వెర్‌స్టాపెన్‌కు షాక్ ∙ఫార్ములావన్ డచ్ గ్రాండ్‌ప్రి
జాండ్‌వర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు సొంతగడ్డపై ఎదురుదెబ్బ తగిలింది. గత మూడేళ్లుగా డచ్ గ్రాండ్‌ప్రిలో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి విజేతగా నిలిచిన వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్)కు ఈ ఏడాది క్వాలిఫయింగ్ రౌండ్‌లో చుక్కెదురైంది.
శనివారం నిర్వహించిన అర్హత పోటీలో వెర్‌స్టాపెన్‌ను వెనక్కి నెడుతూ.. లాండో నోరిస్ (మెక్‌లారెన్) ‘పోల్ పొజిషన్’సాధించాడు. 2021 సీజన్‌తో ఫార్ములావన్ క్యాలెండర్‌లో తిరిగి వచి్చన డచ్ గ్రాండ్‌ప్రిలో గత మూడు పర్యాయాలు వెర్‌స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించి రేసులో విజేతగా నిలిచాడు. కాగా, శనివారం క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ దుమ్మురేపాడు. వెర్‌స్టాపెన్ కంటే రెప్పపాటు ముందు లక్ష్యాన్ని చేరి ‘పోల్ పొజిషన్’కొట్టేశాడు. పియాస్ట్రి (మెక్‌లారెన్), రస్సెల్ (మెర్సిడెస్), పెరేజ్ (రెడ్‌బుల్) వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచాడు.
బ్రిటన్ స్టార్ డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 14 రేసుల్లో ఏడింట నెగ్గిన వెర్‌స్టాపెన్... డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్íÙప్‌లో 277 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలి కాలంలో వెర్‌స్టాపెన్‌కు గట్టి పోటీనిస్తున్న బ్రిటన్ డ్రైవర్ నోరిస్ 199 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో వెర్‌స్టాపెన్ జోరుకు చెక్ పెట్టిన నోరిస్.. ఆదివారం ప్రధాన రేసులోనూ దీన్ని కొనసాగిస్తాడా చూడాలి. 26 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్‌లో 200వ రేసు కావడం విశేషం.
ప్రాక్టీస్‌లో కారు బుగ్గి
డచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో అమెరికా రేసర్ లోగాన్ సార్జియాంట్ కారు ప్రమాదానికి గురైంది. సాధన సమయంలో కారు ట్రాక్‌పై నుంచి కాస్త పక్కకు వెళ్లగానే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన సార్జియాంట్ తక్షణమే కారు నుంచి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయతి్నంచే లోపే కారు మొత్తం కాలి బూడిదైంది. దీంతో పాటు క్వాలిఫయింగ్ ఈవెంట్ ఆరంభానికి ముందు మరో డ్రైవర్ కారులో కూడా మంటలు చెలరేగాయి.
Comments
Please login to add a commentAdd a comment