సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): తన ఫార్ములావన్ కెరీర్‌లో 150వ రేసులో తొలిసారి ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో కార్లోస్ సెయింజ్ 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 17 నిమిషాల 50.311 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. తొలి ల్యాప్‌లోనే ఆల్ఫా రోమియో జట్టు డ్రైవర్ గ్వాన్‌యు జౌ కారు ప్రమాదానికి గురి కావడంతో రేసును కొంతసేపు నిలిపి వేసి మళ్లీ ప్రారంభించారు. గ్వాన్‌యు కారు పల్టీలు కొట్టుకుంటూ ట్రాక్ బయటకు వెళ్లింది. డ్రైవర్ గ్వాన్‌యుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment