
Australian Grand Prix- మెల్‌బోర్న్: తన కెరీర్‌లో లోటుగా ఉన్న ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో ఏడో ప్రయత్నంలో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన సీజన్ మూడో రేసులో వెర్‌స్టాపెన్ ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగాడు.
మూడుసార్లు ట్రాక్‌పై ఆయా జట్ల డ్రైవర్ల కార్లు అదుపు తప్పడం లేదా ఢీ కొట్టుకోవడంతో రేసుకు మూడుసార్లు అంతరాయం కలిగింది. చివరకు వెర్‌స్టాపెన్ నిర్ణీత 58 ల్యాప్‌లను 2 గంటల 32 నిమిషాల 38.371 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.
రేసును ప్రారంభించిన 20 మంది డ్రైవర్లలో 12 మంది మాత్రమే గమ్యానికి చేరారు. ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది రెండో విజయం. హామిల్టన్ (మెర్సిడెస్) రెండో స్థానంలో, ఫెర్నాండో అలోన్సో (ఆస్టన్ మార్టిన్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని నాలుగో రేసు అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి ఏప్రిల్ 30న జరుగుతుంది.
చదవండి: IPL 2023: చేతులు కాలాక.. తాపత్రయపడితే ఏం లాభం! 13 కోట్లు.. ఒక్క సిక్సర్ కూడా లేదు!
IPL 2023- Virat Kohli: చెలరేగిన హైదరాబాదీ.. అయినా! కోహ్లి అద్భుత ఇన్నింగ్స్.. అరుదైన ఘనత! ఒకే ఒక్కడితో..