
సాక్షి, భువనేశ్వర్ : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో తొమ్మిదిమంది దుర్మరణం చెందగా, మరో 41మంది ప్రయాణికులు గాయపడ్డారు. గంజాం జిల్లాలోని తప్తపాని ఘాటి సమీపంలో బుధవారం తెల్లవారుజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు అదుపు తప్పి వంతెన పైనుంచి బోల్తా పడటంతో 9మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా బస్సు తెక్రీ నుంచి బెర్హాంపూర్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అయిదుగురిని ప్రాణాలతో కాపాడారు. మరోవైపు గాయపడినవారిని చికిత్స నిమిత్తం బెర్హంపూర్, దిగపహండి ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment