world champion
-
భవ్‌తేగ్ సింగ్ గిల్‌కు స్వర్ణం
ప్రపంచ యూనివర్సిటీ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ భవ్‌తేగ్ సింగ్ గిల్(Bhavtegh Singh Gill) పసిడి పతకంతో మెరిశాడు. మంగళవారం జరిగిన పురుషల స్కీట్ విభాగంలో 21 ఏళ్ల భవ్‌తేగ్ సింగ్ గిల్ 58 పాయింట్లు స్కోరు చేసి అగ్ర స్థానంలో నిలిచాడు. జూనియర్ స్థాయిలో నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్న భవ్‌తేగ్ సింగ్... ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో నాలుగు పతకాలు సాధించాడు.వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లోనూ భవ్‌తేగ్ సింగ్ అదిరే గురితో ఆకట్టుకోగా... పెట్రోస్ ఎంగ్లెజోడిస్ (సిప్రస్)కు రజతం, భారత షూటర్ అభయ్ సింగ్‌కు కాంస్య పతకాలు లభించాయి. అంతకుముందు క్వాలిఫయింగ్ రౌండ్లో 125 పాయింట్లకు గానూ 122 పాయింట్లు సాధించిన అభయ్ సింగ్ అగ్రస్థానంలో నిలవగా... 119 పాయింట్లు సాధించి నాలుగో స్థానంతో భవ్‌తేగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. దీంతో పాటు మంగళవారం భారత్ ఖాతాలో మరో మూడు కాంస్య పతకాలు కూడా చేరాయి.అదే విధంగా.. మహిళల 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్ విభాగంలో సిమ్రన్ప్రీత్ కౌర్ బ్రార్, మహిళల స్కీట్ విభాగంలో యశస్వి రాథోడ్, పురుషుల స్కీట్ ఈవెంట్లో అభయ్ సింగ్ షెఖాన్ కాంస్యాలు గెలుచుకున్నారు. మహిళల స్కీట్‌లో యశస్వి 38 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. గియాడా లోంఘీ (ఇటలీ), అడెలా సుపెకోవా (స్లొవకియా) వరుసగా స్వర్ణ, రజతాలు దక్కించుకున్నారు.అంతకుముందు క్వాలిఫయింగ్ ఈవెంట్లో యశస్వి 114 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి తుదిపోరుకు చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో సిమ్రన్ప్రీత్ 30 పాయింట్లు సాధించి మూడో స్థానంలో నిలిచి కాంస్యం గెలుచుకుంది. కిమ్ మినెసో (35 పాయింట్లు; కొరియా), ఫౌరె హెలోయిస్ (34 పాయింట్లు; ఫ్రాన్స్) వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఈ పోటీల్లో 23 దేశాలకు చెందిన 220 మంది షూటర్లు పాల్గొంటున్నారు. -
Dutch GP: నోరిస్‌కు ‘పోల్’
జాండ్వర్ట్ (నెదర్లాండ్స్): ఫార్ములావన్ (ఎఫ్1) ప్రపంచ చాంపియన్ మాక్స్ వెర్‌స్టాపెన్‌కు సొంతగడ్డపై ఎదురుదెబ్బ తగిలింది. గత మూడేళ్లుగా డచ్ గ్రాండ్‌ప్రిలో సంపూర్ణ ఆధిపత్యం కనబరిచి విజేతగా నిలిచిన వెర్స్టాపెన్ (రెడ్‌బుల్)కు ఈ ఏడాది క్వాలిఫయింగ్ రౌండ్లో చుక్కెదురైంది. శనివారం నిర్వహించిన అర్హత పోటీలో వెర్స్టాపెన్ను వెనక్కి నెడుతూ.. లాండో నోరిస్ (మెక్లారెన్) ‘పోల్ పొజిషన్’సాధించాడు. 2021 సీజన్‌తో ఫార్ములావన్ క్యాలెండర్లో తిరిగి వచి్చన డచ్ గ్రాండ్‌ప్రిలో గత మూడు పర్యాయాలు వెర్స్టాపెన్ పోల్ పొజిషన్ సాధించి రేసులో విజేతగా నిలిచాడు. కాగా, శనివారం క్వాలిఫయింగ్ రేసులో నోరిస్ దుమ్మురేపాడు. వెర్స్టాపెన్ కంటే రెప్పపాటు ముందు లక్ష్యాన్ని చేరి ‘పోల్ పొజిషన్’కొట్టేశాడు. పియాస్ట్రి (మెక్లారెన్), రస్సెల్ (మెర్సిడెస్), పెరేజ్ (రెడ్‌బుల్) వరుసగా మూడో, నాలుగో, ఐదో స్థానాల్లో నిలిచాడు. బ్రిటన్ స్టార్ డ్రైవర్, ఏడుసార్లు ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు జరిగిన 14 రేసుల్లో ఏడింట నెగ్గిన వెర్స్టాపెన్... డ్రైవర్స్ ప్రపంచ చాంపియన్íÙప్లో 277 పాయింట్లతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇటీవలి కాలంలో వెర్‌స్టాపెన్‌కు గట్టి పోటీనిస్తున్న బ్రిటన్ డ్రైవర్ నోరిస్ 199 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. క్వాలిఫయింగ్ ఈవెంట్లో వెర్స్టాపెన్ జోరుకు చెక్ పెట్టిన నోరిస్.. ఆదివారం ప్రధాన రేసులోనూ దీన్ని కొనసాగిస్తాడా చూడాలి. 26 ఏళ్ల వెర్‌స్టాపెన్‌కు ఇది కెరీర్లో 200వ రేసు కావడం విశేషం. ప్రాక్టీస్‌లో కారు బుగ్గిడచ్ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ముందు జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అమెరికా రేసర్ లోగాన్ సార్జియాంట్ కారు ప్రమాదానికి గురైంది. సాధన సమయంలో కారు ట్రాక్‌పై నుంచి కాస్త పక్కకు వెళ్లగానే ఒక్కసారిగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన సార్జియాంట్ తక్షణమే కారు నుంచి బయటకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయతి్నంచే లోపే కారు మొత్తం కాలి బూడిదైంది. దీంతో పాటు క్వాలిఫయింగ్ ఈవెంట్ ఆరంభానికి ముందు మరో డ్రైవర్ కారులో కూడా మంటలు చెలరేగాయి. -
ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ అథ్లెట్.. 32 ఏళ్ల టోరి బోవి హఠాన్మరణం
ఫ్లోరిడా: ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ మహిళా అథ్లెట్ టోరి బోవి (అమెరికా) హఠాన్మరణం చెందింది. ఫ్లోరిడాలోని ఆమె నివాసంలో విగతజీవిగా పడి ఉన్నట్లు గుర్తించారు. ఆమె మరణానికి గల కారణాలను ఇంకా వెల్లడి కాలేదు. కొంత కాలంగా ఆమె మానసిక ఒత్తిడితో బాధపడుతోందని సమాచారం. 32 ఏళ్ల టోరి బోవి 2016 రియో ఒలింపిక్స్‌లో 4*100 మీటర్ల రిలేలో స్వర్ణం, 100 మీటర్లలో రజతం, 200 మీటర్లలో కాంస్య పతకం సాధించింది. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 2015 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లలో కాంస్యం నెగ్గిన ఆమె... 2017లో లండన్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచింది. అంతేకాకుండా 4*100 మీటర్ల రిలే పసిడి పతకం సొంతం చేసుకున్న అమెరికా జట్టులో సభ్యురాలిగా ఉంది. లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానం డైమండ్ లీగ్ మీట్లో ఆమె నాలుగుసార్లు 100 మీటర్లలో, నాలుగుసార్లు 200 మీటర్లలో స్వర్ణ పతకాలను సాధించింది. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టోరి బోవి 100 మీటర్ల విభాగంలో సెమీఫైనల్‌కు చేరినా ఆమె సెమీఫైనల్ రేసులో పోటీపడలేదు. ఈ మెగా ఈవెంట్లోనే ఆమె లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమె మరో అంతర్జాతీయ ఈవెంట్లో పోటీపడలేదు. చదవండి: PBKS Vs MI: 4 వికెట్లే కోల్పోయి 7 బంతులు ఉండగానే ఛేదన -
విషాదం: ప్రపంచ ఛాంపియన్.. మంచు కింద సజీవ సమాధి
క్రీడలో విషాదం నెలకొంది. అమెరికాకు చెందిన స్కీయింగ్ స్టార్(Skieing Game), మాజీ వరల్డ్ ఛాంపియన్ కైల్ స్మెయిన్.. హిమపాతంలో కూరుకుపోయి సజీవ సమాది అవడం అందరిని కలచి వేసింది. ఆదివారం(జనవరి 29న) జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లోని 2,469 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ హకుబా నోరికురా వద్ద జరిగిన దుర్ఘటనలో స్మెయిన్ (31) సహా వేరే గ్రూపుకు చెందిన ఆస్ట్రియన్ స్కీయర్ కూడా మరణించినట్లు ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. కాగా మార్కెటింగ్ ఫిల్మ్ షూటింగ్ కోసం మౌంట్ హకుబా నోరికురాకు వెళ్లినట్లు మౌంటెన్గెజిట్ ఫోటోగ్రాఫర్ గ్రాంట్ గండర్సన్ తెలిపాడు. షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో హిమపాతం స్మెయిన్ సహా ఆస్ట్రియా స్కీయర్ను భూమిలోకి కూరుకుపోయేలా చేసింది. వారి కోసం గాలింపు చేపట్టినప్పటికి లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా గ్రాంట్ గండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్మెయిన్ ఫోటో షేర్ చేస్తూ.. ''ఇది నిజంగా పీడకల అయ్యుంటే బాగుండేది'' అని విచారం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by Kyle Smaine (@kylesmaine) అయితే స్మెయిన్ చనిపోవడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ''పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికి స్కీయింగ్‌పై తనకున్న అభిమానం ఎంత కష్టమున్నా లెక్కచేయనివ్వదు. కష్టంలోనే మన సక్సెస్ ఏంటో తెలుస్తుంది'' అని చెప్పుకొచ్చాడు. కాగా 1991, జూన్ 27న అమెరికాలో జన్మించిన కైల్ స్మెయిన్ చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలపై క్లైంబింగ్ చేయడం హాబీగా మార్చుకున్నాడు. అలా స్కీయర్‌గా మారిన స్మెయిన్ 2015లో ఎఫ్ఐఎస్ ఆల్పైన్ వరల్డ్ స్కై చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018 ఒలింపిక్స్‌లో స్కీయింగ్‌లో పాల్గొన్న తొలి అమెరికన్ అథ్లెట్‌గా కైల్ స్మెయిన్ నిలిచాడు. -
స్త్రీ శక్తి: బ్యాక్ ఆన్ ది బైక్ పడి లేచిన కెరటం
ఫిమేల్ మోటర్ స్పోర్ట్స్ అథ్లెట్‌గా ప్రయాణం సులువేమీ కాదు. మద్దతు ఇచ్చే వాళ్ల కంటే వద్దనే వాళ్లే ఎక్కువ... దీనికి ఐశ్వర్య మినహాయింపు కాదు. మొన్న...‘ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నావు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. నిన్న... ‘స్లోయెస్ట్ బైకర్’ అని ముఖం మీదే అన్నారు. ఇప్పుడు మాత్రం... ఐశ్వర్య గురించి ‘ఆశాకిరణం లాంటి ప్రొఫెషనల్ బైకర్’ అంటున్నారు... బెంగళూరుకు చెందిన ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచి బైక్‌లు అంటే చాలా ఇష్టం. ఇంట్లో నాన్న బైక్ ఉండేది. ప్రతి ఆదివారం ఆ బైక్‌పై తనను ఏదో ఒక కొత్త ప్రదేశానికి తీసుకెళుతుండేవాడు. ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన తరువాత ఐశ్వర్యకు బైకే లోకం అయింది. ఫ్రెండ్స్‌ను తీసుకొని రోజూ బైక్‌పై చక్కర్లు కొట్టేది. ఇలా తిరుగుతున్న రోజుల్లో ఒకసారి టీవిలో మోటోజీపి రేస్ చూసి ‘వావ్’ అనుకుంది. అలాంటి రేస్‌లో ఒకరోజు తాను భాగం అవుతానని అనుకోలేదు ఐశ్వర్య. ఇక అది మొదలు... మోటర్‌స్పోర్ట్స్, మోటర్‌స్పోర్ట్స్ అథ్లెట్ల గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. నిజంగా చెప్పాలంటే అదొక ప్రపంచం! నిన్నటివరకు బైకింగ్ అనేది తనకు సరదా మాత్రమే. క్రికెట్, ఫుట్‌బాల్‌లాగే అది కూడా ఒక ఆట అని, దానిలో నిరూపించుకుంటే అంతర్జాతీయస్థాయికి వెళ్లవచ్చు అని తెలిశాక ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ట్రైనింగ్, రేసింగ్తోనే రోజులు గడిచేవి. అయితే ఐశ్వర్య అమ్మానాన్నలకు, వారి అమ్మా, నాన్నలకు ఆమెను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్‌గా చూడాలనేది కల. అయితే వారొకటి తలిస్తే ఐశ్వర్య కల ఒకటి తలిచింది. తండ్రి ససేమిరా అన్నాడు. తల్లి మాత్రం పట్టువిడుపు ధోరణి ప్రదర్శిస్తూ మద్దతు ఇచ్చేది. 2018లో కొద్దిమందితో కలిసి జోర్డీ అనే కోచ్ దగ్గర శిక్షణ తీసుకుంది. జోర్డీ సలహా మేరకు బజా అరగాన్, స్పెయిన్‌లో పాల్గొని ఫస్ట్ ఫిమేల్ ఇండియన్‌గా చరిత్ర సృష్టించింది ఐశ్వర్య. (స్పానిష్ బజా...స్పెయిన్‌లోని అరగన్ ప్రాంతంలో జరిగే ర్యాలీ రైడ్ లేదా క్రాస్–కంట్రీ ర్యాలీ. ఆఫ్రికన్ ఎడ్వెంచరస్ ర్యాలీలను స్ఫూర్తిగా తీసుకొని 1983లో దీనిని దేశంలో మొదలుపెట్టారు) ఆరుసార్లు నేషనల్ రోడ్రేసింగ్ ర్యాలీ ఛాంపియన్‌గా నిలిచింది. 2019లో మోటర్ స్పోర్ట్స్‌లో వరల్డ్ టైటిల్ గెలుచుకుంది. తన సాధనతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. మోటర్‌స్పోర్ట్స్ లో మన దేశానికి సంబంధించి గట్టిగా వినిపిస్తున్న పేర్లలో ఐశ్వర్య పేరు ఒకటి. ‘నిజానికి మా కుటుంబంలో మోటర్‌స్పోర్ట్స్ గురించి తెలిసిన వారు లేరు. వరల్డ్ ఛాంపియన్షిప్ గురించి గైడ్ చేసేవారు కూడా లేరు. నాకు నేనే తెలుసుకుంటూ వెళ్లాను. రేస్‌లలో పాల్గొనడం ద్వారా ఎంతోమందితో మాట్లాడి, వారి నుంచి ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది’ అంటుంది ఐశ్వర్య. ‘ప్లాన్ బీ’ లేదా సెకండ్ కెరీర్ అనేవి ఉండాలి అంటారు. అయితే ఒక రంగంలోకి, ఒక లక్ష్యం కోసం దిగిన వారు ‘ప్లాన్ బీ’ గురించి ఆలోచించవద్దు అంటుంది ఐశ్వర్య. ‘ఈ రంగంలో రాణించకపోతే నెక్స్›్టఏమిటి? అని ఎప్పుడూ ఆనుకోలేదు. కచ్చితంగా సాధించాల్సిందే అనుకున్నాను’ అంటుంది ఐశ్వర్య. స్పెయిన్‌లో మహిళలు మోటర్‌స్పోర్ట్స్‌లో రాణించడానికి అనువైన వాతావరణం, మౌలిక వసతులు ఉన్నాయి. కుటుంబ మద్దతు కూడా బలంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి మన దేశంలో కూడా రావాలని కోరుకుంటుంది ఐశ్వర్య. మోటర్ స్పోర్ట్స్ అంటే పరాజయాలు, విజయాలు మాత్రమే కాదు... గట్టి గాయాలు కూడా. ఒక ప్రమాదంలో చావు అంచుల వరకు వెళ్లి వచ్చింది ఐశ్వర్య. ఇక ఆమె నడవడం కూడా కష్టమే అనుకున్నారంతా. అయితే ‘బ్యాక్ ఆన్ ది బైక్’ అంటూ మళ్లీ విజయపథంలో దూసుకుపోవడానికి ఎంతోకాలం పట్టలేదు! -
World Boxing Championship: ప్రతికూలతలను బద్దలు కొట్టి...
సాధారణ మధ్యతరగతి, సాంప్రదాయ కుటుంబం... నలుగురు కూతుళ్లలో ఒకరిగా పెరిగిన వాతావరణం...ఇలాంటి నేపథ్యంనుంచి వచ్చిన ఆ అమ్మాయి అన్ని అడ్డంకులను ఛేదించింది. భారత క్రీడల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకుంది. బాక్సింగ్‌లో పుష్కర కాలంలో ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్ ఘనత అసమానం. (సాక్షి క్రీడా విభాగం) అటాక్...అటాక్...అటాక్...ఇప్పుడు రింగ్‌లో నిఖత్ జరీన్ పఠిస్తున్న మంత్రం ఇదొక్కటే! కొన్నాళ్ల క్రితం వరకు కూడా నిఖత్ బ్యాక్‌ఫుట్ బాక్సర్. కానీ ఆమె తన ఆటను మార్చుకుంది. ఒక పంచ్ విసరడంతో పాటు వెంటనే మరో కౌంటర్ పంచ్‌తో సిద్ధమైపోయే ఫ్రంట్‌ఫుట్ ఆటతో నిఖత్ ఆట ఇప్పుడు ఆమెను ప్రపంచ చాంపియన్‌గా నిలిపింది. సరిగ్గా చెప్పాలంటే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే ప్రయత్నంలో ట్రయల్స్‌తో మేరీకోమ్‌తో తలపడి వివాదంలో భాగంగా మారిన తర్వాతినుంచి ఆమె ‘కొత్త కెరీర్’ను మొదలుపెట్టింది. సీనియర్ స్థాయిలో చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తే తప్ప జూనియర్‌గా సాధించిన విజయా లకు విలువ, గుర్తింపు లేదని గుర్తించిన నిఖత్ తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంది. కుటుంబం అండదండలతో... నిఖత్ స్వస్థలం నిజామాబాద్. ఆమె కెరీర్ ఈ స్థాయికి చేరడానికి ముఖ్య కారణం ఆమె తండ్రి జమీల్ అహ్మద్ పట్టుదల, సహకారం. నలుగురు అమ్మాయిలలో మూడోదైన నిఖత్‌ను ఆయన తన ఇష్టప్రకారం క్రీడల్లో ప్రోత్సహించాడు. అథ్లెట్‌గా మొదలు పెట్టిన నిఖత్ బాక్సర్‌గా ఎదిగింది. నిజామాబాద్‌లో ప్రముఖ బాక్సింగ్ కోచ్‌గా గుర్తింపు ఉన్న శంషముద్దీన్ ఆమెలో ప్రతిభను చూసి సత్తా చాటేందుకు సరైన వేదిక కల్పించాడు. దాంతో 13 ఏళ్ల వయసులో ఆటను మొదలు పెట్టిన నిఖత్ ఆరు నెలల వ్యవధిలోనే రాష్ట్ర స్థాయిలో విజేతగా నిలవడంతో పాటు రూరల్ నేషనల్స్‌లో కూడా పాల్గొని స్వర్ణం సాధించింది. ఆ తర్వాత మరో మూడు నెలలకే జాతీయ సబ్ జూనియర్ స్థాయిలో బెస్ట్ బాక్సర్‌గా నిలిచింది. ఆ తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ క్యాంప్‌లోకి ఎంపిక కావడంతో నిఖత్‌కు తన భవిష్యత్తు ఏమిటో స్పష్టమైంది. కీలక విజయాలు... ఇప్పుడు ప్రపంచాన్ని గెలిచిన టర్కీలోనే నిఖత్ 2011లో జూనియర్ వరల్డ్ చాంపియన్‌గా కూడా నిలిచింది. అదే ఆమె విజయాలకు పునాది. ఈ గెలుపుతో జాతీయ బాక్సింగ్‌లో నిఖత్‌పై అందరి దృష్టి పడింది. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఆర్థిక సహకారం అందించడంతో ఆమె ఆటకు ఎలాంటి ఇబ్బంది రాలేదు. ఇదే జోరులో యూత్ బాక్సింగ్‌లో రజతం, నేషన్స్ కప్, థాయిలాండ్ ఓపెన్లలో పతకాలు వచ్చాయి. ప్రతిష్టాత్మక స్ట్రాండ్జా మెమోరియల్ టోర్నీలో 2019లో స్వర్ణం గెలవడంతో భవిష్యత్ తారగా గుర్తింపు దక్కింది. అవరోధాలని దాటి... ‘నిఖత్ జరీన్ ఎవరు’... తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్ గురించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్ విజ్ఞప్తి చెల్లగా...మేరీకోమ్ చేతిలో మాత్రం ఓటమి ఎదురైంది. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. దిగ్గజ బాక్సర్తో తలపడేందుకు ప్రయత్నించిందంటూ నిఖత్‌పై ప్రతికూల విమర్శలు వచ్చాయి. అలాంటి స్థితినుంచి ఆమె మళ్లీ పట్టుదలగా పైకి లేచింది. అంతకు ముందు ఏడాది పాటు గాయం కారణంగా ఆటకు దూరమైంది. కోలుకొని మళ్లీ ఎలా ఆడగలనో అనే భయం ఉన్నా... ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని తత్వంతో దూసుకొచ్చింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజయంతో పాటు స్ట్రా్టండ్జా టోర్నీని మరోసారి గెలిచిన నిఖత్...ఇప్పుడు నేరుగా వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. మరో సవాల్... పారిస్‌లో జరిగే 2024 ఒలింపిక్స్‌లో పతకం లక్ష్యంగా నిఖత్ సిద్ధమవుతోంది. అయితే ఆమె పతకం గెలిచిన కేటగిరీ 52 కేజీలు ఒలింపిక్స్‌లో లేదు. 50 కేజీలు లేదా 54 కేజీలకు మారాల్సి ఉంటుంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆమె సాధన చేయాల్సి ఉంది. తెలంగాణ సీఎం అభినందనలు ప్రతిష్టాత్మక ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ విశ్వ విజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను మనస్ఫూర్తిగా అభినందించారు. ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని అన్నారు. మా ఆనందాన్ని వర్ణించేందుకు మాటలు రావడం లేదు. ఇన్నేళ్ల మా శ్రమ ఫలితాన్నిచ్చింది. భావోద్వేగాలను నిలువరించలేకపోతున్నాం. నిఖత్ పెద్ద విజయం సాధించాలని ఎన్నో ఏళ్లుగా కోరుకున్నాం. ఇప్పుడు మా ప్రార్థనలు ఫలించాయి. మున్ముందు మా అమ్మాయి మరిన్ని విజయాలు అందుకోవాలి’ –నిఖత్ తల్లిదండ్రులు జమీల్, పర్వీన్ -
నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు
ఆగ్రా: పాతికేళ్లు కూడా నిండక ముందే 60కి పైగా పతకాలు సాధించి, కరాటేలో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన హరిఓమ్ శుక్లా.. ప్రస్తుతం మథురలో రోడ్డు పక్కన టీ అమ్ముతున్నాడు. పదునైన పంచ్‌లతో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ప్రపంచ ఖ్యాతి గాంచిన శుక్లా.. నేడు కుటుంబ పోషణ నిమిత్తం రోడ్డెక్కాడు. దేశ, విదేశాల్లో జరిగిన అనేక పోటీల్లో పతకాలు సాధించిన ఆయన.. ఇల్లు గడవని ధీన స్థితిలో కాలం వెల్లబుచ్చుతున్నాడు. 2013లో థాయ్‌లాండ్‌లో జరిగిన జూడో కరాటే ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరఫున స్వర్ణ పతకాన్ని సాధించిన శుక్లా.. ఆరేళ్ల ప్రాయంలోనే కరాటేలో ఓనమాలు దిద్దుకున్నాడు. అతనికి 23 ఏళ్లు వచ్చేసరికి 60కి పైగా పతకాలు సాధించాడు. అయితే, ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందకపోవడంతో అతని ఆర్ధిక కష్టాలు మొదలయ్యాయి. టోర్నీల్లో గెలుచుకున్న ప్రైజ్ మనీ సైతం అడుగంటి పోయింది. ఈ క్రమంలో ఉద్యోగం కోసం ప్రభుత్వానికి ఎన్ని సార్లు మొర పెట్టినా ఫలితం లేకుండా పోయింది. రోజు రోజుకూ కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలో ఓ టీ స్టాల్‌ను నడిపిస్తున్నాడు. లాక్‌డౌన్‌కు ముందు వరకు స్కూల్ పిల్లలకు కరాటే పాఠాలు నేర్పిన శుక్లా.. ప్రస్తుతం ఛాయ్ వాలాగా జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. కరోనా కారణంగా పిల్లలెవరూ క్లాసులకు హాజరు కాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీ స్టాల్ నడుపుతున్నాని అతను వాపోతున్నాడు. ప్రస్తుతానికి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా.. ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి కూడా తన వద్ద డబ్బు లేదని.. ఆ సర్టిఫికేట్ ఉంటే ఏదైనా ఉద్యోగం చూసుకునే వాడినని అంటున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్రీడాకారుల కోటాలో తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. చదవండి: బీసీసీఐ పుణ్యమా అని అశ్విన్ బయటపడ్డాడు.. లేకపోతే..? -
102 ట్రోఫీలు... 102 వ్యక్తులకు విక్రయించి...
న్యూఢిల్లీ: వయోభేదం లేకుండా... సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా... జాతీయ, అంతర్జాతీయస్థాయి హోదా పట్టించుకోకుండా... కరోనా మహమ్మారిని ఓడించడానికి... ఈ పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమవంతుగా భారత క్రీడాకారులందరూ చేయూతనిస్తున్నారు. ఇటీవల తెలంగాణకు చెందిన 15 ఏళ్ల షూటర్ ఇషాసింగ్ తాను దాచుకున్న రూ. 30 వేలను ప్రధాన మంత్రి సహాయనిధికి అందజేయగా... గ్రేటర్ నోయిడాకు చెందిన 15 ఏళ్ల భారత జూనియర్ గోల్ఫ్ క్రీడాకారుడు అర్జున్ భాటి వినూత్న పద్ధతిలో వితరణ మొత్తాన్ని సేకరించాడు. జూనియర్‌స్థాయిలో మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన అర్జున్ భాటి క్రీడాకారుడిగా గత ఎనిమిదేళ్లలో జాతీయ, అంతర్జాతీయస్థాయిలో 150 టోర్నమెంట్లలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో తాను గెల్చుకున్న 102 ట్రోఫీలను 102 వ్యక్తులకు విక్రయించాడు. ఈ విక్రయాల ద్వారా వచ్చిన మొత్తం రూ. 4 లక్షల 30 వేలను ప్రధానమంత్రి సహాయనిధికి విరాళం ఇచ్చి ఆదర్శంగా నిలిచాడు. అంతకుముందు అర్జున్ అమ్మమ్మ తన ఏడాది పెన్షన్ మొత్తాన్ని (రూ. 2,06,148) పీఎం కేర్స్ ఫండ్‌కు విరాళంగా ఇవ్వడం విశేషం. -
వరల్డ్ ఛాంపియన్
-
ఫార్ములా వన్ దిగ్గజం కన్నుమూత
వియన్నా: ఆస్ట్రియా ఫార్ములా వన్ దిగ్గజం నికీ లాడా (70) కన్నుమూశారు. గతకొంత కాలంగా ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన సోమవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. మూడు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన నికీ.. 1975, 1977, 1984లో టైటిల్స్ సొంతం చేసుకున్నారు. అత్యుత్తమ ఎఫ్-1 రేసర్‌గా పేరు సొంతం చేసుకున్న ఆయన ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. 1976లో జరిగిన ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. తృటిలో ప్రాణాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. 1949లో ఆస్ట్రియాలో జన్మించిన నిక్కీ.. ఫార్మాల్ వన్ రేసులో అత్యుత్తమ స్థాయి వరకు ఎదిగారు. -
రజతం నెగ్గిన సాక్షి మలిక్
న్యూఢిల్లీ: డాన్ కొలోవ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ రజత పతకం సాధించింది. బల్గేరియాలో శుక్రవారం జరిగిన మహిళల 65 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి 3–8 స్కోరుతో హెనా జొహాన్సన్ (స్వీడన్) చేతిలో పరాజయం పాలైంది. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ పెట్రా ఒలి (ఫిన్లాండ్)ని ఓడించిన సాక్షి ఫైనల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది. మరోవైపు ఇదే టోర్నమెంట్ పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో బజరంగ్ 8–6తో నిర్హున్ స్కారాబిన్ (బెలారస్)పై... సందీప్ క్వార్టర్ ఫైనల్లో 2–0తో ఎడ్వర్డ్ గ్రిగోరెవ్ (రష్యా)పై... ప్రి క్వార్టర్ ఫైనల్లో 13–6తో లులియాన్ జుర్జెనోవ్ (రష్యా)పై గెలుపొందాడు. -
అంతర్జాతీయ చెస్‌కు వ్లాదిమిర్ క్రామ్నిక్ వీడ్కోలు
ప్రపంచ మాజీ చాంపియన్, రష్యా స్టార్ ప్లేయర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ అంతర్జాతీయ చెస్‌కు వీడ్కోలు పలికాడు. 43 ఏళ్ల క్రామ్నిక్ 2000లో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను ఓడించి క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు. ఆ తర్వాత రెండుసార్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను చెస్‌లోని అన్ని ప్రముఖ టోర్నమెంట్లలోనూ విజేతగా నిలిచాడు. 1996లోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న క్రామ్నిక్ ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ‘ప్రొఫెషనల్ చెస్‌కు గుడ్‌బై చెప్పాలని రెండు నెలల ముందే నిర్ణయం తీసుకున్నాను. చెస్‌కు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టేందుకే ఆటకు వీడ్కోలు పలికాను’ అని క్రామ్నిక్ తెలిపాడు. -
వరల్డ్ నంబర్‌వన్ మేరీకోమ్
భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తన ఘనమైన కెరీర్లో మరో కీర్తికిరీటం చేరింది. ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ మణిపూర్ మాణిక్యం వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎదిగింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె 48 కేజీ కేటగిరీలో నంబర్‌వన్‌గా నిలిచింది. 36 ఏళ్ల ఈ వెటరన్ బాక్సర్ గత నవంబర్‌లో ఆరోసారి ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ గెలిచింది. దీంతో మేరీ ఆ వెయిట్ కేటగిరీలో 1700 పాయింట్లతో అగ్రస్థానం అధిరోహించింది. -
మొమోటా మెరిసె...
టోక్యో: రెండేళ్ల క్రితం నిబంధనలకు విరుద్ధంగా జూదం ఆడుతూ పట్టుబడి... నిషేధం ఎదుర్కొని... గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పునరాగమనం చేసిన జపాన్ యువ కెరటం కెంటో మొమోటా జోరు మీదున్నాడు. గత నెలలో పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా అవతరించి ఈ ఘనత సాధించిన తొలి జపాన్ ప్లేయర్‌గా గుర్తింపు పొందిన 24 ఏళ్ల మొమోటా... తాజాగా స్వదేశంలోనూ సత్తా చాటుకున్నాడు. ఆదివారం ముగిసిన జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీలో టైటిల్ గెలిచాడు. ఏకపక్షంగా సాగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో మొమోటా 21–14, 21–11తో ఖోసిత్ ఫెట్‌ప్రదాబ్ (థాయ్‌లాండ్)ను ఓడించాడు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన జపాన్ ఓపెన్‌లో జపాన్ క్రీడాకారుడికి టైటిల్ లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు మహిళల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) 21–19, 17–21, 21–11తో మాజీ విశ్వవిజేత ఒకుహారా (జపాన్)పై గెలిచి టైటిల్ దక్కించుకుంది. -
అపూర్వకు ఘన సన్మానం
సాక్షి, హైదరాబాద్: క్యారమ్ ప్రపంచ చాంపియన్ అపూర్వకు బుధవారం ఘనసన్మానం జరిగింది. బర్మింగ్హమ్లో జరిగిన వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో టైటిల్ సాధించిన తమ ఉద్యోగి అపూర్వను ఎల్ఐసీ ఘనంగా సన్మానించింది. లోయర్ ట్యాంక్‌బండ్‌లో ఉన్న ఎల్ఐసీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంస్థ జోనల్ మేనేజర్ సుశీల్ కుమార్, రీజనల్ మేనేజర్ మజర్ హుస్సేన్, హైదరాబాద్ క్యారమ్ సంఘం అధ్యక్షుడు హరనాథ్‌తో పాటు పలువురు ఎల్ఐసీ సీనియర్ ఉద్యోగులు పాల్గొన్ని ఆపూర్వను అభినందించారు. ఎల్ఐసీ ఇచ్చిన ప్రోత్సాహంతోనే రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌గా ఎదిగానని ఈ సందర్భంగా అపూర్వ పేర్కొంది. వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్‌లో ఆమె మూడు స్వర్ణాలను సాధించింది. -
వరల్డ్ చాంపియన్ అపూర్వ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ ప్లేయర్ అపూర్వ మరోసారి క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన ‘వరల్డ్ క్యారమ్ చాంపియన్‌షిప్’ సింగిల్స్ ఫైనల్లో అపూర్వ 10-25, 25-10, 25-15తో భారత్‌కే చెందిన పరిమళా దేవిని ఓడించి రెండోసారి ఈ ఘనతను సొంతం చేసుకుంది. ఆమె 2004లో తొలిసారి ప్రపంచ చాంపియన్ టైటిల్‌ను దక్కించుకుంది. పురుషుల సింగిల్స్ విభాగంలోనూ భారత్ స్వర్ణం, రజత పతకాలను సాధించింది. ఫైనల్లో ప్రశాంత్ మోరే (భారత్) 25-22, 11-25, 25-12తో రియాజ్ అక్బర్ అలీ (భారత్)ను ఓడించి విజేతగా నిలిచాడు. -
ఒలింపిక్ క్రీడల్లో క్యారమ్స్ను చేర్చాలి
వరల్డ్ చాంపియన్ అపూర్వ ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయస్థాయి క్రీడా పోటీలలో క్యారమ్స్ను చేరిస్తే బాగుంటుందని వరల్డ్ చాంపియన్ అపూర్వ అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయస్థాయిలో రాణిస్తే క్యారమ్స్ క్రీడాకారులకు దేశంలో మరింత గుర్తింపు వస్తుందన్నారు. సోమవారం స్థానిక సూర్యగార్డెన్స్‌లో జరుగుతున్న ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్ కారమ్స్, చెస్ టోర్నమెంట్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆమె ‘సాక్షి’తో ముచ్చటించిన విషయాలు ఆమె మాటల్లోనే.. – ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం) ‘ఎనిమిదేళ్ల వయస్సు నుంచి హైదరాబాద్ క్యారమ్స్ అసోసియేషన్ నేతృత్వంతో నా తండ్రి సాయికుమార్ కోచ్‌గా శిక్షణ పొందాను. 2004లో శ్రీలంకలో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీల్లో, ఇంటర్నేషనల్ ఫెడరేషన్ కప్ పోటీల్లో విజేతగా నిలిచాను. సార్క్ పోటీల్లో సిల్వర్‌మెడల్‌తో పాటు ఇటీవల మాల్దీవులలో జరిగిన టోర్నమెంట్లో ఇండియా గెలవగా, ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచా. దేశంలో జరిగిన అనేక టోర్నమెంట్లలో విజ యం సాధించాను. బర్మింగ్‌హామ్‌లో నవంబరులో జరిగే వరల్డ్æచాంపియన్‌షిప్ పోటీలకు దేశం తరఫున ఎంపికైన నలుగురిలో ఉన్నాను. స్పోర్ట్స్‌కోటాలో ఎల్ఐసీలో ఉద్యోగం లభించింది. ఇప్పుడు ఏవోగా పదోన్నతి వచ్చింది. ఇంకా బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. క్యారమ్స్‌లో రాణించడానికి ఎల్ఐసీ యాజమాన్యం అన్ని విధాలా సహకరిస్తోంది. సాధన చేసేందుకు ఒక పూట మాత్రమే కార్యాలయానికి వెళ్లేలా వెసులుబాటు లభించింది. ఎల్ఐసీలో ఉద్యోగంలో చేరాకే వరల్డ్ చాంపియన్నయ్యాను. నిరంతర కఠోరసాధన, ఏకాగ్రతతో ఆడటం ద్వారా విజయం సాధించవచ్చు. ఆటగాళ్లకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుంది. -
విశ్వ విజేత హామిల్టన్
1995లో... బ్రిటన్‌లో ఆటో స్పోర్ట్స్ అవార్డు ఫంక్షన్ జరుగుతోంది. ఓ పదేళ్ల పిల్లాడు మెక్లారెన్ జట్టు యజమాని దగ్గరకు వచ్చి... ‘ఏదో ఒక రోజు నేను మెక్లారెన్ తరఫున రేసులో పాల్గొంటా’ అన్నాడు. జట్టు యజమానితో పాటు పక్కన ఉన్నవాళ్లు కూడా అవాక్కయ్యారు. ఓ చిన్న పిల్లాడిలో ఏంటీ ఆత్మవిశ్వాసం అనుకున్నారు. సరిగ్గా 12 ఏళ్ల తర్వాత, 2007లో అదే మెక్లారెన్ తరఫున అరంగేట్రం చేశాడు ఆ కుర్రాడు. ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కుర్రాడు... ఆరేళ్ల వయసు నుంచే రేసింగ్‌ను ప్రాణంలా మార్చుకుని పడ్డ కష్టానికి ప్రతిఫలం అది. ఆ రోజు నుంచి వెనుతిరిగి చూడలేదు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఫార్ములావన్ (ఎఫ్1) చరిత్రలో రికార్డులు తిరగరాస్తున్నాడు. ఆ సంచలనం పేరు లూయిస్ హామిల్టన్. ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌గా అవతరించడం ద్వారా... మూడోసారి టైటిల్ గెలిచి దిగ్గజాల సరసన స్థానం సంపాదించుకున్నాడు. * మూడోసారి ఫార్ములా వన్ ప్రపంచ చాంపియన్‌షిప్ కైవసం * యూఎస్ గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం * సీజన్లో పదో విజయం ఆస్టిన్ (అమెరికా): ఈ సీజన్ ఆరంభం నుంచి నిలకడగా రాణిస్తున్న మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్... మరో మూడు రేసులు మిగిలుండగానే ప్రపంచ విజేతగా అవతరించాడు. ఈ ఏడాది పదో విజయం సాధించి... 327 పాయింట్లతో ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలిచి డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను హస్తగతం చేసుకున్నాడు. నాటకీయ పరిణామాల మధ్య హోరాహోరీగా సాగిన యునెటైడ్ స్టేట్స్ (యూఎస్) గ్రాండ్‌ప్రిలో ఈ బ్రిటిష్ రేసర్ విజేతగా నిలిచాడు. సీజన్లో ఇప్పటివరకూ జరిగిన 16 రేసుల్లో తనకు ఇది పదో టైటిల్. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ 56 ల్యాప్‌ల రేసును హామిల్టన్ గంటా 50 నిమిషాల 52.703 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. రెండో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌కు ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన నికో రోస్‌బర్గ్ (మెర్సిడెస్) నుంచి గట్టిపోటీ ఎదురైంది. అయితే 49వ ల్యాప్‌లో హామిల్టన్ దూకుడుగా వ్యవహరించి రోస్బర్గ్ను ఓవర్టేక్ చేసి ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత చివరి వరకూ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచాడు. రోస్బర్గ్కు రెండో స్థానం దక్కగా... ప్రపంచ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. * భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టుకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సెర్గియో పెరె జ్ ఐదోస్థానంలో నిలువగా... మరో డ్రైవర్ నికో హుల్కెన్‌బర్గ్ 35 ల్యాప్‌ల తర్వాత రేసు నుంచి తప్పుకున్నాడు. ప్రతికూల వాతావరణంలో జరిగిన ఈ రేసులో వివిధ కారణాలతో 8 మంది డ్రైవర్లు మధ్యలోనే వైదొలగడం గమనార్హం. ఈ సీజన్లో తదుపరి రేసు మెక్సికో గ్రాండ్‌ప్రి నవంబరు 1న జరుగుతుంది. * ప్రస్తుతం హామిల్టన్ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పట్టికలో 327 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెటెల్ (251 పాయింట్లు) రెండో స్థానంలో, రోస్‌బర్గ్ (247 పాయింట్లు) మూడో స్థానంలో ఉన్నారు. తన సమీప ప్రత్యర్థుల కంటే ఎక్కువ పాయింట్లు ఉండటంతో... తదుపరి మూడు రేసుల ఫలితాలతో సంబంధం లేకుండా హామిల్టన్‌కు ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయమైంది. ఘనతలు * అరంగేట్రం చేసిన ఏడాదే నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన ఒకే ఒక్క రేసర్ హామిల్టన్. కెరీర్ ఆరంభం నుంచి ప్రతి ఏటా హామిల్టన్ కనీసం ఒక్క రేసులో అయినా నెగ్గాడు. ప్రస్తుతం ఉన్న రేసర్లలో ఎవరికీ ఈ రికార్డు లేదు. * మైకేల్ షుమాకర్ (91 టైటిల్స్), అలైన్ ప్రోస్ట్ (51 టైటిల్స్) తర్వాత 43 గ్రాండ్‌ప్రి టైటిల్స్‌తో ఎఫ్1 చరిత్రలో అత్యధిక టైటిల్స్ నెగ్గిన మూడో డ్రైవర్ హామిల్టన్. * మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో డ్రైవర్‌గా ఘనత. గతంలో మైకేల్ షుమాకర్ (7 సార్లు), ఫాంగియో (5 సార్లు), ప్రోస్ట్, సెబాస్టియన్ వెటెల్ (4 సార్లు) ఈ ఘనత సాధించారు. * తొమ్మిదేళ్ల వ్యవధిలో హామిల్టన్ మూడుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువగా... షుమాకర్ రెండుసార్లు మాత్రమే ఈ ఘనత సాధించాడు. * కెరీర్లో అత్యధికసార్లు ‘పోల్ పొజిషన్’ సాధించిన డ్రైవర్ల జాబితాలో హామిల్టన్ (49) మూడో స్థానంలో ఉన్నాడు. తొలి రెండు స్థానాల్లో షుమాకర్ (68), అయర్టన్ సెనా (65) ఉన్నారు. లూయిస్ హామిల్టన్‌కు ఆరేళ్ల వయసులో వాళ్ల నాన్న ఓ రిమోట్ కారు కొనిచ్చాడు. పిల్లాడు ఆడుకోవడానికే కారు అనుకున్నాడాయన. కానీ ఆ క్షణం ఆయనకూ తెలియదు తాను ఓ ప్రపంచ చాంపియన్‌కు బీజం వేశానని.. ఆ బొమ్మకారు మీద ఆసక్తితో హామిల్టన్ ప్రపంచం గర్వించదగ్గ రేసర్‌గా ఎదుగుతాడని.. 1985 జనవరి 7న ఇంగ్లండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో స్టీవెనేజ్ అనే ప్రదేశంలో హామిల్టన్ జన్మించాడు. తల్లి కార్మెన్ బ్రిటిష్ జాతీయురాలు. తండ్రి ఆంథోని కూడా బ్రిటిష్ జాతీయుడే అయినా... ఎప్పుడో వలస వచ్చిన నల్లజాతి వ్యక్తి. హామిల్టన్‌కు రెండేళ్ల వయసులో తల్లిదండ్రులిద్దరూ విడిపోయారు. తనకు 12 ఏళ్ల వయసు వచ్చే వరకూ తల్లి దగ్గర పెరిగాడు. ఆ తర్వాత తండ్రి దగ్గరకు వెళ్లిపోయాడు. ఆరేళ్ల వయసులో తండ్రి కొనిచ్చిన రిమోట్ కారుతో రేసింగ్ మీద మక్కువ పెంచుకున్న హామిల్టన్... తర్వాత రెండేళ్లకు కార్టింగ్ మొదలుపెట్టాడు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 1993లో ఎనిమిదేళ్ల వయసులో కార్టింగ్‌ను సీరియస్‌గా ప్రారంభించిన హామిల్టన్ స్వల్ప వ్యవధిలోనే క్యాడెట్ విభాగంలో చాంపియన్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఫార్ములా ‘ఎ’... ఫార్ములా సూపర్ ‘ఎ’... ఇంటర్ కాంటినెంటర్ ‘ఎ’ లాంటి కారు రేసుల్లో తనని తాను నిరూపించున్నాడు. 2001లో హామిల్టన్ రేసింగ్ ప్రస్థానం మొదలైంది. బ్రిటిష్ వింటర్ సీజన్ ఫార్ములాలో పాల్గొన్నాడు. ఆ తర్వాత క్రమంగా ఫార్ములా-3 రేసుల్లోకి వెళ్లాడు. ఏ స్థాయిలో ఏ రేసులో పాల్గొన్నా అతి తక్కువ సమయంలోనే రేసు గెలిచి సంచలనం సృష్టించేవాడు. ఫార్ములా-3 విజయంతో జీపీ-2లోకి ప్రవేశించాడు. తొలి ఏడాదే అక్కడా చాంపియన్‌గా అవతరించాడు. మెక్‌లారెన్‌తో అరంగేట్రం 2007లో 22 ఏళ్ల వయసులో హామిల్టన్ కల సాకారమైంది. మెక్లారెన్ జట్టులో రెండో రేసర్‌గా అవకాశం వచ్చింది. తన తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో మూడో స్థానంలో నిలిచిన హామిల్టన్... అరంగేట్రంలోనే పోడియం మీదకు వచ్చిన 13వ డ్రైవర్‌గా ఫార్ములావన్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. అదే ఏడాది కెనడా గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలవడం ద్వారా తొలిసారి ఎఫ్1 రేసు నెగ్గాడు. ఆ తర్వాతి వారమే యూఎస్ గ్రాండ్‌ప్రిలోనూ టైటిల్ సాధించాడు. అదే ఏడాది ఓవరాల్‌గా సీజన్లో రెండో స్థానంలో నిలిచి కొత్త చరిత్ర సృష్టించాడు. 2008లో అదే జోరును కొనసాగిస్తూ ప్రపంచ చాంపియన్‌గా అవతరించాడు. 2009 నుంచి 2013 వరకు టాప్-3లో నిలువలేకపోయాడు. అయితే ప్రతి రేసులోనూ తన ఉనికిని మాత్రం చాటుకునే వాడు. మెక్‌లారెన్‌తో తన ప్రస్థానం 2012తో ముగిసింది. 2013 నుంచి మెర్సిడెస్ జట్టు తరఫున బరిలోకి దిగుతున్నాడు. 2014లో మరోసారి తన సత్తా చాటుతూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన హామిల్టన్... ఈ ఏడాది అదే టైటిల్ నిలబెట్టుకున్నాడు. సీజన్లో మరో మూడు రేసులు మిగిలుండగానే చాంపియన్‌గా అవతరించడం తన సాధికారతకు నిదర్శనం. తొలి ‘నలువు’ రేసర్ నిజానికి హామిల్టన్ బ్రిటిష్ జాతీయుడే అయినా ‘నల్ల’రేసర్ అనే ముద్ర పడింది. తండ్రిలాగే నలుపు రంగులో ఉండే హామిల్టన్‌ను ఫార్ములావన్ చరిత్రలో తొలి నల్ల జాతీయుడిగా పరిగణించారు. 2007లో తొలిసారి హామిల్టన్ వివాదంలోకి వెళ్లాడు. ఫార్ములావన్‌లో అరంగేట్రం చేసిన ఏడాదే తన నివాసాన్ని స్విట్జర్లాండ్‌కు మార్చుకుంటున్నట్లు ప్రకటించాడు. మీడియా బాధలు తట్టుకోలేకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని చెప్పాడు. అయితే కేవలం పన్నులు ఎగ్గొట్టడానికి ఇలాంటి నిర్ణయమంటూ బ్రిటన్ ఎంపీలు విమర్శించారు. 2007లోనే తొలిసారి నికోల్ ష్రెజింగర్ అనే సింగర్‌తో ప్రేమలో పడ్డ హామిల్టన్... ఇప్పటివరకూ ఆమెతో నాలుగుసార్లు తెగదెంపులు చేసుకున్నాడు. ఓ ఏడాది విడిపోవడం, తిరిగి మరో ఏడాది కలిసి ఉండటంలా వీళ్ల ప్రణయ ప్రయాణం సాగింది. చివరిసారిగా ఫిబ్రవరి 2015లో వీళ్లిద్దరూ విడిపోయారు. 2012లో స్విట్జర్లాండ్ నుంచి మొనాకోకు నివాసం మార్చుకున్న హామిల్టన్... ఏ దేశంలో నివసిస్తున్నా ఫార్ములావన్‌లో మాత్రం బ్రిటిష్ డ్రైవర్‌గానే కొనసాగుతున్నాడు. -సాక్షి క్రీడావిభాగం తండ్రి కష్టానికి ఫలితం హామిల్టన్‌ను రేసర్‌గా మలచడానికి అతని తండ్రి ఆంథోని ఎన్నో త్యాగాలు చేశారు. చాలా కష్టపడ్డారు. ఐటీ మేనేజర్‌గా తనకు వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో బయటకు వచ్చి కాంట్రాక్టు ఉద్యోగాలు చేశారు. ఒక దశలో రోజూ మూడు రకాల ఉద్యోగాలకూ వెళ్లేవారు. కొంతకాలానికి సొంత కంప్యూటర్ పరికరాల కంపెనీ పెట్టుకున్నారు. హామిల్టన్ రేసర్‌గా ఎదిగిన తర్వాత తన కుమారుడి వ్యవహారాలు చూసే మేనేజర్‌గా మారారు. ఫార్ములావన్ రేసర్ కావాలనే తన కుమారుడి కలను సాకారం చేయడానికి ఆ తండ్రి పడ్డ కష్టానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ‘‘నా జీవితంలో ఇవి అత్యంత మధుర క్షణాలు. నా విజయం కోసం పాటుపడిన జట్టు సిబ్బందికి, నన్ను ఎల్లవేళలా ప్రోత్సహించిన కుటుంబసభ్యులకు ఈ విజయాన్ని అంకితమిస్తున్నాను.’’ - హామిల్టన్ -
‘అంధుల క్రికెట్‌కు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలి’
సాక్షి, న్యూఢిల్లీ: అంధుల క్రికెట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు ఇచ్చి... నిధులు కేటాయిస్తే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తామని... ఇటీవల ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ఆంధ్రప్రదేశ్ సభ్యుడు అజయ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో అంధుల క్రికెట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని అతను కోరాడు. సహచర సీనియర్ క్రీడాకారుడు వెంకటేశ్‌తో కలిసి ప్రతిభ ఉండి బయటకు రాలేకపోతున్న క్రీడాకారులను అన్వేషించి శిక్షణ ఇస్తామన్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టులో తనతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు... తెలంగాణ నుంచి ఒక క్రీడాకారుడు ఉన్నాడని తెలిపాడు. భారత జట్టులోని తెలంగాణ క్రికెటర్ మధు మాట్లాడుతూ... అంధుల క్రికెట్ భారత జట్టుకు ఎంపిక కావడం, ప్రపంచ కప్‌ను సాధించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అంధులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరాడు. -
పంకజ్ అద్వానీ శుభారంభం
టైమ్ ఫార్మాట్ వరల్డ్ చాంపియన్‌షిప్ లీడ్స్: పాయింట్ ఫార్మాట్ బిలియర్డ్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మరుసటి రోజే భారత ఆటగాడు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్ టోర్నీలోనూ శుభారంభం చేశాడు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో అద్వానీ తన తొలి లీగ్ మ్యాచ్‌లో 701-510 తేడాతో భారత్‌కే చెందిన అరుణ్ అగర్వాల్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 128 పాయింట్ల బెస్ట్ బ్రేక్ నమోదు చేసిన అద్వానీ, ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాడు. భారత్‌కే చెందిన ధ్వజ్ హరియా, అలోక్, ధ్రువ్ సిత్వాలా, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్య కూడా తమ తొలి లీగ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించారు. -
జీవితంతో బాక్సింగ్
విజయం: మహిళలకు బాక్సింగ్ అంటేనే నవ్విపోయే పరిస్థితుల్లో.. కనీసం చేతులకు గ్లవ్స్ కూడా కొనుక్కోలేని పేదరికం నుంచి వచ్చిన ఓ అమ్మాయి వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అమ్మా నాన్నలకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో బాక్సింగ్‌ను ఎంచుకున్నా.. కఠోర శ్రమ, పట్టుదలతో అటు ప్రత్యర్థులతోపాటు ఇటు జీవితంతోనూ తలపడి గెలిచింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా బాక్సింగ్ రింగ్‌లో విజయాల పంచ్‌లు కురిపించి మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ కామ్. దేశం గర్వించదగ్గ ఈ క్రీడారత్నం జీవితకథ త్వరలో సినిమా రూపంలో మన ముందుకు రానుంది. మణిపూర్ రాష్ట్రంలోని చురాచంద్పూర్ జిల్లాలో కంగ్తయ్ అనే మారుమూల గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో 1983 మార్చి 1వ తేదీన జన్మించింది మేరీ కామ్. తండ్రి మాంగ్తే తోన్పాకామ్, తల్లి మాంగ్తే అఖమ్ కామ్లు అడవుల్లో చెట్లను నరికి, కాల్చివేసి వ్యవసాయ భూమిని తయారు చేసే పని (ఝమ్ కల్టివేషన్)లో దినసరి కూలీలు. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి తానూ పనికి వెళ్లిన మేరీ.. తమ కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయేది. దీంతో ఎలాగైనా వారికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో క్రీడల్లో అడుగుపెట్టింది. ఆరంభంలో అథ్లెటిక్స్‌పై ఆసక్తి కనబరిచినా.. తమ రాష్ట్రానికే చెందిన డింకోసింగ్.. 1998లో ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించడం చూసి మేరీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎవరి మద్దతూ లేకపోయినా.. బాక్సింగ్ క్రీడ మగవాళ్లకు మాత్రమేనన్న అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితుల్లో.. ఏ ఒక్కరూ మద్దతుగా నిలవకపోయినా బాక్సర్‌ను కావాలన్న లక్ష్యాన్ని వీడలేదు మేరీ కామ్. బాక్సింగ్ రింగ్‌లో పంచ్‌లు కురిపించే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు సర్దిచెబుతూ.. శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించిన కోచ్‌ను ఒప్పిస్తూ తొలి అడుగులు వేసింది. కోచ్ ఇంబోచా సింగ్ వద్ద అంతా అబ్బాయిలే శిక్షణ తీసుకుంటున్నా.. వెరవకుండా వారితో కలిసే మెళకువలు నేర్చుకుంది. మణిపూర్ రాష్ట్ర కోచ్ ఎం.నర్జిత్సింగ్ వద్ద శిక్షణతో రాటుదేలి 2000 సంవత్సరంలో.. పాల్గొన్న తొలిసారే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో గర్వంతో పొంగిపోయిన తండ్రి.. భుజం తట్టగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగింది మేరీ. ‘చెన్నై’తో మొదలు... 2001 ఫిబ్రవరిలో చెన్నైలో జరిగిన జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కామ్.. తన జైత్రయాత్రను ఏడాదంతా కొనసాగించింది. 18 ఏళ్ల వయసులోనే అమెరికాలోని పెన్సిల్వేనియాలో మహిళలకు తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పాల్గొని రజతం గెలిచింది. 2002లో టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఆ తరువాత 2005, 2006, 2008, 2010లలో జరిగిన ప్రపంచకప్‌లలో వరుసగా విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2006 ప్రపంచకప్ తరువాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన మేరీ.. మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతూనే చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచింది. దృఢచిత్తం ఉండాలి... బాక్సర్‌గా సక్సెస్ కావాలంటే శారీరకంగా బలంగా ఉండటమొక్కటే సరిపోదు. గెలిచి తీరాలన్న పట్టుదల, వెనకడుగు వేయరాదన్న ధృడచిత్తం అవసరం. మహిళలు బాక్సింగ్‌లో రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా శ్రమించాల్సివుంటుంది.కెరీర్లో ఎక్కువసార్లు నాకన్నా ఎత్తుగా, బలంగా ఉన్న ప్రత్యర్థుల్నే ఎదుర్కొన్నాను. కానీ, నా తక్కువ ఎత్తునే అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థికి అందకుండా తప్పించుకుంటాను. రింగ్‌లో వారిని ఎక్కువగా పరిగెట్టిస్తూ.. అలసటకు గురిచేస్తాను. ఆ తరువాత నా పంచ్‌ల రుచి చూపించి పడగొడతుంటాను. -మేరీ కామ్ ప్రతికూలతల్ని దాటి... ప్రతి క్రీడాకారుడికీ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమన్నది ఓ స్వప్నం. ఐదుసార్లు విజేతగా నిలిచినా.. విశ్వ క్రీడల్లో పాల్గొనలేకపోయానన్న బాధ మేరీ కామ్‌ను వేధిస్తుండేది. అయితే 2012లో లండన్ ఒలింపిక్స్‌లో దాన్ని చేర్చడంతో మేరీకి ఆ అవకాశం రానే వచ్చింది. కానీ, కనీసం 51 కేజీల నుంచి మూడు కేటగిరీలకు మాత్రమే చోటు కల్పించారు. దీనికి తగ్గట్టుగానే ఏఐబీఏ కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మహిళలకు ఈ మూడు కేటగిరీల్లోనే పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకునేందుకు మేరీ అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటిదాకా 45, 46 కేజీల కేటగిరీల్లో పోటీపడుతూ వచ్చిన మేరీ కామ్.. 51 కేజీలకు మారాల్సి వచ్చింది. దీంతో మహిళల ప్రపంచకప్‌లో తొలిసారిగా 2012లో మేరీ.. సెమీఫైనల్లో బ్రిటన్‌కు చెందిన నికోలా ఆడమ్స్ చేతిలో ఓటమిపాలైంది. కానీ, ఒలింపిక్స్ బెర్తును మాత్రం దక్కించుకోగలిగింది. ఫలించిన కల... బాక్సింగ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి మేరీ కామ్ కన్న కల నిజమయ్యే రోజు వచ్చింది. ఉద్విగ్నభరిత క్షణాల మధ్య లండన్ ఒలింపిక్స్‌లో తొలిరౌండ్ కోసం రింగ్‌లో అడుగు పెట్టిన మేరీ.. బెబ్బులిలా విజృంభించింది. కరోలినా మిచల్చుక్ (పోలండ్)ను అలవోకగా ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో మరోవా రహాలి (టునిషియా)నూ మట్టికరిపించింది. అయితే సెమీ ఫైనల్లో మళ్లీ నికోలా ఆడమ్స్ (బ్రిటన్) ఎదురైంది. ఆమెతో తీవ్రంగా పోరాడిన మేరీ..చివరకు 6-11తో ఓటమిపాలైంది. కానీ, మూడోస్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకాన్ని దక్కించుకుని సగర్వంగా నిలిచింది. లండన్‌లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి.. భారత మహిళలందరికీ స్ఫూర్తిప్రదాత అయింది. పద్మభూషణ్ ‘మేరీ’... ఒలింపిక్ పతకం సాధించి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన మేరీ కామ్‌ను భారత ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతకుముందు 2010లోనే పద్మశ్రీ అవార్డునందించింది. దీంతోపాటు 2009లో రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, 2003లో అర్జున అవార్డుల్ని మేరీ కామ్ అందుకుంది. వెండితెరపై ‘మేరీ కామ్’ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన మేరీ కామ్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. మేరీ కామ్ పాత్రను పోషిస్తుండగా ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లామర్ క్వీన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక ఈ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని మేరీ కామ్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది. చిత్రం ప్రివ్యూను ఇప్పటికే వీక్షించిన మేరీ కామ్.. ప్రియాంక నటనను చూసి చలించిపోయింది. భాగ్ మిల్కా భాగ్ వంటి సూపర్‌హిట్ తరువాత వస్తున్న క్రీడా నేపథ్య చిత్రంగా ‘మేరీ కామ్’ కోసం అటు సినీ, ఇటు క్రీడాభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. అతనే లేకపోతే... తాను సాధించిన విజయాల వెనుక తన తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో.. భర్త ఓన్లర్ కామ్ ప్రోత్సాహమూ అంతే ఉందంటుంది మేరీ కామ్. 2001లో పంజాబ్‌లో జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో మేరీకి పరచయమయ్యాడు ఓన్లర్. ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ కోర్సు చదువుతున్న ఓన్లర్‌తో నాలుగేళ్ల ప్రేమ తరువాత 2005లో వివాహం జరిగింది. అతడు తనను చక్కగా అర్థం చేసుకొని ప్రోత్సహించాడని, తాను బాక్సింగ్ టోర్నీలతో బిజీగా గడుపుతుంటే ఇద్దరు పిల్లల్ని అన్నీ తానై చూసుకున్నాడని చెబుతుంది. అతనే లేకపోతే.. బాక్సర్‌గా తాను ఈ స్థాయికి చేరడం కష్టమయ్యేదేమో అంటుంది. అన్నట్టు.. మేరీకి ఇటీవలే మూడో బాబు పుట్టాడు! - శ్యామ్ కంచర్ల -
పెద్దలు చెప్పారనే మాట్లాడుకున్నాం!
‘మీ ఇష్టం... ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్లనే చేసుకుంటాను’... ఓ అమ్మాయి ఈ మాట చెబితే తల్లిదండ్రులు ఎలా ఫీలవుతారు..? కోనేరు హంపి తండ్రి అశోక్ కూడా ఇలాంటి ఆనందమే పొందారు. చదరంగంలో ఎత్తులన్నింటినీ ఔపోసన బట్టిన క్రీడాకారిణి... తన జీవితంలోని అతి ముఖ్యమైన ‘ఎత్తును మాత్రం తండ్రికే వదిలేసింది. ‘నా మంచి చెడ్డలు నాకంటే నా తల్లిదండ్రులకే ఎక్కువ తెలుసు’ అనేది హంపి ఆలోచన. అందుకే తల్లిదండ్రులు చెప్పిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటోంది. ఈ నెల 13 రాత్రి దాసరి అన్వేష్‌తో హంపి పెళ్లి. ఈ సందర్భంగా కాబోయే భార్యాభర్తలు తమ పెళ్లి గురించి, కెరీర్ గురించి చెప్పిన విశేషాలు... ప్రత్యేకంగా ‘సాక్షి’ పాఠకుల కోసం... ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్... ఇలా ప్రపంచం చాటింగ్‌తో దూసుకుపోతోంది. అమ్మాయి ప్రపంచాన్ని చుట్టొచ్చిన సెలబ్రిటీ... అబ్బాయి అమెరికాలో చదువుకుని వ్యాపారం చేస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటే... అర్ధరాత్రి దాకా ముచ్చట్లు ఉంటాయి. కానీ కోనేరు హంపి, అన్వేష్ మాత్రం నిశ్చితార్థం ముందు వరకు మాట్లాడుకోలేదు. ఎంగేజ్మెంట్ తేదీ ఖరారయింది. అప్పటికీ ఇద్దరూ మాట్లాడుకోలేదు. సిగ్గుపడుతున్నారు. తల్లిదండ్రులే మాట్లాడుకోమని చెప్పారు. అప్పుడే తొలిసారి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ప్రస్తుతం ఉన్న జనరేషన్‌కు ఇది కాస్త ‘పాత’గా అనిపించినా... హంపి, అన్వేష్ ఇద్దరూ పెద్దలకు ఎంత గౌరవం ఇచ్చారనడానికి ఉదాహరణ. ఈ కాబోయే దంపతులు పెళ్లి గురించి చెప్పిన విశేషాలు. అంతకుముందు చూడలేదు ‘మధ్యవర్తుల ద్వారా ఓ సంబంధం వచ్చిందని నాన్నగారు చెప్పి ఫొటో చూపించారు. తెలిసిన కుటుంబం. సెలైంట్‌గా ఉండే కుటుంబం. మంచి సంబంధం అని చెప్పారు. అంతా మీ ఇష్టమే అని చెప్పాను. అంతకుముందే ఏవో ఫంక్షన్స్‌లో ఎదురుపడినట్లున్నాం. కానీ ప్రత్యేకంగా తనని ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. నిశ్చితార్థానికి తేదీ ఖరారు అయ్యే వరకు కూడా తనతో మాట్లాడలేదు. అన్వేష్ కూడా ఫోన్ చేయలేదు. ఒకసారి మాట్లాడుకోండి అని మా నాన్న చెప్పారు. అన్వేష్‌తో కూడా వాళ్ల పెద్దవాళ్లు చెప్పినట్లున్నారు. తనతో మాట్లాడాక మరింత సంతోషం వేసింది. నా లక్ష్యాలేమిటో చెప్పాను. చెస్‌లో నేను సాధించాలనుకుంటున్న విషయాలన్నీ తనతో పంచుకున్నాను. నా కెరీర్‌కు కావలసిన పూర్తి ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చాడు. ఇన్నాళ్లూ నాన్న నన్ను నడిపించారు. నాలుగేళ్ల వయసులో చెస్ బోర్డు పట్టుకున్నప్పటి నుంచి ఆయనే నా కె రీర్‌ను తీర్చిదిద్దారు. నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. ఇకపై అన్వేష్ నా గురించి, నా కెరీర్ గురించి పూర్తిగా కేర్ తీసుకుంటాడు. వివిధ టోర్నీల కోసం ఎక్కువగా రకరకాల దేశాలు తిరుగుతూ ఉండాలి. నా కెరీర్‌ను తను పూర్తిగా అర్థం చేసుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది. ప్రపంచ చాంపియన్‌గా నిలవాలన్న కోరిక ఇప్పటివరకు తీరలేదు. పెళ్లయ్యాక ఆ కలను నెరవేర్చుకుంటానేమో.’ - హంపి సెలబ్రిటీని చేసుకుంటానని అనుకోలేదు ‘విద్య జీవనంలో భాగం. పని చేసుకుంటూ చదువుకోవాలి... అనే కాన్సెప్ట్‌తో పెరిగాను. నాన్నగారు ఎఫ్ట్రానిక్స్ అనే కంపెనీ నడుపుతున్నారు. అమెరికాలో బీఈ చేశాను. నిజానికి అక్కడే స్థిరపడటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కానీ నాకు మాత్రం ఇక్కడ ఉండటమే ఇష్టం. అందుకే నాన్నతో చెప్పి చదువు అయిపోగానే వచ్చేశాను. మా కంపెనీలోనే ఆర్ అండ్ డీ విభాగంలో బాధ్యతలు తీసుకున్నాను. కోనేరు హంపి సంబంధం గురించి పెద్దవాళ్లు చెప్పినప్పుడు ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఓ సెలబ్రిటీని చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. తన కెరీర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటాను. పెళ్లి కుదిరి నిశ్చితార్థం తేదీ ఖరారయినా.. మాట్లాడాలంటే కాస్త సిగ్గు అనిపించింది. అసలు మాట్లాడుకోకుండా ఏమిటి? అంటూ ఇంట్లోవాళ్లు అన్న తర్వాతే మాట్లాడాను. హంపికి తన కెరీర్ గురించి, భవిష్యత్ గురించి చాలా క్లారిటీ ఉంది. ఇంత మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది.’ - అన్వేష్ -
అసలు జర్మనీ ఎలా గెలిచింది?
జర్మనీ ఇప్పుడు ప్రపంచ ఫుట్ బాల్ సామ్రాట్టు. జర్మనీలో సంబరాలు ఇంకా సద్దుమణగలేదు. దేశం దేశమంతా పండగ చేసుకుంటోంది. అయితే 2000 నాటికి జర్మన్ ఫుట్ బాల్ పతనం అంచులకు చేరింది. యూరో లీగ్ ఫుట్ బాల్ పోటీల్లో పాయింట్ల జాబితాల్లో అట్టడుగులో ఉంది. ఫుట్ బాల్ అధోగతికి చేరింది. అందరూ జర్మనీ కథ ఖతం అనుకున్నారు. పతనం అంచులనుంచి అదే జర్మనీ ఇప్పుడు ప్రపంచ విజయం దాకా వచ్చింది. ఇదేలా సాధ్యమైంది? 2000 లోనే జర్మన్ ప్రభుత్వం ఫుట్ బాల్ ప్రతిభను గుర్తించి జర్మన్ టీమ్ కి మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు పూనుకుంది. ప్రణాళికా బద్ధంగా అడుగులు వేసింది. ఈ ప్రణాళిక 2003 లో అమలైంది. * ఎనిమిది నుంచి 14 ఏళ్ల వయసులోనే ఫుట్ బాల్ ప్రతిభలను గుర్తించింది. వారికి ప్రత్యేక శిక్షణను ఇప్పించింది. వీరందరికీ శిక్షణనిచ్చేందుకు దేశవ్యాప్తంగా అకాడెమీలను స్థాపించింది. ఇలా ఎంపికైన పిల్లల్లో ప్రతిభను అనుసరించి వారికి ఇచ్చే శిక్షణ కార్యక్రమాన్ని నిర్ధారించింది. * జర్మన్ టీమ్ లోని ఆటగాళ్లలో వయసు మళ్లిన వారి స్థానంలో యువకులను రంగంలోకి దింపింది. కొన్నేళ్లలోనే జర్మన్ టీమ్ ఆటగాళ్లందరూ కోడెవయసు కుర్రాళ్లే ఉండేలా చేశారు. జూలియన్ డ్రాక్స్ లర్, ఆంద్రే ష్కుర్లె, స్వెన్ బెండర్, థామస్ ముల్లర్,టోనీ క్రూస్, మార్కో రియస్ వంటి ఆటగాళ్లందరూ ఈ ప్రణాళిక ద్వారా ఎదిగిన వారే. * ఈ యువ క్రీడాకారుల తయారీ కోసం దేశ వ్యాప్తంగా ఉన్న ఫుట్ బాల్ కోచ్ లను సమర్థవంతంగా ఉపయోగించుకుంది. జర్మనీలో బి లైసెన్స్ ఉన్న కోచ్ లు 28000 మంది, ఏ లైసెన్స్ ఉన్న వారు 5500 మంది ఉన్నారు. వీరందరినీ ఉపయోగించుకుని ఆటగాళ్లకు సానపట్టారు. * ఫిఫా కప్ ను గెలిచేందుకు అన్ని ప్రత్యర్థి టీమ్ ల ఆటను నిశితంగా పరిశీలించారు. బ్రెజిల్ వాతావరణ పరిస్థితులను అధ్యయనం చేశారు. బ్రెజిల్ లో ఉండే వేడి, చెమటను తట్టుకునేందుకు ఆటగాళ్లు గత ఆరునెలలుగా హాట్ రూమ్ లలో ఆటలు ఆడేవారు. ఏసీ రూమ్ లలోఉండటం మానేశారు. బ్రెజిల్ వాతావరణాన్ని తట్టుకునేందుకు పూర్తిగా అలవాటు పడేలా చేశారు. ఇంత నిశితమైన అధ్యయనం, నిరంతర ప్రయత్నం వల్లే పదేళ్ల కింద పతనం అంచున ఉన్న జర్మనీ ఈ రోజు ప్రపంచ విజేత అయింది. -
ఒత్తిడి పెంచకూడదు
పుల్లెల గోపీచంద్ ఆటలంటే ఇష్టంలేని పిల్లలు ఎవరూ ఉండరు. ఎవరైనా తొలుత సరదా కోసమే ఆడతారు. అంతే గానీ ప్రపంచ చాంపియన్ కావాలనే కోరికతో అడుగుపెట్టరు. ఇలాంటి వారి నుంచి చాంపియన్లు వస్తారు. అయితే పిల్లాడి ఇష్టాయిష్టాలతో పాటు తల్లిదండ్రులు, కోచ్ కీలకం. పిల్లలందరి మనస్తత్వం ఒకేలా ఉండదు. సాధారణంగా చాలామంది గెలవాలని పిల్లలపై ఒత్తిడి తెస్తారు. అతడు పడుతున్న కష్టాన్ని విస్మరిస్తారు. ఇది చాలా తప్పు. కష్టపడమని వెంటపడొచ్చుగానీ... నైరాశ్యంలో వెళ్లే స్థాయిలో ఒత్తిడి పెంచకూడదు. ఓడిపోయినా కష్టపడ్డప్పుడు అభినందించాలి. సమతుల్యత పాటిస్తేనే ఈతరం పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. కోచ్‌గా చాలాకాలంగా అనేక విషయాలు పరిశీలించాను. సాధారణంగా కుర్రాళ్లలో కొంత మంది ఒక్క మాటలో చెబితే వినేస్తారు. మరొకరికి గట్టిగా మందలించాల్సి ఉంటుంది. ఇంకొందరికి సుదీర్ఘ ప్రసంగం ఇస్తే గానీ అర్థం కాదు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుంటూ మందు వేయాల్సి ఉంటుంది. లేదంటే చక్కటి ప్రతిభ వృథా అయ్యే ప్రమాదం ఉంది. అండర్-14 లేదా అండర్-16 కేటగిరీలలో మంచి విజయాలు సాధిస్తున్న ఆటగాళ్లు ఆ తర్వాత వెనుకబడిపోతున్నారు. సీనియర్ స్థాయిలో గెలవడం తన వల్ల కాదేమోననే భయం వారిలో పెరుగుతోంది. పెద్ద ఆటగాళ్లతో పోటీ పడాలన్న పట్టుదల, చిన్న ఆటగాళ్లను గౌరవించే వారికే విజయాలు దక్కుతాయి. గెలిస్తే నా అంతటోడు లేడని తలెగరేసే వాళ్లు, ఓడితే కుంగిపోయే వాళ్లు కెరీర్లో ఎప్పటికీ ముందుకు వెళ్లలేరు. క్రీడాకారుడిగా ఎదగడంలో ఎంతో శ్రమ, కష్టం ఉంటుంది. కానీ ఒక్కసారి దేశానికి ఆడిన తర్వాత కలిగే గర్వానికి ఏదీ సాటిరాదు. ఎప్పుడూ సాధారణ చదువులకన్నా, కొంత మందైనా తమ పిల్లలను ఆటగాళ్లుగా మార్చాలని భావిస్తే భారత్‌లో క్రీడలకు ఉండే విలువ ఎప్పటికీ తగ్గదు.