సిల్వర్‌స్టోన్: ఫార్ములావన్ తాజా సీజన్‌లో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం జరిగిన బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. 52 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన ఈ నెదర్లాండ్స్ డ్రైవర్ అందరికంటే వేగంగా గంటా 25 నిమిషాల 16.938 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో వెర్‌స్టాపెన్‌కిది వరుసగా ఆరో విజయం కావడం విశేషం.
లాండో నోరిస్ (మెక్‌లారెన్) రెండో స్థానంలో, హామిల్టన్ (మెర్సిడెస్) మూడో స్థానంలో నిలిచారు. ప్రస్తుతం వెర్‌స్టాపెన్ 255 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు. 22 రేసుల ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 రేసులు ముగిశాయి. పదింటికి పది రెడ్‌బుల్ జట్టు డ్రైవర్లే గెలుపొందడం విశేషం. వెర్‌స్టాపెన్ ఎనిమిది రేసుల్లో నెగ్గగా... మిగతా రెండింటిలో రెడ్‌బుల్‌కే చెందిన సెర్జియో పెరెజ్ విజయం సాధించాడు. సీజన్‌లోని తదుపరి రేసు హంగేరి గ్రాండ్‌ప్రి ఈనెల 23న జరుగుతుంది.
చదవండి: నాకు నమ్మకం ఉంది.. టీమిండియాను మా జట్టు ఓడిస్తుంది: బ్రియాన్ లారా
Comments
Please login to add a commentAdd a comment