన్ని భుజాన పెట్టుకుని 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి నడుచుకుంటూ వెళ్లిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజా ఘటన సీఎం సొంత జిల్లాలో జరగడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. -
నగ్నంగా ఫోటోలు తీశారని ...
బరంపురం: ప్రభుత్వ హాస్టల్లో రక్షణ ఉంటుంది... బుద్దిగా చదువుకోవచ్చని భావించిన ఆ బాలికల ఆశలు పేక మేడల్లా కుప్పకూలాయి. తమను నగ్నంగా ఫోటోలు తీశారని వార్త తెలుసుకున్న వారు సిగ్గుతో బిక్కచచ్చిపోయారు. తీవ్ర కలత చెందారు. ఇక్కడ రక్షణ లేదని భావించిన దాదాపు 60 మంది విద్యార్థినులు హాస్టల్ వదిలి గురువారం ఇంటిముఖం పట్టారు. ఈ ఘటన ఒడిశా గంజాం జిల్లా గుడియాలి గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక కస్తూరి బా బాలిక విద్యాలయం హాస్టల్లోని ఆరు, ఏడు తరగతి విద్యార్థినులను గతేడాది విహారయాత్రకు తీసుకువెళ్లారు. ఆ సమయంలో స్కూల్ గుమాస్తా సదరు విద్యార్థినులు స్నానం చేస్తున్న సమయంలో ... వారి ఫోటోలను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ విషయం స్కూల్ ప్రధాన ప్రిన్సిపల్‌కు తెలిసింది. వెంటనే ఆ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు ప్రిన్సిపల్ నివేదించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. స్కూల్ గుమాస్తాకు హాస్టల్ వంటమనిషి సహకరించినట్లు విచారణలో తెలింది. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గుమస్తా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసులు తెలిపారు. హాస్టల్లో మొత్తం 87 మంది విద్యార్థినుల్లో 60 మంది ఇంటికి పయనం కావడంతో ప్రస్తుతం 27 మంది విద్యార్థులు హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ లో బాలికల రక్షణ కోసం మహిళా కానిస్టేబుల్ ను ప్రభుత్వ ఉన్నతాధికారులు నియమించారు. -
ఫైలిన్ తుపాన్‌కు మరో ఎనిమిది మంది బలి
ఫైలిత్ తుపాన్ ధాటికి మరో ఎనిమిదిమంది మరణించారు. ఒడిషాలోని గంజాం జిల్లాలో వీరి మృతదేహాలను ఆదివారం గుర్తించారు. బరంపురం, పురుషోత్తంపూర్, గంజాం, రంగెలిలుండా ప్రాంతాల్లో ఇద్దరు చొప్పున చనిపోయారు. తుపాన్ ప్రభావానికి మరణించిన వారి సంఖ్య మొత్తం 15కు చేరింది. శనివారం ఏడుగురు మరణించారు. ఒడిషాను కుదిపేసిన ఫైలిన్ విలయానికి గంజాం జిల్లాలో చాలా మంది గాయపడినట్టు సమాచారం. ఒడిషాతో పాటు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రదేశాలకు తరలించడం వల్ల ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగారు. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల ధాటికి రోడ్లు, రైల్వే లైన్లు, విద్యుత్, సమాచార వ్యవస్థుల దెబ్బతిన్నాయి.