![Valtteri Bottas first place in Austrian Grand Prix - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/1/BOTTAS_16V5I2.jpg.webp?itok=rn9fTvnc)
వాల్తెరి బొటాస్
వియన్నా: మెర్సిడెస్ జట్టు డ్రైవర్ వాల్తెరి బొటాస్ ఈ సీజన్‌లో తొలి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో బొటాస్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 03.130 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానం నుంచి... ఫెరారీ డ్రైవర్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11వ, 17వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment