వెర్‌స్టాపెన్‌కు షాక్‌.. విజేతగా కార్లోస్‌ సెయింజ్‌  | Formula One: Carlos Sainz Wins Australian Grand Prix | Sakshi
Sakshi News home page

Australian GP: వెర్‌స్టాపెన్‌కు షాక్‌.. విజేతగా కార్లోస్‌ సెయింజ్‌ 

Published Mon, Mar 25 2024 11:31 AM | Last Updated on Mon, Mar 25 2024 1:20 PM

Formula One: Carlos Sainz Wins Australian Grand Prix - Sakshi

విజేతగా కార్లోస్‌ సెయింజ్‌ 

మెల్‌బోర్న్‌: ఫార్ములావన్‌ సీజన్‌లో వరుసగా మూడో విజయం సాధించాలని ఆశించిన వరల్డ్‌ చాంపియన్‌ మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌)కు నిరాశ ఎదురైంది. ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్‌ గ్రాండ్‌ప్రి రేసును ‘పోల్‌ పొజిషన్‌’తో ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ కారు ఇంజిన్‌లో సమస్య తలెత్తడంతో నాలుగో ల్యాప్‌లోనే వైదొలిగాడు.

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న ఫెరారీ జట్టు డ్రైవర్‌ కార్లోస్‌ సెయింజ్‌ జూనియర్‌ విజేతగా అవతరించాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల రేసును సెయింజ్‌ అందరికంటే వేగంగా ఒక గంటా 20 నిమిషాల 26.843 సెకన్లలో ముగించి ఈ సీజన్‌లో తొలి విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఫెరారీకే చెందిన చార్లెస్‌ లెక్‌లెర్క్‌ రెండో స్థానంలో నిలిచాడు. 2022 బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి తర్వాత ఇద్దరు ఫెరారీ డ్రైవర్లు టాప్‌–2లో నిలిచారు. సీజన్‌లోని నాలుగో రేసు జపాన్‌ గ్రాండ్‌ప్రి ఏప్రిల్‌ 7న జరుగుతుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement