ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ క్వాలిఫయింగ్ సెషన్స్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్‌లెర్క్ మరోసారి సత్తా చాటుకున్నాడు. బాకు నగరంలో శనివారం జరిగిన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో లెక్‌లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో లెక్‌లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.359 సెకన్లలో పూర్తి చేశాడు.
తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును లెక్‌లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో లెక్‌లెర్క్‌కిది ఆరో పోల్ పొజిషన్ కావడం విశేషం. సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి, వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు మొత్తం ఏడు రేసులు జరగ్గా... వెర్‌స్టాపెన్ నాలుగు రేసులో, లెక్‌లెర్క్ రెండు రేసుల్లో, పెరెజ్ ఒక రేసులో విజేతగా నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment