
8వ స్థానంలో నిలిచిన హామిల్టన్
ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్
మెల్‌బోర్న్: ఫార్ములావన్ సీజన్ ఆరంభ రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్ ప్రిలో మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) పోల్ పొజిషన్ సాధించాడు. 24 రేసులతో కూడిన ఈ సీజన్‌కు ఆదివారం తెర లేవనుండగా... శనివారం క్వాలిఫయింగ్ ఈవెంట్ జరిగింది. ఇందులో లాండో నోరిస్ 1 నిమిషం 15.096 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. మెల్‌బోర్న్‌లో నోరిస్‌కు ఇదే తొలి ‘పోల్’ కాగా... ఓవరాల్‌గా కెరీర్‌లో 10వది. ఎఫ్1 సీజన్ ప్రారం¿ోత్సవ క్వాలిఫయింగ్ టోర్నీకి శనివారం 1,36,347 మంది అభిమానులు హాజరవడం విశేషం.
‘కొత్త సీజన్ ఘనంగా ప్రారంభమైంది. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ ట్రాక్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంటేనే ముందు వరుసలో నిలవగలం’ అని రేసు అనంతరం నోరిస్ అన్నాడు. మెక్‌లారెన్ జట్టుకే చెందిన ఆస్కార్ పియాస్ట్రి (ఆ్రస్టేలియా) 0.084 సెకన్ల తేడాతో రెండో స్థానంలో నిలిచాడు. క్వాలిఫయింగ్‌లో పియాస్ట్రి 1 నిమిషం 15. 180 సెకన్ల టైమింగ్ నమోదు చేశాడు. ట్రాక్‌పై గత నాలుగేళ్లుగా ఎదురులేకుండా దూసుకెళ్తున్న రెడ్‌బుల్ డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్)... క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచాడు.
వెర్‌స్టాపెన్ 1 నిమిషం 15.481 సెకన్లలో వేగవంతమైన ల్యాప్ పూర్తి చేశాడు. ఈ సీజన్ నుంచి ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (బ్రిటన్) 1 నిమిషం 15.973 సెకన్లతో ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ‘ఇలాంటి ప్రదర్శనను ఆశించలేదు. కానీ ఓవరాల్‌గా సంతృప్తిగా ఉన్నా... గత రెండు రోజులుగా పడ్డ కష్టానికి ఫలితం దక్కింది. ప్రధాన రేసులో మరింత వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తా’ అని హామిల్టన్ అన్నాడు.
ఫెరారీ మరో డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ (1 నిమిసం 15.755 సెకన్లు; మొనాకో) ఏడో ప్లేస్‌లో, మెర్సెడెస్ డ్రైవర్ జార్జి రసెల్ (1 నిమిషం 15. 546 సెకన్లు; బ్రిటన్) నాలుగో స్థానంలో నిలిచారు. ఆదివారం జరగనున్న ప్రధాన రేసులో 10 జట్లకు చెందిన 20 మంది డ్రైవర్లు పాల్గొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment