లాండ్ నోరిస్ (PC: Formula 1 X)
ఫార్ములావన్ ప్రపంచ చాంపియన్‌లో భాగంగా సింగపూర్ గ్రాండ్‌ప్రిలో మెక్‌లారెన్ డ్రైవర్ లాండో నోరిస్ (బ్రిటన్) టైటిల్ కైవసం చేసుకున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో అగ్రస్థానంలో నిలిచి ‘పోల్ పొజిషన్’తో రేసు ప్రారంభించిన నోరిస్ అందరికంటే వేగంగా 1 గంట 40 నిమిషాల 52.571 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచాడు.
కాగా డ్రైవర్ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న రెడ్‌బుల్ రేసర్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్స్) 1 గంట 41 నిమిషాల 13.516 సెకన్లలో గమ్యాన్ని చేరి రెండో స్థానంతో సరిపెట్టుకోగా... మెక్‌లారెన్‌కే చెందిన ఆస్కార్ పియాస్ట్రి 1 గంటల 41 నిమిషాల 34.394 సెకన్లతో మూడో స్థానంతో ముగించాడు.
ఎవరికి ఎన్ని పాయింట్లు?
ఆదివారం నాటి ఈ ప్రదర్శన ద్వారా నోరిస్ 25 డ్రైవర్ చాంపియన్‌షిప్ పాయింట్లు ఖాతాలో వేసుకోగా... వెర్‌స్టాపెన్‌కు 18 పాయిట్లు, పియాస్ట్రికి 15 పాయింట్లు దక్కాయి. 62 ల్యాప్‌ల ఈ రేసులో రెండో స్థానంలో నిలిచిన వెర్‌స్టాపెన్ కంటే నోరిస్ 20.945 సెకన్ల ముందు లక్ష్యాన్ని చేరాడు. జార్జ్ రసెల్ (మెర్సిడెస్; 1 గంట 41 నిమిషాల 53.611 సెకన్లు), చార్లెస్ లెక్‌లెర్క్ (ఫెరారీ; 1 గంట 41 నిమిషాల 55.001 సెకన్లు) వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచారు.
టాప్‌లో అతడే
ఇక బ్రిటన్ స్టార్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్; 1 గంట 42 నిమిషాల 17.819 సెకన్లు) ఆరో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 24 రేసుల ఫార్ములావన్ సీజన్‌లో సింగపూర్ గ్రాండ్‌ప్రి 18వ రేసు కాగా... మరో ఆరు రేసులు మిగిలుండగా... ప్రస్తుతం డ్రైవర్స్ చాంపియన్‌షిప్‌లో 331 పాయింట్లతో వెర్‌స్టాపెన్ ‘టాప్’లో కొనసాగుతున్నాడు.
మరోవైపు.. నోరిస్ 279 పాయింట్లతో రెండో ర్యాంక్‌లో, లెక్‌లెర్క్ 245 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. రెండో స్థానంలో ఉన్న నోరిస్ కంటే వెర్‌స్టాపెన్ 52 పాయింట్లు ఆధిక్యంలో కొనసాగుతున్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్‌ప్రి అక్టోబర్ 20న ఆస్టిన్ నగరంలో జరుగుతుంది.
A brush with the barriers, not once but twice! 💥💥
Lucky Lando 🍀#F1 #SingaporeGP pic.twitter.com/6KlhtzCQ0w— Formula 1 (@F1) September 22, 2024
Winning is a habit 🥳#F1 #SingaporeGP @McLarenF1 pic.twitter.com/w78SCNW4pl
— Formula 1 (@F1) September 22, 2024
Comments
Please login to add a commentAdd a comment