మరణానికి కొన్ని నిమిషాల ముందు; కైన్ స్మెయిల్
క్రీడలో విషాదం నెలకొంది. అమెరికాకు చెందిన స్కీయింగ్ స్టార్(Skieing Game), మాజీ వరల్డ్ ఛాంపియన్ కైల్ స్మెయిన్.. హిమపాతంలో కూరుకుపోయి సజీవ సమాది అవడం అందరిని కలచి వేసింది. ఆదివారం(జనవరి 29న) జపాన్‌లోని నాగానో ప్రిఫెక్చర్‌లోని 2,469 మీటర్ల ఎత్తులో ఉన్న మౌంట్ హకుబా నోరికురా వద్ద జరిగిన దుర్ఘటనలో స్మెయిన్ (31) సహా వేరే గ్రూపుకు చెందిన ఆస్ట్రియన్ స్కీయర్ కూడా మరణించినట్లు ది గార్డియన్ పత్రిక వెల్లడించింది.
కాగా మార్కెటింగ్ ఫిల్మ్ షూటింగ్ కోసం మౌంట్ హకుబా నోరికురాకు వెళ్లినట్లు మౌంటెన్‌గెజిట్ ఫోటోగ్రాఫర్ గ్రాంట్ గండర్సన్ తెలిపాడు. షూటింగ్ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో హిమపాతం స్మెయిన్ సహా ఆస్ట్రియా స్కీయర్‌ను భూమిలోకి కూరుకుపోయేలా చేసింది. వారి కోసం గాలింపు చేపట్టినప్పటికి లాభం లేకుండా పోయింది. ఈ సందర్భంగా గ్రాంట్ గండర్సన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్మెయిన్ ఫోటో షేర్ చేస్తూ.. ''ఇది నిజంగా పీడకల అయ్యుంటే బాగుండేది'' అని విచారం వ్యక్తం చేశాడు.
అయితే స్మెయిన్ చనిపోవడానికి ముందు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియో ఒకటి బాగా వైరల్ అయింది. ''పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నప్పటికి స్కీయింగ్‌పై తనకున్న అభిమానం ఎంత కష్టమున్నా లెక్కచేయనివ్వదు. కష్టంలోనే మన సక్సెస్ ఏంటో తెలుస్తుంది'' అని చెప్పుకొచ్చాడు.
కాగా 1991, జూన్ 27న అమెరికాలో జన్మించిన కైల్ స్మెయిన్ చిన్నప్పటి నుంచే కొండలు, గుట్టలపై క్లైంబింగ్ చేయడం హాబీగా మార్చుకున్నాడు. అలా స్కీయర్‌గా మారిన స్మెయిన్ 2015లో ఎఫ్‌ఐఎస్ ఆల్పైన్ వరల్డ్ స్కై చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2018 ఒలింపిక్స్‌లో స్కీయింగ్‌లో పాల్గొన్న తొలి అమెరికన్ అథ్లెట్‌గా కైల్ స్మెయిన్ నిలిచాడు.
Comments
Please login to add a commentAdd a comment