British Grand Prix
-
వెర్స్టాపెన్ ఖాతాలో వరుసగా ఆరో విజయం
సిల్వర్‌స్టోన్: ఫార్ములావన్ తాజా సీజన్లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ అందరికంటే వేగంగా గంటా 25 నిమిషాల 16.938 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో వెర్‌స్టాపెన్‌కిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం వెర్స్టాపెన్ 255 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 22 రేసుల ఈ సీజన్లో ఇప్పటివరకు 10 రేసులు ముగిశాయి. పదింటికి పది రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లే గెలుపొందడం విశేషం. వెర్స్టాపెన్ ఎనిమిది రేసుల్లో నెగ్గగా... మిగతా రెండింటిలో రెడ్‌బుల్‌కే చెందిన సెర్జియో పెరెజ్ విజయం సాధించాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది. చదవండి: నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా -
కార్లోస్‌కు తొలి టైటిల్
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): తన ఫార్ములావన్ కెరీర్లో 150వ రేసులో తొలిసారి ఫెరారీ జట్టు డ్రైవర్ కార్లోస్ సెయింజ్ టైటిల్‌ను సాధించాడు. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో కార్లోస్ సెయింజ్ 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 2 గంటల 17 నిమిషాల 50.311 సెకన్లలో పూర్తి చేసి విజేతగా అవతరించాడు. పెరెజ్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. తొలి ల్యాప్‌లోనే ఆల్ఫా రోమియో జట్టు డ్రైవర్ గ్వాన్యు జౌ కారు ప్రమాదానికి గురి కావడంతో రేసును కొంతసేపు నిలిపి వేసి మళ్లీ ప్రారంభించారు. గ్వాన్యు కారు పల్టీలు కొట్టుకుంటూ ట్రాక్ బయటకు వెళ్లింది. డ్రైవర్ గ్వాన్యుకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
నువ్వేం మనిషివి.. సిగ్గులేకుండా సంబురాలా?
నాటకీయ పరిణామాల నడుమ బ్రిటిష్ప్రి రేస్ నెగ్గిన ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్ లూయిస్ హామిల్టన్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. రెడ్‌బుల్ రేసర్ మాక్స్ వెర్స్టాపెన్ని ఢీ కొట్టాడని, అతను ఆస్పత్రి పాలైతే.. లూయిస్ గెలిచి సంబురాలు చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని హామిల్టన్‌ను నిలదీస్తున్నారు. ఆదివారం బ్రిటిష్ గ్రాండ్‌ప్రి రేసులో విజేతగా నిలిచాడు మెర్సెడెస్ రైడర్ లూయిస్ హామిల్టన్. అయితే తొలి ల్యాప్‌లోనే రెడ్‌బుల్ రైడర్ మాక్స్ వెర్స్టాపెన్ను ప్రమాదకరమైన మలుపుతో ఢీకొట్టడం, ఆపై వెర్స్టాపెన్ను ఆస్పత్రికి తరలించడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో లూయిస్‌కు పది సెకండ్ల పెనాల్టీ విధించారు. అయినప్పటికీ లూయిస్ రేస్ నెగ్గి, సంబురాలు చేసుకున్నాడు. అయితే తాను ఆస్పత్రి పాలైన టైంలో వేడుకలు చేసుకోవడం సరికాదని వ్యాఖ్యానించాడు వెర్స్టాపెన్. ‘లూయిస్ తీరు సరికాదు. అమానుషం. స్పోర్టివ్ స్ఫూర్తికి విరుద్ధం. ఆటగాళ్లు వ్యవహరించాల్సిన తీరు అది కానేకాద’ని అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు సిగ్గులేకుండా క్రాష్‌కి పాల్పడి.. గెలుపు సంబురాలు చేసుకున్నాడని, అదసలు గెలుపే కాదని పలువురు కామెంట్లు చేస్తున్నారు. What a crash! @SkySports @SkySportsF1 @SilverstoneUK @redbullracing @Max33Verstappen @F1 #f1 #BritishGrandPrix #maxverstappen #RedBullRacing #britishgp #formula1 pic.twitter.com/zpFHwUwiEG — Killian Connolly (@Kill_Connolly) July 18, 2021 మొత్తం లక్షా నలభై వేలమంది వ్యూయర్స్ మధ్య ఆదివారం బ్రిట్రిష్ గ్రాండ్‌ప్రి జరిగింది. అయితే పోల్ పొజిషన్‌తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్, లూయిస్ ఢీ కొట్టడంతో తొలి ల్యాప్‌లోనే వైదొలిగాడు. ఆ వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక 52 ల్యాప్‌ల రేసును 58 నిమిషాల 23.284 సెకన్లలో పూర్తి చేశాడు లూయిస్. తద్వారా బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వరుసగా మూడో ఏడాది.. ఓవరాల్‌గా ఏనిమిదో సారి విజేతగా నిలిచాడు. Glad I’m ok. Very disappointed with being taken out like this. The penalty given does not help us and doesn’t do justice to the dangerous move Lewis made on track. Watching the celebrations while still in hospital is disrespectful and unsportsmanlike behavior but we move on pic.twitter.com/iCrgyYWYkm — Max Verstappen (@Max33Verstappen) July 18, 2021 జాతి వివక్ష మరోవైపు రెడ్‌బుల్ ఈ విజయాన్ని క్రూరత్వంగా వర్ణిస్తోంది. హామిల్టన్‌కు పెనాల్టీ సరిపోయే శిక్ష కాదని చెబుతోంది. ఇదిలా ఉంటే లూయిస్ హామిల్టన్‌పై సోషల్ మీడియాలో జాతి వివక్ష కామెంట్లు మొదలయ్యాయి. కోతి(మంకీ) ఎమోజీలను ఉంచుతున్నారు చాలామంది. మరోవైపు మెర్సడెస్ ఈ కామెంట్లను ఖండిస్తోంది. వర్ణ వివక్షకు తాము వ్యతిరేకమని, టాలెంట్ ఉన్న ఆటగాళ్లను ప్రోత్సహించడమే మా పని అంటూ పేర్కొంది. -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై దుమ్మురేపిన బ్రిటన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది ఫార్ములావన్ (ఎఫ్1) సీజన్లో ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన ఈ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నిర్ణీత 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, ముందుగా గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో ముగించాడు. తద్వారా రికార్డుస్థాయిలో ఏడోసారి (2008, 2014, 2015, 2016, 2017, 2019, 2020) బ్రిటిష్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రేసు మరో ల్యాప్‌లో ముగుస్తుందనగా హామిల్టన్ కారు టైరు పంక్చర్ కావడం గమనార్హం. పంక్చర్ టైరుతోనే హామిల్టన్ రేసును పూర్తి చేశాడు. మాక్స్ వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రేసింగ్ పాయింట్ డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ రేసును ప్రారంభించలేదు. క్వియాట్ (అల్ఫా టౌరి) 11వ ల్యాప్‌లో, మాగ్నుసెన్ (హాస్) తొలి ల్యాప్‌లో వైదొలిగారు. ఈ గెలుపుతో సొంతగడ్డపై అత్యధిక ఎఫ్1 టైటిల్స్ గెలిచిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్ రికార్డు సృష్టించాడు. ఈ రేసుకంటే ముందు ఫ్రాన్స్ డ్రైవర్ అలైన్ ప్రాస్ట్ (ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి–6 సార్లు)తో హామిల్టన్ సమఉజ్జీగా ఉన్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్ కెరీర్లో ఇది 87వ ఎఫ్1 టైటిల్. మరో నాలుగు టైటిల్స్ గెలిస్తే అత్యధిక ఎఫ్1 టైటిల్స్ నెగ్గిన మైకేల్ షుమాకర్ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్ సమం చేస్తాడు. సీజన్‌లోని ఐదో రేసు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి వేదికపైనే ఈనెల 9న జరుగుతుంది. ఆస్ట్రియా, హంగేరి, బ్రిటిష్ గ్రాండ్‌ప్రి విజయాలతో హామిల్టన్ 88 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు. -
రికార్డుపై హామిల్టన్ గురి
సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై అత్యధిక టైటిల్స్ గెలిచిన ఫార్ములావన్ (ఎఫ్1) తొలి డ్రైవర్‌గా గుర్తింపు పొందేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మరో విజయం దూరంలో ఉన్నాడు. ఆదివారం జరిగే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో ఈ బ్రిటన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’తో బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 24.303 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి కెరీర్లో 91వసారి పోల్ పొజిషన్ దక్కించుకున్నాడు. నేడు జరిగే ప్రధాన రేసులో హామిల్టన్ విజేతగా గెలిస్తే బ్రిటిష్ గ్రాండ్‌ప్రిని ఏడోసారి సొంతం చేసుకున్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం సొంతగడ్డపై అత్యధిక టైటిల్స్ నెగ్గిన రికార్డు విషయంలో హామిల్టన్, అలైన్ ప్రాస్ట్ (ఫ్రాన్స్–ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి; ఆరుసార్లు) సమఉజ్జీగా ఉన్నారు. రెండువారాల క్రితం హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిల్ నెగ్గిన హామిల్టన్ ఒకే రేసును అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలిచిన డ్రైవర్‌గా మైకేల్ షుమాకర్ (ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి–8 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 4. లెక్లెర్క్ (ఫెరారీ), 5. లాండో నోరిస్ (మెక్లారెన్), 6. లాన్స్ స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 7. కార్లోస్ సెయింజ్ (మెక్లారెన్), 8. రికియార్డో (రెనౌ), 9. ఎస్తెబన్ ఒకాన్ (రెనౌ), 10. వెటెల్ (ఫెరారీ), 11. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 12. ఆల్బోన్ (రెడ్‌బుల్), 13. హుల్కెన్‌బర్గ్ (రేసింగ్ పాయింట్), 14. జార్జి రసెల్ (విలియమ్స్), 15. మాగ్నుసెన్ (హాస్), 16. గియోవినాజి (అల్ఫా రోమియో), 17. రైకోనెన్ (అల్ఫా రోమియో), 18. గ్రోస్యెన్ (హాస్), 19. క్వియాట్ (అల్ఫా టౌరి), 20. నికోలస్ లటీఫి (విలియమ్స్). -
బ్రిటిష్ గ్రాండ్‌ప్రి చాంపియన్ సెబాస్టియన్ వెటెల్
ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములావన్ రేసులో విజేతగా నిలిచాడు. సిల్వర్‌స్టోన్‌లో ఆదివారం జరిగిన 52 ల్యాప్‌ల ఈ రేసును వెటెల్ గంటా 27 నిమిషాల 29.784 సెకన్లలో ముగించాడు. ఈ సీజన్లో వెటెల్‌కిది నాలుగో విజయం. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు ఒకాన్ ఏడో స్థానంలో, పెరెజ్ 11వ స్థానంలో నిలిచారు. -
హామిల్టన్ ‘హ్యాట్రిక్’
* వరుసగా మూడోసారి బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): ఈ సీజన్ ఆరంభంలో నిరాశపరిచిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. సొంతగడ్డపై జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ఫార్ములవన్ రేసులో హామిల్టన్ వరుసగా మూడో ఏడాది విజేతగా నిలిచి ‘హ్యాట్రిక్’ సాధించాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన హామిల్టన్ నిర్ణీత 52 ల్యాప్‌లను గంటా 34 నిమిషాల 55.831 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. గత ఐదు రేసుల్లో నాలుగింట హామిల్టనే విజయం సాధించడం విశేషం. ఓవరాల్‌గా హామిల్టన్‌కిది నాలుగో బ్రిటిష్ గ్రాండ్‌ప్రి టైటిల్. 2008లో తొలిసారి అతను ఈ టైటిల్‌ను నెగ్గాడు. ఈ గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రోస్‌బర్గ్ (171 పాయింట్లు), హామిల్టన్ (167 పాయింట్లు) మధ్య తేడా నాలుగు పాయింట్లకు చేరింది. ఈ సీజన్లో మరో 11 రేసులు మిగిలి ఉన్నాయి. తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. హామిల్టన్ సహచరుడు రోస్బర్గ్కు రెండో స్థానం లభించగా... వెర్స్టాపెన్ (రెడ్‌బుల్) మూడో స్థానంలో నిలిచాడు. ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వర్షం అంతరాయం కలిగించిన ఈ రేసులో ఆరుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టుకు ఈ రేసు కలిసొచ్చింది. ఫోర్స్ ఇండియా డ్రైవర్లిద్దరూ టాప్-10లో నిలిచారు. సెర్గియో పెరెజ్‌కు ఆరో స్థానం, హుల్కెన్‌బర్గ్‌కు ఏడో స్థానం లభించింది. -
హామిల్టన్ సరికొత్త చరిత్ర
సిల్వర్‌స్టోన్: ప్రపంచ ఫార్ములావన్ చాంపియన్, మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్.. బ్రిటీష్ గ్రాండ్ ప్రిలో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసులో హామిల్టన్ విజయం సాధించి వరుసగా మూడు సార్లు బ్రిటీష్ గ్రాండ్ ప్రి గెలిచిన తొలి డ్రైవర్ గా రికార్డు సాధించాడు. 52 ల్యాప్‌ల రేసును హామిల్టన్ అందరి కంటే వేగంగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. దీంతో ఈ సీజన్లో నాల్గో విజయాన్ని హామిల్టన్ తన ఖాతాలో వేసుకోగా, వరుసగా రెండో విజయాన్ని సాధించాడు. మరోవైపు బ్రిటీష్ గ్రాండ్ ప్రిని హామిల్టన్ ఓవరాల్‌గా నాలుగుసార్లు గెలిచి మాజీ ఫార్ములావన్ డ్రైవర్ నిజిల్ మేన్ సిల్ సరసన నిలిచాడు. సొంతగడ్డపై జరిగిన ఈ రేసులో హామిల్టన్ దుమ్మురేపగా, సహచర డ్రైవర్ నికో రోస్ బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ తాజా విజయంతో రోస్ బర్గ్ పాయింట్లకు హామిల్టన్ మరింత దగ్గరగా వచ్చాడు. కేవలం రోస్ బర్గ్ కంటే నాలుగు పాయింట్లు మాత్రమే హామిల్టన్ వెనకబడ్డాడు. ఇదిలా ఉండగా, మ్యాక్స్ వెర్స్టాపెన్(రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, అదే జట్టుకు చెందిన డేనియల్ రికార్డియో నాల్గో స్థానానికి పరిమితమై పోల్ పొజిషన్ సాధించడంలో విఫలమయ్యాడు. -
హామిల్టన్‌కు ఆరో ‘పోల్’
నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి సిల్వర్‌స్టోన్ (ఇంగ్లండ్): సొంతగడ్డపై మరోసారి సత్తా చాటుకునేందుకు బ్రిటన్ ఫార్ములావన్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ సిద్ధమయ్యాడు. ఆదివారం జరిగే బ్రిటిష్ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును ప్రస్తుత ప్రపంచ చాంపియన్ హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టుకు చెందిన హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 29.287 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి ఈ సీజన్లో ఆరోసారి ‘పోల్ పొజిషన్’ను సంపాదించాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ రేసును రెండో స్థానం నుంచి మొదలుపెడతాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా తొమ్మిది, 11వ స్థానాల నుంచి రేసును ప్రారంభిస్తారు. నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
హామిల్టన్‌కే పోల్
సిల్వర్‌స్టోన్:ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్, మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ ఈ సీజన్లో ఆరో పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన బ్రిటీష్ గ్రాండ్ ప్రి క్వాలిఫయింగ్‌లో హామిల్టన్ 1:29:287 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచి పోల్ పొజిషన్ సాధించాడు.ఓవరాల్ గా ఇది హామిల్టన్ కెరీర్లో 55వ పోల్ పొజిషన్. దీంతో ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ పోల్ పొజిషన్ నుంచి ఆరంభిస్తాడు. ఇదిలా ఉండగా, హామిల్టన్ కంటే 0:319 సెకన్లు వెనుకబడ్డ అతని సహచరుడు నికో రోస్‌బర్గ్ రెండో స్థానంలో నిలిచాడు. ఈ సీజన్లో ఇప్పటివరకూ తొమ్మిది ఫార్ములావన్ రేసులో జరగ్గా అందులో రోస్ బర్గ్ ఐదింటిని, హామిల్టన్ మూడింటిని దక్కించుకున్నాడు. ప్రస్తుతం రోస్ బర్గ్ 153 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, హామిల్టన్ 142 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. మరోవైపు స్పెయిన్ గ్రాండ్ ప్రి విజేత మ్యాక్స్ వెర్స్టాపెన్ (రెడ్ బుల్) మూడో స్థానంలో నిలవగా, డానియల్ రికార్డో(రెడ్ బుల్) నాల్గో స్థానంలో సాధించారు. కాగా, ఫోర్స్ ఇండియాకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఫోర్స్ ఇండియా డ్రైవర్ నికో హుల్కెన్ బర్గ్ ఎనిమిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ పదకొండో స్థానాలకు పరిమితమయ్యారు. -
జనం ముందుకు విజయ్ మాల్యా!
లండన్: భారత బ్యాంకులకు దాదాపు రూ.9 వేలకోట్లు ఎగనామం పెట్టి, విదేశాలకు పారిపోయిన లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా చాలా రోజుల తర్వాత అధికారిక సమావేశంలో కనిపించనున్నారు. గత మార్చి నెలలో యూకేకు పారిపోయిన తర్వాత మాల్యా అధికారిక ఈవెంట్లలో కనిపించలేదు. ప్రస్తుతం యూకేలోని లండన్‌లో నివాసం ఉంటున్న మాల్యా శుక్రవారం జరగనున్న బ్రిటీష్ గ్రాండ్ ప్రీ కన్నా కొంత సమయం ముందు ఇతర జట్ల డైరెక్టర్లు, ఉన్నతాధికారులతో భేటీ అవనున్నారు. ఫోర్స్ ఇండియాకు యజమాని అయిన మాల్యా.. ఫెరారీ, మెక్ లారెన్, మెనార్, విలియమ్స్, మెర్సిడేజ్ ఎఫ్1 రేస్ డైరెక్టర్లతో చర్చలు జరపనున్నట్లు సమాచారం. వ్యక్తిగతంగా మాల్యా చిక్కుల్లో ఉన్నప్పటికీ, ఫోర్స్ ఇండియా మాత్రం సీజన్లో మంచి ఫలితాలను రాబట్టింది. కాగా గత నెల లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాను ఉద్దేశ పూర్వక ఎగవేత దారుడిగా ముంబై కోర్టు ప్రకటించించిన విషయం తెలిసిందే. పలుమార్లు విచారణకు హాజరుకానందున, ఈడీ ఆస్తులను జప్తు చేయకముందే వాటిని అమ్మకాలు చేపట్టినందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధిష్టానం ప్రకటించింది. మనీ లాండరింగ్ కేసులో జులై 29న ఉదయం 11 గంటల లోపు కోర్టు ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారించిన కోర్టు... లిక్కర్ కింగ్ విజయమాల్యా భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రూపాయల రుణం తీసుకొని మోసగించిన మాట వాస్తవమేనని ప్రకటించింది. -
మళ్లీ హామిల్టన్‌కే ‘పోల్’
నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి సిల్వర్‌స్టోన్ (యునెటైడ్ కింగ్డమ్): సొంతగడ్డపై దుమ్మురేపిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్లో ఎనిమిదోసారి ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఇంగ్లండ్‌కు చెందిన హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 32.248 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. డిఫెండింగ్ చాంపియన్ అయిన 30 ఏళ్ల హామిల్టన్ ప్రస్తుతం డ్రైవర్స్ స్టాండింగ్స్‌లో తొలి స్థానంలో ఉన్నాడు. రెండో స్థానం నుంచి మొదలుపెట్టే మెర్సిడెస్ జట్టుకే చెందిన నికో రోస్‌బర్గ్ నుంచి హామిల్టన్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశముంది. చివరి నాలుగు రేసుల్లో రోస్‌బర్గ్ మూడింటిలో గెలవడం విశేషం. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్, సెర్గియో పెరెజ్ వరుసగా 9, 11వ స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. టాప్-10 గ్రిడ్ పొజిషన్స్ 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. రోస్‌బర్గ్ (మెర్సిడెస్), 3. మసా (విలియమ్స్), 4. బొటాస్ (విలియమ్స్), 5. రైకోనెన్ (ఫెరారీ), 6. వెటెల్ (ఫెరారీ), 7. క్వియాట్ (రెడ్‌బుల్), 8. సెయింజ్ (ఎస్టీఆర్), 9. హుల్కెన్‌బర్గ్ (ఫోర్స్ ఇండియా), 10. రికియార్డో (రెడ్‌బుల్). నేటి ప్రధాన రేసు సా.గం. 5.25 నుంచి స్టార్ స్పోర్ట్స్-4లో ప్రత్యక్ష ప్రసారం -
‘పోల్’ నం.4
రోస్‌బర్గ్ హవా టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి సిల్వర్‌స్టోన్: క్వాలిఫయింగ్ చివరి సెషన్లో మరోసారి తన ఆధిపత్యం నిరూపించుకుంటూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.766 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఈ సీజన్లో రోస్‌బర్గ్‌కిది నాలుగో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలుపెట్టనున్న రోస్‌బర్గ్ టైటిల్ నిలబెట్టుకునే లక్ష్యంతో ఉన్నాడు. ఈ సీజన్లో ఒక్క విజయాన్నీ దక్కించుకోని డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఆరు రేసుల తర్వాత మరోసారి రెండో స్థానం నుంచి రేసును ఆరంభించనున్నాడు. మాజీ చాంపియన్ జెన్సన్ బటన్ మూడో స్థానంతో రేసును ప్రారంభిస్తాడు. ‘స్థానిక స్టార్’ హామిల్టన్ చివరి సెషన్లో తప్పిదం చేసి ఆరో స్థానం దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు క్వాలిఫయింగ్ సెషన్ కలిసొచ్చింది. ‘ఫోర్స్’ జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ నాలుగో స్థానం నుంచి... సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.