Spanish Grand Prix
-
వెర్స్టాపెన్ ‘హ్యాట్రిక్’.. సీజన్లో వరుసగా మూడో విజయం
మోంట్మెలో (స్పెయిన్): ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తన జోరు కొనసాగిస్తున్నాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగి టైటిల్ నిలబెట్టుకున్నాడు. 66 ల్యాప్‌ల రేసును ‘పోల్ పొజిషన్’ తో ప్రారంభించిన వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక గంటా 27 నిమిషాల 57.940 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, రసెల్ (మెర్సిడెస్) మూడో స్థానంలో, పెరెజ్ (రెడ్‌బుల్) నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది వరుసగా మూడో విజయంకాగా, ఓవరాల్‌గా ఐదో టైటిల్ కావడం విశేషం. ఈ సీజన్లో మొత్తం ఏడు రేసులు జరగ్గా ... ఏడింటిలోనూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లే విజేతగా నిలువడం గమనార్హం. వెర్స్టాపెన్ బహ్రెయిన్, ఆ్రస్టేలియా, మయామి, మొనాకో, స్పానిష్ రేసుల్లో నెగ్గగా... పెరెజ్ సౌదీ అరేబియా, అజర్బైజాన్ రేసుల్లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సీజన్‌లోని ఎనిమిదో రేసు కెనడియన్ గ్రాండ్‌ప్రి ఈనెల 18న జరుగుతుంది. -
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
మాంట్‌మెలో (స్పెయిన్): ఫార్ములా వన్ స్పానిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మొదటి స్థానంతో మొదలు పెడతాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించాడు. ల్యాప్‌ను అతను అత్యుత్తమంగా 1 నిమిషం 12.272 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఏడు రేస్‌లలో నాలుగో సారి వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), ల్యాండో నోరిస్ (మెక్లారెన్) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మెర్సిడెజ్‌కు చెందిన లూయీస్ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఈ సీజన్లో రెండు రేస్‌లు నెగ్గిన వెర్స్టాపెన్ రెడ్‌బుల్ సహచరుడు సెర్గియో పెరెజ్ 11వ స్థానంనుంచి ప్రధాన రేస్‌ను ప్రారంభిస్తాడు. -
జీపీఎస్ పెట్టినా వదల్లేదు.. ఫార్ములావన్ స్టార్‌కు చేదు అనుభవం
నాలుగుసార్లు ఫార్ములావన్ చాంపియన్ విజేత.. ఆస్టన్ మార్టిన్ ఎఫ్1 డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్‌కు చేదు అనుభవం ఎదురైంది. వెటెల్ బ్యాగును దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు ఎత్తుకెళ్లిన బ్యాగును వెటెల్ జీపీఎస్ ట్రాకర్ ద్వారా కనుక్కోవాలనుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. విషయంలోకి వెళితే.. స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ ముగించుకొని బార్సిలోనాకు చేరుకున్న సెబాస్టియన్ వెటెల్ ఒకరోజు అక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాడు. తన కారును హోటల్ ముందు పార్క్ చేసి లోనికి వెళ్లాడు. పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చిన వెటెల్‌కు కారులో బ్యాగు కనిపించలేదు. దీంతో దొంగలు ఎత్తుకెళ్లారని భావించిన వెటెల్.. బ్యాగులో తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్‌కు జీపీఎస్ ట్రాకర్ ఉన్నట్లు గుర్తొచ్చింది. వెంటనే తన ఐ-ఫోన్లో జీపీఎస్ ఆన్ చేశాడు. జీపీఎస్ లొకేషన్ ఆధారంగా తన కారులోనే బయల్దేరిన వెటెల్ దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశాడు. దారి మధ్యలోనే సదరు దొంగలు తన ఐ ఫోన్ ఎయిర్ పాడ్స్ పడేయడంతో జీపీఎస్ అక్కడే ఆగిపోయింది. దీంతో వెటెల్ తన బ్యాగు జాడను తెలుసులేకపోయాడు. కాగా ఈ ఏడాది వెటెల్ అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. తాజాగా ముగిసిన స్పానిష్ గ్రాండ్ప్రిక్స్ను వెటెల్ 11వ పొజిషన్‌తో ముగించాడు. ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 66 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 37 నిమిషాల 20.475 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 27వ ల్యాప్‌లో వైదొలిగాడు. చదవండి: ICC: అంపైరింగ్ విషయంలో ఐసీసీ కీలక నిర్ణయం Spanish Grand Prix: వెర్స్టాపెన్ ఖాతాలో నాలుగో విజయం -
వెర్స్టాపెన్ ఖాతాలో నాలుగో విజయం
ఫార్ములావన్ తాజా సీజన్లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ నాలుగో విజయం నమోదు చేశాడు. బార్సిలోనాలో ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 66 ల్యాప్‌ల రేసును వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 37 నిమిషాల 20.475 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 27వ ల్యాప్‌లో వైదొలిగాడు. -
ఫార్ములావన్‌లో యువ కెరటం
బార్సిలోనా: ప్రపంచ ఫార్ములావన్ చరిత్రలో ఓ యువ కెరటం దూసుకొచ్చింది ఆదివారం జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రిలో 18 ఏళ్ల మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్) విజేతగా అవతరించాడు. తద్వారా అత్యంత పిన్నవయసులో ఫార్ములావన్ టైటిల్‌ను కైవసం చేసుకున్న డ్రైవర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. 66 ల్యాప్‌ల ప్రధాన రేసును ఒక గంటా 41నిమిషాల 40.017సెకన్లలో పూర్తి చేసిన వెర్స్టాపెన్ అగ్రస్థానంలో నిలిచి తొలి ఫార్ములావన్ టైటిల్ ను అందుకున్నాడు. ఈ రేసును తొలి రెండు స్థానాల నుంచి ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హమిల్టన్, నికో రోస్ బర్గ్లకు ఆదిలోనే చుక్కెదురైంది. మొదటి ల్యాప్‌లో ఇద్దరి కార్లు ఢీకొనడంతో వారు రేసు నుంచి వైదొలిగాల్సి వచ్చింది. ప్రధాన రేసును పోల్ పొజిషన్ నుంచి ప్రారంభించిన హమిల్టన్ను రోస్ బర్గ్ అధిగమించాడు. దీంతో ఆధిక్యంలోకి వెళ్లదామని హమిల్టన్ మరోసారి ప్రయత్నించే క్రమంలో రోస్ బర్గ్ కారును ఢీకొట్టాడు. దీంతో వారిద్దరూ రేసు మధ్యలోనే వైదొలిగారు. దీన్ని మ్యాక్స్ వెర్స్టాపెన్ సద్వినియోగం చేసుకుని విజేతగా నిలిచాడు. మాజీ ఫార్ములా వన్ డ్రైవర్ జాస్ వెర్స్టాపెన్ కుమారుడైన మ్యాక్స్ .. ఫార్ములావన్ టైటిల్ గెలిచిన తొలి డచ్ డ్రైవర్ గా చరిత్ర సృష్టించడం మరో విశేషం. -
మళ్లీ హామిల్టన్‌దే పోల్
* రెండో స్థానంలో రోస్‌బర్గ్ * నేడు స్పానిష్ గ్రాండ్ ప్రి బార్సిలోనా: ఈ సీజన్ ఫార్ములా వన్‌లో జోరు మీదున్న లూయీస్ హామిల్టన్ (మెర్సిడెస్) స్పానిష్ గ్రాండ్ ప్రిలోనూ సత్తా చాటాడు. శనివారం ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో అతను మొదటి స్థానంలో నిలిచాడు. ఈ బ్రిటన్ డ్రైవర్ 1 నిమిషం 25.232 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేస్‌ను అతను ‘పోల్ పొజిషన్’నుంచి ప్రారంభిస్తాడు. ఈ ఏడాది ఐదు అర్హత రేస్‌లలో నాలుగో సారి తొలి స్థానంలో నిలిచిన హామిల్టన్ కెరీర్లో ఇది 35వ పోల్ పొజిషన్ కావడం విశేషం. క్వాలిఫయింగ్ రేస్‌లో హామిల్టన్ సహచర మెర్సిడెస్ డ్రైవర్, జర్మనీకి చెందిన నికో రోస్‌బర్గ్ (1 ని. 25.400 సె.) రెండో స్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ రికియార్డో (1 ని. 26.285 సె.)కు మూడో స్థానం నుంచి రేస్ ప్రారంభిస్తాడు. టాప్-10లో ‘ ఫోర్స్’కు దక్కని చోటు: ఈ ఏడాది తొలి నాలుగు అర్హత రేస్లలోనూ టాప్-10 నిలిచిన ఫోర్స్ ఇండియా స్పానిష్ రేసులో మాత్రం విఫలమైంది. సెకనులో పదో వంతు తేడాతో వెనుబడి ఫోర్స్ డ్రైవర్ హల్కెన్‌బర్గ్ 11వ స్థానంలో నిలవంగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానంతో సరి పెట్టుకున్నాడు.