వెర్‌స్టాపెన్‌కు పోల్‌ పొజిషన్‌ | F1 2023: Max Verstappen on pole for Spanish Grand Prix | Sakshi
Sakshi News home page

వెర్‌స్టాపెన్‌కు పోల్‌ పొజిషన్‌

Published Sun, Jun 4 2023 6:04 AM | Last Updated on Sun, Jun 4 2023 6:04 AM

F1 2023: Max Verstappen on pole for Spanish Grand Prix - Sakshi

మాంట్‌మెలో (స్పెయిన్‌): ఫార్ములా వన్‌ స్పానిష్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్‌ డ్రైవర్‌ మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ మొదటి స్థానంతో మొదలు పెడతాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ రేసులో డిఫెండింగ్‌ చాంపియన్‌ వెర్‌స్టాపెన్‌ పోల్‌ పొజిషన్‌ సాధించాడు. ల్యాప్‌ను అతను అత్యుత్తమంగా 1 నిమిషం 12.272 సెకన్లలో పూర్తి చేశాడు.

ఈ సీజన్‌లో ఏడు రేస్‌లలో నాలుగో సారి వెర్‌స్టాపెన్‌కు పోల్‌ పొజిషన్‌ లభించింది. కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ), ల్యాండో నోరిస్‌ (మెక్లారెన్‌) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మెర్సిడెజ్‌కు చెందిన లూయీస్‌ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఈ సీజన్‌లో రెండు రేస్‌లు నెగ్గిన వెర్‌స్టాపెన్‌ రెడ్‌బుల్‌ సహచరుడు సెర్గియో పెరెజ్‌ 11వ స్థానంనుంచి ప్రధాన రేస్‌ను ప్రారంభిస్తాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement