Qualifying session
-
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
మాంట్‌మెలో (స్పెయిన్): ఫార్ములా వన్ స్పానిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెడ్‌బుల్ డ్రైవర్ మ్యాక్స్ వెర్స్టాపెన్ మొదటి స్థానంతో మొదలు పెడతాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రేసులో డిఫెండింగ్ చాంపియన్ వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించాడు. ల్యాప్‌ను అతను అత్యుత్తమంగా 1 నిమిషం 12.272 సెకన్లలో పూర్తి చేశాడు. ఈ సీజన్లో ఏడు రేస్‌లలో నాలుగో సారి వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్ లభించింది. కార్లోస్ సెయింజ్ (ఫెరారీ), ల్యాండో నోరిస్ (మెక్లారెన్) రెండో, మూడో స్థానాల్లో నిలిచారు. మెర్సిడెజ్‌కు చెందిన లూయీస్ హామిల్టన్‌కు ఐదో స్థానం దక్కింది. ఈ సీజన్లో రెండు రేస్‌లు నెగ్గిన వెర్స్టాపెన్ రెడ్‌బుల్ సహచరుడు సెర్గియో పెరెజ్ 11వ స్థానంనుంచి ప్రధాన రేస్‌ను ప్రారంభిస్తాడు. -
వెర్‌స్టాపెన్‌కు పోల్ పొజిషన్
ఫార్ములావన్ సీజన్‌లోని మూడో రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో తొలి విజయమే లక్ష్యంగా ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ బరిలోకి దిగనున్నాడు. మెల్బోర్న్లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 16.732 సెకన్లలో పూర్తి చేసి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు ఆరుసార్లు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో పోటీపడ్డ వెర్స్టాపెన్ 2019లో అత్యుత్తమంగా మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. నేటి ప్రధాన రేసులో వెర్‌స్టాపెన్‌కు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు జార్జి రసెల్, లూయిస్ హామిల్టన్ నుంచి గట్టిపోటీ లభించనుంది. రసెల్ రెండో స్థానం నుంచి, హామిల్టన్ మూడో స్థానం నుంచి రేసును ప్రారంభిస్తారు. ఈ సీజన్లో రెండు రేసులు జరగ్గా.. తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్పిలో వెర్స్టాపెన్, రెండో రేసు సౌదీ అరేబియా గ్రాండ్‌ప్రిలో సెర్జియో పెరెజ్ విజేతలుగా నిలిచారు. -
Bahrain GP Qualifying: ఎఫ్1 సీజన్‌కు వేళాయె...
సాఖిర్ (బహ్రెయిన్): ఫార్ములావన్ (ఎఫ్1) 2023 సీజన్‌కు రంగం సిద్ధమైంది. 23 రేసుల ఈ సీజన్లో తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి ఆదివారం జరుగుతుంది. అంతకుముందు శనివారం ప్రధాన రేసుకు సంబంధించిన గ్రిడ్ పొజిషన్‌ను తేల్చేందుకు క్వాలిఫయింగ్ సెషన్‌ను నిర్వహిస్తారు. క్వాలిఫయింగ్ సెషన్లో అత్యంత వేగంగా ల్యాప్‌ను పూర్తి చేసిన డ్రైవర్ ప్రధాన రేసును ‘పోల్ పొజిషన్’ హోదాలో తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఈ సీజన్లో కూడా డిఫెండింగ్ చాంపియన్ మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్ జట్టు) తన జోరు కొనసాగించే అవకాశముంది. అతనికి హామిల్టన్ (మెర్సిడెస్), లెక్లెర్క్ (ఫెరారీ) నుంచి గట్టిపోటీ ఎదురయ్యే చాన్స్ ఉంది. మొత్తం 10 జట్ల నుంచి 20 మంది డ్రైవర్లు మొత్తం 23 రేసుల్లో పాల్గొంటారు. -
లెక్లెర్క్కు ఆరో పోల్ పొజిషన్... నేడు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ క్వాలిఫయింగ్ సెషన్స్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మరోసారి సత్తా చాటుకున్నాడు. బాకు నగరంలో శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.359 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సీజన్లో లెక్లెర్క్కిది ఆరో పోల్ పొజిషన్ కావడం విశేషం. సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం ఏడు రేసులు జరగ్గా... వెర్స్టాపెన్ నాలుగు రేసులో, లెక్లెర్క్ రెండు రేసుల్లో, పెరెజ్ ఒక రేసులో విజేతగా నిలిచారు. -
‘పిస్టల్’ పని చేయలేదు!
టోక్యో: తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న యువ షూటర్ మనూ భాకర్ గుండె పగిలింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో కచ్చితంగా పతకం సాధించగలదని భావించిన భాకర్, ఫైనల్స్‌కు కూడా అర్హత సాధించలేకపోయింది. తాను నమ్ముకున్న ‘ఆయుధం’ ఆమెను చివరకు దెబ్బ తీసింది. క్వాలిఫయింగ్ ఈవెంట్ సందర్భంగా భాకర్ పిస్టల్ సాంకేతిక లోపంతో పని చేయలేదు. పోటీ జరుగుతున్న వేదిక నుంచి కాస్త దూరంగా వెళ్లిన భారత షూటర్... దానిని సరి చేయించుకొని వచ్చి మళ్లీ బరిలోకి దిగే సరికే అమూల్యమైన సమయం వృథా అయింది. దాంతో 19 ఏళ్ల మనూ తన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వలేకపోయింది. మొత్తం 6 రౌండ్లలో వరుసగా 98, 95, 94, 95, 98, 95 (మొత్తం కలిపి 575 పాయింట్లు) స్కోర్ చేసిన ఆమె 12వ స్థానంలో నిలిచి ఫైనల్ అవకాశాలు చేజార్చుకుంది. ఇదే విభాగంలో బరిలోకి దిగిన మరో భారత షూటర్ యశస్విని సింగ్ కూడా నిరాశపర్చింది. క్వాలిఫయింగ్‌లో 574 పాయింట్లు సాధించిన ఆమె 13వ స్థానంతో సరిపెట్టుకుంది. టాప్–8లో నిలిచిన వారే ఫైనల్‌కు చేరుకుంటారు. రెండో పిస్టల్ ఉన్నా కూడా... సాధారణంగా షూటర్లు ఈవెంట్ సమయంలో ‘స్పేర్ గన్’ను ఉంచుకుంటారు. పేరుకు ఇది కూడా గ్రిప్, ట్రిగ్గర్ తదితర అంశాల్లో దాదాపుగా మొదటి పిస్టల్‌లాగే ఉన్నా... సుదీర్ఘ కాలంగా మొదటి గన్‌తోనే ప్రాక్టీస్ చేసిన అలవాటు వల్ల కొత్త గన్ను అంత సమర్థంగా ఉపయోగించడం కష్టమవుతుంది. పైగా రెండో గన్ తీసుకుంటే ఎలా పని చేస్తుందో చూసేందుకు ‘సైటర్స్’ (షూట్ చేసి పరీక్షించడం) చేయాల్సి ఉంటుంది. మొత్తం పిస్టల్ చెడిపోవడంవంటి అత్యవసర పరిస్థితి అయితే తప్ప రెండో గన్ను బయటకు తీయరు. భాకర్ ఘటనతో కొత్త గన్ను పరీక్షించడంతో పోలిస్తే మొదటి గన్ను రిపేర్ చేయడానికే తక్కువ సమయం పడుతుంది కాబట్టి దానినే ఎంచుకున్నట్లు రోనక్ పండిట్ వెల్లడించారు. ‘దురదృష్టవశాత్తూ ఇందులో ఆమె తప్పేమీ లేదు. ఇంత జరిగిన తర్వాత కూడా మనూ మంచి స్కోరు సాధించగలిగింది. ఇలాంటి స్థితిలోనూ ఆమె కుప్పకూలిపోలేదు. గన్లకు ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు మేం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం కానీ అసలు లివర్ విరిగిపోవడం అనేది అనూహ్యం. మనూ ప్రదర్శన పట్ల గర్వంగా ఉన్నా’ అని పండిట్ వ్యాఖ్యానించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మరో రెండు ఈవెంట్లు (25 మీటర్ల ఎయిర్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్)లలో భాకర్ ఇంకా పోటీ పడాల్సి ఉంది. అసలేం జరిగింది? వేర్వేరు ప్రపంచకప్‌లలో 9 స్వర్ణాలు, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణాలతో పాటు ప్రస్తుత వరల్డ్ నంబర్ 2 అయిన హరియాణా టీనేజర్ మనూ భాకర్‌పై ఒలింపిక్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. మనూ కూడా అదే ఉత్సాహంతో బరిలోకి దిగింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్కోరు సాధించే మొత్తం 60 షాట్లు అందుబాటులో ఉంటాయి. ఆరు సిరీస్‌లలో కలిపి 75 నిమిషాల్లో వీటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. 16 షాట్లు ఆడిన తర్వాత ఆమె పిస్టల్ మొరాయించింది. ఈ 16 షాట్లను అద్భుతంగా వాడుకున్న భాకర్ స్కోరులో 10 పాయింట్ల షాట్లు 10... 9 పాయింట్ల షాట్లు 6 ఉండటం విశేషం. అంటే ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆమె సరైన దిశలోనే సాగింది. ‘పిస్టల్ కాకింగ్ లివర్ విరిగిపోయింది. ఇలాంటిది సాధారణంగా ఎప్పుడూ జరగదు. లివర్ మార్చాలంటే గ్రిప్, ట్రిగ్గర్ సర్క్యూట్ కూడా బయటకు తీయాల్సి ఉంటుంది. దీనిని సరి చేసిన తర్వాత సర్క్యూట్ పని చేయలేదు. దాంతో దానిని కూడా మార్చాల్సి వచ్చింది’ అని మనూ భాకర్ కోచ్ రోనక్ పండిట్ వివరించారు. నిబంధనల ప్రకారం షూటర్ల వ్యక్తిగత సమస్యకు ఎలాంటి అదనపు సమయం లభించదు. మనూ మళ్లీ తన స్పాట్ వద్దకు వచ్చి షూట్ చేసే సమయానికి మరో 38 నిమిషాలు మిగిలి ఉండగా, 44 షాట్లు పూర్తి చేయాల్సి ఉంది. దాంతో వేగం పెంచిన మనూ తన సామర్థ్యానికి తగినట్లుగా చివర్లో షూట్ చేయలేక 2 పాయింట్ల తేడాతో ఫైనల్ అవకాశం కోల్పోయింది. ముఖ్యంగా 60వ షాట్లో 10 పాయింట్లు స్కోర్ చేసి ఉంటే ముందంజ వేసే అవకాశం ఉండగా... 8 పాయింట్లు మాత్రమే సాధించింది. దీపక్, దివ్యాంశ్ విఫలం... పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో భారత షూటర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. బరిలోకి దిగిన ఇద్దరు షూటర్లు దీపక్ కుమార్, దివ్యాంశ్ సింగ్ ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు. క్వాలిఫయింగ్‌లో దీపక్ 624.7 పాయింట్లతో 26వ స్థానంలో నిలవగా... 622.8 పాయింట్లు సాధించిన దివ్యాంశ్ సింగ్ పన్వర్ 32వ స్థానంతో సరిపెట్టుకున్నారు. స్కీట్‌లో అవకాశం ఉందా! పురుషుల స్కీట్ విభాగంలో ఇద్దరు భారత షూటర్లు తొలి రోజు ఫర్వాలేదనిపించే ప్రదర్శన కనబర్చారు. ఇదే పోటీ సోమవారం కూడా కొనసాగుతుంది. మొదటి రోజు అంగద్ సింగ్ అందుబాటులో ఉన్న 75 పాయింట్లలో 73 పాయింట్లు (24, 25, 24) సాధించి 11వ స్థానంలో ఉన్నాడు. మిగిలిన రెండు సిరీస్‌లలో నేడు పోరాడతాడు. మరో భారత షూటర్ మేరాజ్ 71 పాయింట్లు సాధించి 25వ స్థానంలో నిలిచాడు. మొత్తం ఐదు సిరీస్‌లు ముగిసిన అనంతరం టాప్–6 మాత్రమే ఫైనల్లోకి అడుగుపెడతారు. -
వెర్‌స్టాపెన్‌కు ‘పోల్’
అబుదాబి: ఫార్ములావన్ (ఎఫ్1) 2020 సీజన్‌లోని చివరి రేసు అబుదాబి గ్రాండ్ప్రిను రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో 23 ఏళ్ల వెర్స్టాపెన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.246 సెకన్లలో ల్యాప్‌ను ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్‌కు పోల్ పొజిషన్ దక్కడం ఇదే తొలిసారి. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. 17 రేసుల ఈ సీజన్లో 16 రేసులు ముగిశాయి. 11 రేసుల్లో హామిల్టన్ నెగ్గగా... బొటాస్ రెండు రేసుల్లో.. మిగతా మూడు రేసుల్లో వెర్స్టాపెన్, గ్యాస్లీ, పెరెజ్ టైటిల్స్ గెలిచారు. -
లెక్లెర్క్కు పోల్ పొజిషన్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: ఈ సీజన్లో తొలి టైటిల్ కోసం వేచి చూస్తున్న ఫెరారీ జట్టుకు మరో అవకాశం లభించింది. ఆ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ సీజన్లో మూడోసారి పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో 21 ఏళ్ల లెక్లెర్క్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 42.519 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాడు. నేడు జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఫెరారీకే చెందిన సెబాస్టియన్ వెటెల్ రెండో స్థానం నుంచి రేసును మొదలుపెడతాడు. ఈ సీజన్లో గ్రిడ్‌లోని తొలి రెండు స్థానాలు ఫెరారీకి లభించడం తొలిసారి. మెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, బొటాస్ వరుసగా మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 రేసులు జరగ్గా... హామిల్టన్ ఎనిమిది రేసుల్లో, బొటాస్, మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండేసి రేసుల్లో విజేతగా నిలిచారు. బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి, ఆస్ట్రియా గ్రాండ్ప్రిలలోనూ లెక్లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. అయితే ప్రధాన రేసులో అతను మూడో స్థానంలో (బహ్రెయిన్), రెండో స్థానంలో (ఆస్ట్రియా) నిలిచాడు. మూడో ప్రయత్నంలో అతను టైటిల్ సాధిస్తాడా లేదా వేచి చూడాలి. -
హామిల్టన్‌కు పోల్
సింగపూర్: ఈ సీజన్లో ఏడో విజయంపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ దృష్టి పెట్టాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ దుమ్ము రేపాడు. అందరికంటే వేగంగా ల్యాప్‌ను ముగించి ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటికే ఆరు రేసుల్లో గెలిచిన హామిల్టన్ క్వాలిఫయింగ్ చివరి సెషన్లో ల్యాప్‌ను ఒక నిమిషం 36.015 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 7, 9 స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. సీజన్లో 14 రేసులు పూర్తయ్యాక ప్రస్తుతం హామిల్టన్ 256 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో ఉండగా... 226 పాయింట్లతో వెటెల్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సాయంత్రం గం. 5.35 నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం -
హామిల్టన్‌కే పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా 1 ని.58.179 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రెండో స్థానం పొందగా, రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, రికియార్డో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
వారెవ్వా... హామిల్టన్
హాకెన్‌హీమ్ (జర్మనీ): క్వాలిఫయింగ్ సెషన్లో నిరాశపరిచినప్పటికీ ప్రధాన రేసులో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అద్భుతం చేశాడు. 14వ స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన ఈ బ్రిటన్ డ్రైవర్ అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఏకంగా విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో హామిల్టన్ 67 ల్యాప్‌లను గంటా 32 నిమిషాల 29.845 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది నాలుగో విజయం. మెర్సిడెస్ జట్టుకే చెందిన బొటాస్ రెండో స్థానాన్ని పొందగా... ఫెరారీ డ్రైవర్ కిమీ రైకోనెన్‌కు మూడో స్థానం లభించింది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఫెరారీ జట్టు మరో డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ 51వ ల్యాప్‌లో వైదొలిగాడు. కారుపై నియంత్రణ కోల్పోయిన వెటెల్ ట్రాక్ గోడను ఢీకొట్టి రేసు నుంచి తప్పుకున్నాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్ ఏడో స్థానంలో, ఒకాన్ ఎనిమిదో స్థానంలో నిలిచారు. రేసు ముగిశాక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. 53వ ల్యాప్‌లో నిబంధనలకు విరుద్ధంగా ట్రాక్‌పై దూసుకొచ్చినందుకు విచారణకు హాజరు కావాలని హామిల్టన్‌కు స్టీవార్డ్స్ నోటీసులు జారీ చేశారు. అయితే హామిల్టన్ ఉద్దేశపూర్వకంగా తాను అలా చేయలేదని ఇచ్చిన వివరణపట్ల సంతృప్తి చెందిన స్టీవార్డ్స్ అతడిని హెచ్చరికతో వదిలిపెట్టారు. ఒకవేళ వివరణ సంతృప్తికరంగా లేకపోయుంటే హామిల్టన్ టైటిల్ కోల్పోయేవాడు. -
హామిల్టన్‌కు ‘పోల్’
సిల్వర్‌స్టోన్: సొంతగడ్డపై మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరోసారి దుమ్ము రేపాడు. బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో అతను ఐదోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 26.600 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. గతంలో నాలుగుసార్లు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్‌ను నెగ్గిన హామిల్టన్ మళ్లీ గెలిస్తే ఐదు టైటిల్స్‌తో తన దేశానికి చెందిన జిమ్ క్లార్క్ రికార్డును సమం చేస్తాడు. ఫెరారీ డ్రైవర్లు కిమీ రైకోనెన్, సెబాస్టియన్ వెటెల్ వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఆరు, ఏడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. -
హామిల్టన్‌కు ఆరో ‘పోల్’
నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై మరోసారి సత్తా చాటుకునేందుకు బ్రిటన్ ఫార్ములావన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకు చెందిన హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 29.287 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం