
న్యూఢిల్లీ: డాన్ కొలోవ్ అంతర్జాతీయ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో భారత స్టార్ మహిళా రెజ్లర్ సాక్షి మలిక్ రజత పతకం సాధించింది. బల్గేరియాలో శుక్రవారం జరిగిన మహిళల 65 కేజీల విభాగం ఫైనల్లో సాక్షి 3–8 స్కోరుతో హెనా జొహాన్సన్ (స్వీడన్) చేతిలో పరాజయం పాలైంది. సెమీఫైనల్లో ప్రపంచ చాంపియన్ పెట్రా ఒలి (ఫిన్లాండ్)ని ఓడించిన సాక్షి ఫైనల్లో మాత్రం అదే జోరు కనబర్చలేకపోయింది.
మరోవైపు ఇదే టోర్నమెంట్ పురుషుల ఫ్రీ స్టయిల్ 65 కేజీల విభాగంలో బజరంగ్ పూనియా స్వర్ణ పతక పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో బజరంగ్ 8–6తో నిర్హున్ స్కారాబిన్ (బెలారస్)పై... సందీప్ క్వార్టర్ ఫైనల్లో 2–0తో ఎడ్వర్డ్ గ్రిగోరెవ్ (రష్యా)పై... ప్రి క్వార్టర్ ఫైనల్లో 13–6తో లులియాన్ జుర్జెనోవ్ (రష్యా)పై గెలుపొందాడు.
Comments
Please login to add a commentAdd a comment