ఫార్ములా వన్ సీజన్‌లో మూడో రేసు ఆ్రస్టేలియన్ గ్రాండ్‌ప్రిలో మ్యాక్స్ వెర్‌స్టాపెన్ పోల్ పొజిషన్‌ను సాధించాడు. మెల్‌బోర్న్‌లో శనివారం జరిగిన ప్రధాన క్వాలిఫయింగ్ రేస్‌ను రెడ్‌బుల్ డ్రైవర్ వెర్‌స్టాపెన్ 1 నిమిషం 15.915 సెకన్లలో పూర్తి చేశాడు. ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో (1 నిమిషం 16.185 సె.) రెండో స్థానంలో నిలవగా...ల్యాండో నోరిస్ (మెక్లారెన్ – 1 నిమిషం 16.315 సె.)కు మూడో స్థానం దక్కింది.
తొలి రెండు క్వాలిఫయింగ్‌లలో ముందంజలో నిలిచిన సెయింజ్‌నుంచి గట్టి పోటీ ఎదురైనా ఆ తర్వాత వెర్‌స్టాపెన్ దూసుకుపోయాడు. వెర్‌స్టాపెన్ ఎఫ్1 కెరీర్‌లో ఇది 35వ పోల్ పొజిషన్ కావడం విశేషం. గత సౌదీ అరేబియా రేసుకు ముందు అపెండిసైటిస్ బారిన పడి శస్త్ర చికిత్స చేయించుకున్న సెయింజ్ సత్తా చాటాడు. పేలవ ప్రదర్శన కనబర్చిన లూయీస్ హామిల్టన్ (మెర్సిడెజ్) 11వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment