మృతదేహంతో 5 కి.మీ. నడక
మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లడానికి 108 వాహనం లభించలేదు. ప్రైవేటు వాహనంలో తరలించేందుకు భానుమతి కుటుంబ సభ్యుల వద్ద డబ్బులు లేవు. దీంతో మృతదేహానికి దుప్పటి చుట్టి కర్ర సహాయంతో డోలీలా తయారు చేసి 5 కిలోమీటర్లు నడుచుకుంటూ గ్రామానికి చేరుకున్నారు. కొన్ని నెలల క్రితం ఒడిశాలోనే కలహండి జిల్లాలో ధనమజ్జి అనే వ్యక్తి భార్య మృతదేహాన్ని భుజాన పెట్టుకుని 10 కిలోమీటర్ల దూరంలోని గ్రామానికి నడుచుకుంటూ వెళ్లిన సంఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. తాజా ఘటన సీఎం సొంత జిల్లాలో జరగడంతో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి.