![Spanish Grand Prix: Max Verstappen Gains F1 Title Lead After Victory - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/23/ver.jpg.webp?itok=x_B3JrPL)
ఫార్ములావన్ తాజా సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ నాలుగో విజయం నమోదు చేశాడు. బార్సిలోనాలో ఆదివారం జరిగిన స్పానిష్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 66 ల్యాప్‌ల రేసును వెర్‌స్టాపెన్ అందరికంటే వేగంగా గంటా 37 నిమిషాల 20.475 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ లెక్‌లెర్క్ కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో 27వ ల్యాప్‌లో వైదొలిగాడు.
Comments
Please login to add a commentAdd a comment