‘పోల్’ నం.4
రోస్‌బర్గ్ హవా
టాప్-10లో ‘ఫోర్స్’ డ్రైవర్లు
నేడు బ్రిటిష్ గ్రాండ్‌ప్రి
సిల్వర్‌స్టోన్: క్వాలిఫయింగ్ చివరి సెషన్‌లో మరోసారి తన ఆధిపత్యం నిరూపించుకుంటూ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ బ్రిటిష్ గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో ఈ జర్మన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 35.766 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో రోస్‌బర్గ్‌కిది నాలుగో ‘పోల్ పొజిషన్’ కావడం విశేషం. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి మొదలుపెట్టనున్న రోస్‌బర్గ్ టైటిల్ నిలబెట్టుకునే లక్ష్యంతో ఉన్నాడు.
ఈ సీజన్‌లో ఒక్క విజయాన్నీ దక్కించుకోని డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఆరు రేసుల తర్వాత మరోసారి రెండో స్థానం నుంచి రేసును ఆరంభించనున్నాడు. మాజీ చాంపియన్ జెన్సన్ బటన్ మూడో స్థానంతో రేసును ప్రారంభిస్తాడు. ‘స్థానిక స్టార్’ హామిల్టన్ చివరి సెషన్‌లో తప్పిదం చేసి ఆరో స్థానం దక్కించుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు క్వాలిఫయింగ్ సెషన్ కలిసొచ్చింది. ‘ఫోర్స్’ జట్టు డ్రైవర్లు హుల్కెన్‌బర్గ్ నాలుగో స్థానం నుంచి... సెర్గియో పెరెజ్ ఏడో స్థానం నుంచి రేసును మొదలుపెడతారు.