సాక్షి, న్యూఢిల్లీ: అంధుల క్రికెట్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్తింపు ఇచ్చి... నిధులు కేటాయిస్తే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తామని... ఇటీవల ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత జట్టులోని ఆంధ్రప్రదేశ్ సభ్యుడు అజయ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆంధ్రప్రదేశ్‌లో అంధుల క్రికెట్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించాలని అతను కోరాడు. సహచర సీనియర్ క్రీడాకారుడు వెంకటేశ్‌తో కలిసి ప్రతిభ ఉండి బయటకు రాలేకపోతున్న క్రీడాకారులను అన్వేషించి శిక్షణ ఇస్తామన్నాడు.
ఇటీవల దక్షిణాఫ్రికాలో జరిగిన అంధుల ప్రపంచకప్ క్రికెట్ పోటీల్లో విజేతగా నిలిచిన భారత జట్టులో తనతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు... తెలంగాణ నుంచి ఒక క్రీడాకారుడు ఉన్నాడని తెలిపాడు. భారత జట్టులోని తెలంగాణ క్రికెటర్ మధు మాట్లాడుతూ... అంధుల క్రికెట్ భారత జట్టుకు ఎంపిక కావడం, ప్రపంచ కప్‌ను సాధించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పాడు. అంధులైన క్రీడాకారులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరాడు.
‘అంధుల క్రికెట్‌కు బీసీసీఐ గుర్తింపు ఇవ్వాలి’
Published Fri, Dec 12 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement
Advertisement