
ప్రపంచ మాజీ చాంపియన్, రష్యా స్టార్ ప్లేయర్ వ్లాదిమిర్ క్రామ్నిక్ అంతర్జాతీయ చెస్‌కు వీడ్కోలు పలికాడు. 43 ఏళ్ల క్రామ్నిక్ 2000లో దిగ్గజం గ్యారీ కాస్పరోవ్‌ను ఓడించి క్లాసికల్ విభాగంలో విశ్వవిజేతగా అవతరించాడు. ఆ తర్వాత రెండుసార్లు ప్రపంచ టైటిల్‌ను నిలబెట్టుకున్న అతను చెస్‌లోని అన్ని ప్రముఖ టోర్నమెంట్‌లలోనూ విజేతగా నిలిచాడు.
1996లోనే నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్న క్రామ్నిక్ ప్రస్తుతం ఏడో ర్యాంక్‌లో ఉన్నాడు. ‘ప్రొఫెషనల్ చెస్‌కు గుడ్‌బై చెప్పాలని రెండు నెలల ముందే నిర్ణయం తీసుకున్నాను. చెస్‌కు ప్రాచుర్యం కల్పించే కార్యక్రమాలపై మరింత దృష్టి పెట్టేందుకే ఆటకు వీడ్కోలు పలికాను’ అని క్రామ్నిక్ తెలిపాడు.