పంకజ్ అద్వానీ శుభారంభం | Pankaj Advani good start | Sakshi
Sakshi News home page

పంకజ్ అద్వానీ శుభారంభం

Published Sun, Oct 26 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:22 PM

పంకజ్ అద్వానీ శుభారంభం

పంకజ్ అద్వానీ శుభారంభం

టైమ్ ఫార్మాట్ వరల్డ్ చాంపియన్‌షిప్

 లీడ్స్: పాయింట్ ఫార్మాట్ బిలియర్డ్స్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మరుసటి రోజే భారత ఆటగాడు పంకజ్ అద్వానీ టైమ్ ఫార్మాట్ టోర్నీలోనూ శుభారంభం చేశాడు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో అద్వానీ తన తొలి లీగ్ మ్యాచ్‌లో 701-510 తేడాతో భారత్‌కే చెందిన అరుణ్ అగర్వాల్‌పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో 128 పాయింట్ల బెస్ట్ బ్రేక్ నమోదు చేసిన అద్వానీ, ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యం ప్రదర్శించాడు. భారత్‌కే చెందిన ధ్వజ్ హరియా, అలోక్, ధ్రువ్ సిత్వాలా, రూపేశ్ షా, దేవేంద్ర జోషి, అశోక్ శాండిల్య కూడా తమ తొలి లీగ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement