ferrari driver
-
సెయింజ్‌కు ‘పోల్’ పొజిషన్
మెక్సికో సిటీ: ఫెరారీ డ్రైవర్ కార్లోస్ సెయింజ్ సీజన్లో తొలి పోల్ పొజిషన్ సాధించాడు. మెక్సికో గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్ టోర్నీలో సెయింజ్ అగ్రస్థానంలో నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో సెయింజ్ ల్యాప్‌ను అందరికంటే వేగంగా 1 నిమిషం 15.946 సెకన్లలో పూర్తి చేశాడు. మెక్సికో గ్రాండ్‌ప్రిలో ఐదుసార్లు విజేతగా నిలిచిన రెడ్‌బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ (1 నిమిషం 16.171 సెకన్లలో) రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. మెక్లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (1 నిమిషం 16.260 సెకన్లలో) మూడో స్థానంలో నిలిచాడు. గత వారం యూఎస్ గ్రాండ్ ప్రి నెగ్గిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ నాలుగో స్థానంతో క్వాలిఫయింగ్ రౌండ్‌ను ముగించాడు. బ్రిటన్ స్టార్ డ్రైవర్ హామిల్టన్ (మెర్సిడెస్) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ‘మెక్సికోలాంటి క్లిష్ట తరమైన ట్రాక్‌పై వరుసగా రెండు ల్యాప్‌ల్లో అగ్రస్థానంతో ముగించడం ఆనందంగా ఉంది’ అని సెయింజ్ అన్నాడు. మెయిన్ రేసును సెయింజ్ పోల్ పొజిషన్‌తో ప్రారంభించనున్నాడు. -
తప్పు చేసింది కాక.. పోలీసు కాలుపైకి ఎక్కిస్తాడా?
-
Austrian Grand Prix: లెక్లెర్క్ ఖాతాలో మూడో విజయం
ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో మూడో విజయం నమోదు చేశాడు. స్పీల్బర్గ్లో ఆదివారం జరిగిన ఆస్ట్రియా గ్రాండ్‌ప్రిలో లెక్లెర్క్ చాంపియన్‌గా నిలిచాడు. నిర్ణీత 71 ల్యాప్‌లను లెక్లెర్క్ అందరికంటే వేగంగా గంటా 24 నిమిషాల 24.312 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
కార్లోస్‌కు తొలి టైటిల్
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): తన ఫార్ములావన్ కెరీర్లో 150వ రేసులో తొలిసారి ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో కార్లోస్ సెయింజ్ 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 17 నిమిషాల 50.311 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. తొలి ల్యాప్‌లోనే ఆల్ఫా రోమియో జట్టు డ్రైవర్ గ్వాన్యు జౌ కారు ప్రమాదానికి గురి కావడంతో రేసును కొంతసేపు నిలిపి వేసి మళ్లీ ప్రారంభించారు. గ్వాన్యు కారు పల్టీలు కొట్టుకుంటూ ట్రాక్ బయటకు వెళ్లింది. డ్రైవర్ గ్వాన్యుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
లెక్లెర్క్కు ఆరో పోల్ పొజిషన్... నేడు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి
ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్ క్వాలిఫయింగ్ సెషన్స్‌లో ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మరోసారి సత్తా చాటుకున్నాడు. బాకు నగరంలో శనివారం జరిగిన అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్‌లో లెక్లెర్క్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 41.359 సెకన్లలో పూర్తి చేశాడు. తద్వారా నేడు జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ సీజన్లో లెక్లెర్క్కిది ఆరో పోల్ పొజిషన్ కావడం విశేషం. సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానం నుంచి, వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానం నుంచి రేసును ఆరంభిస్తారు. ఈ సీజన్లో ఇప్పటివరకు మొత్తం ఏడు రేసులు జరగ్గా... వెర్స్టాపెన్ నాలుగు రేసులో, లెక్లెర్క్ రెండు రేసుల్లో, పెరెజ్ ఒక రేసులో విజేతగా నిలిచారు. -
బహ్రెయిన్ గ్రాండ్‌ప్రి విజేత లెక్లెర్క్
క్వాలిఫయింగ్ సెషన్లో కనబరిచిన జోరును ప్రధాన రేసులోనూ కొనసాగించాడు ఫెరారీ జట్టు డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్. ఆదివారం జరిగిన ఫార్ములావన్ సీజన్ తొలి రేసు బహ్రెయిన్ గ్రాండ్‌ప్రిలో అతడు విజేతగా నిలిచాడు. నిర్ణీత 57 ల్యాప్‌లను లెక్లెర్క్ ఒక గంట 37 నిమిషాల 33.584 సెకన్లలో పూర్తి చేసి కెరీర్లో మూడో విజయాన్ని అందుకున్నాడు. ఫెరారీకే చెందిన కార్లోస్ సెయింజ్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రపంచ చాంపియన్ వెర్స్టాపెన్ 54వ ల్యాప్‌లో వైదొలిగాడు. These two put on one heck of a show!@Charles_Leclerc ⚔️ @Max33Verstappen #BahrainGP #F1 pic.twitter.com/Zl5Szg0qDv — Formula 1 (@F1) March 20, 2022 They've waited a long time for this!@ScuderiaFerrari let the emotion out after their first 1-2 since 2019 🎉#BahrainGP #F1 pic.twitter.com/ap5vFbWI26 — Formula 1 (@F1) March 20, 2022 -
లెక్లెర్క్కు పోల్ పొజిషన్
మోంటేకార్లో: ఫార్ములా వన్ (ఎఫ్1) సీజన్లో ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న మెర్సిడెస్, రెడ్‌బుల్ డ్రైవర్లకు ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ చెక్ పెట్టాడు. తన సొంత గ్రాండ్‌ప్రి అయిన మొనాకో స్ట్రీట్ సర్క్యూట్లో శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో సత్తా చాటిన లెక్లెర్క్ సీజన్లో తొలి పోల్ సాధించాడు. కెరీర్లో అతడికి ఇది ఎనిమిదో పోల్. 2019 మెక్సికన్ గ్రాండ్‌ప్రిలో చివరిసారిగా లెక్లెర్క్ పోల్ సాధించాడు. మొనాకో వీధుల గుండా సాగిన క్వాలిఫయింగ్ చివరి సెషన్లో నిమిషం 10.346 సెకన్లలో ల్యాప్‌ను అతను పూర్తి చేశాడు. అయితే సెషన్ మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందనగా లెక్లెర్క్ కారు ప్రమాదానికి గురైంది. ఒకవేళ అతని కారు గేర్ బాక్స్‌ను మారిస్తే... లెక్లెర్క్కు ఐదు స్థానాల గ్రిడ్ పెనాల్టీ పడుతుంది. లేదంటే ఆదివారం జరిగే ప్రధాన రేసును అతడు తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.230 సెకన్లు ఆలస్యంగా ల్యాప్‌ను ముగించిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. బొటాస్ (మెర్సిడెస్) మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు. స్పానిష్ గ్రాండ్‌ప్రితో పోల్ల సెంచరీ కొట్టిన మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ఈ క్వాలిఫయింగ్ సెషన్ ఏ మాత్రం కలిసి రాలేదు. పోల్ సిట్టర్‌కు 0.749 సెకన్లు వెనుకగా ల్యాప్‌ను పూర్తి చేసిన అతను ఏకంగా ఏడో స్థానంలో నిలిచాడు. -
ఫెరారీ డ్రైవర్‌గా సెయింజ్
పారిస్: ఫెరారీ జట్టులో స్టార్ రేసర్‌గా వెలుగొందిన సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ) స్థానాన్ని కార్లోస్ సెయింజ్ (జూనియర్)తో భర్తీ చేశారు. ఈ మేరకు అతనితో రెండేళ్లపాటు ఒప్పందం చేసుకున్నట్లు ఫార్ములావన్ టీమ్ ఫెరారీ వెల్లడించింది. నాలుగు సార్లు ఫార్ములావన్ చాంపియన్ అయిన జర్మనీ డ్రైవర్ వెటెల్ ఫెరారీని వీడనున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో పలువురి పేర్లు వినిపించినా... చివరకు సెయింజ్‌కు ఆ చాన్స్ దక్కింది. 2021, 2022 ఫార్ములావన్ రెండు సీజన్లలో సెయింజ్ ఫెరారీ స్టీరింగ్ చేపట్టనున్నాడు. ప్రస్తుతం మెక్‌లారెన్‌తో ఉన్న సెయింజ్ కాంట్రాక్ట్ ఈ ఏడాదితో ముగియనుంది. 2015లో టోరో రోసోతో తన ఫార్ములా కెరీర్‌ను ఆరంభించిన సెయింజ్... అనంతరం రీనాల్ట్, మెక్లారెన్ జట్లకు డ్రైవర్‌గా వ్యవహరించాడు. ‘సెయింజ్ ప్రతిభ గల డ్రైవర్... గత ఐదు సీజన్లలో అతడు తనను తాను నిరూపించుకున్నాడు. అతడికి ఫెరారీ స్వాగతం పలుకుతోంది’ అని ఫెరారీ జట్టు చీఫ్ మాటియో బినోటో తెలిపారు. ఫెరారీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని.. అయితే ప్రస్తుతం ఈ సీజన్లో మెక్లారెన్ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చి వారికి ఘనమైన వీడ్కోలు పలకడమే తన ముందున్న లక్ష్యం అని సెయింజ్ పేర్కొన్నాడు. సెయింజ్ వెళ్లిపోవడంతో అతని స్థానాన్ని రికియార్డో (ఆస్ట్రేలియా)తో భర్తీచేసుకున్నట్లు మెక్లారెన్ జట్టు వెల్లడించింది. కరోనాతో నిలిచిపోయిన 2020 సీజన్ ఈ జూలైలో ఆరంభమయ్యే అవకాశం ఉంది. -
హామిల్టన్‌ను గెలిపించిన ఫెరారీ
సోచి: గెలవాల్సిన రేసును బంగారు పళ్లెంలో పెట్టి మెర్సిడెస్కు అప్పగించింది ఫెరారీ. ప్రత్యర్థి పేలవ రేసు వ్యూహాన్ని అనుకూలంగా మార్చుకున్న మెర్సిడెస్ డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఈ సీజన్లో తొమ్మిదో విజయాన్ని నమోదు చేశాడు. దీంతో ఆరోసారి ప్రపంచ డ్రైవర్ చాంపియన్‌గా అవతరించడానికి మరింత దగ్గరయ్యాడు. ఆదివారం 53 ల్యాప్‌ల ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన అతను అందరి కంటే ముందుగా గంటా 33 నిమిషాల 38.992 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ 3.829 సెకన్ల వెనుకగా రేసును ముగించి రెండో స్థానంలో నిలువగా... పోల్ పొజిషన్ నుంచి రేసును ఆరంభించిన ఫెరారీ డ్రైవర్ చార్లెస్ లెక్లెర్క్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా రేసు మధ్యలోనే వైదొలిగాడు. రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, ఆల్బన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. అందరి కంటే చివరగా... పిట్లేన్ నుంచి రేసును ఆరంభించిన ఆల్బన్ అద్భుతమైన డ్రైవింగ్‌తో ఐదో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం డ్రైవర్ ఛాంపియన్ షిప్ లో హామిల్టన్ 322 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుండగా... 73 పాయింట్ల తేడాతో బొటాస్ రెండో స్థానంలో ఉన్నాడు. తదుపరి గ్రాండ్‌ప్రి అక్టోబర్ 13న జపాన్‌లో జరుగుతుంది. -
లెక్లెర్క్ హ్యాట్రిక్ పోల్స్
సింగపూర్: తాజా ఫార్ములావన్ సీజన్లో ఫెరారీ డ్రైవర్ లెక్లెర్క్ హ్యాట్రిక్ పోల్స్‌తో అదరగొట్టాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్ లో అందరి కంటే వేగంగా ల్యాప్‌ను 1 నిమిషం 36.217 సెకన్లలో చుట్టేసి పోల్ పొజిషన్‌ను సాధించాడు. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును లెక్లెర్క్ మొదటి స్థానం నుంచి ఆరంభిస్తాడు. 0.191 సెకన్ల తేడాతో ల్యాప్‌ను ముగించిన మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫెరారీకే చెందిన మరో డ్రైవర్ వెటెల్ మూడో స్థానంలో, రెడ్ బుల్ డ్రైవర్ వెర్స్టాపెన్ నాలుగు, మరో మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ ఐదు స్థానాల్లో నిలిచారు. తాజా పోల్ పొజిషన్‌తో లెక్లెర్క్ ఈ సీజన్లో ఇప్పటి వరకు అత్యధిక పోల్ పొజిషన్స్ (5) సాధించిన డ్రైవర్‌గా అవతరించాడు. హామిల్టన్ (4) రెండో స్థానంలో ఉన్నాడు. చివరి రెండు రేసులను పోల్ పొజిషన్ నుంచి ఆరంభించి విజేతగా నిలిచిన లెక్లెర్క్... సింగపూర్ గ్రాండ్‌ప్రిలో కూడా విజేతగా నిలుస్తాడో? లేదో?.. చూడాలి. ప్రధాన రేసు నేటి సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానుంది. -
మొనాకో చాంప్ రికియార్డో
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో ఎట్టకేలకు మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఇక్కడ మూడేళ్లుగా టైటిల్ కోసం తన స్పీడుకు పదును పెడుతున్నప్పటికీ... అందని టైటిల్ ఈసారి మాత్రం చేతికందింది. పోల్ పొజిషన్ సాధించిన ఈ రెడ్‌బుల్ డ్రైవర్ టైటిలే లక్ష్యంగా ఆదివారం తన జోరు చూపెట్టాడు. మొదటి స్థానం నుంచి రేసును ఆరంభించిన రికియార్డో 78 ల్యాప్‌ల రేసును గంటా 42 నిమిషాల 54.807 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 7.7336 సెకన్ల తేడాతో గత విజేత, ఫెరారీ డ్రైవర్ వెటెల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ ఆరో స్థానంలో నిలువగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానం పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 10న జరుగుతుంది. -
హంగేరి గ్రాండ్ ప్రీ విజేత వెటెల్
బుడాపెస్ట్: హంగేరి ఫార్ములా వన్ గ్రాండ్ ప్రీలో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్ రేసును వెటెల్ ప్రథమ స్థానంతో పూర్తిచేశాడు. రెడ్ బుల్ డ్రైవర్లు డానిల్ క్వియాట్, డానియల్ రికియార్డో వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. కాగా ఈ ఏడాది ఫార్ములా వన్ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయీస్ హామిల్టన్ ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. శనివారం క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించినా ఫైనల్ రేసులో వెనుకబడ్డాడు.