
.తన బూట్‌లో షాంపేన్ తాగుతున్న రికియార్డో
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో ఎట్టకేలకు మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఇక్కడ మూడేళ్లుగా టైటిల్ కోసం తన స్పీడుకు పదును పెడుతున్నప్పటికీ... అందని టైటిల్ ఈసారి మాత్రం చేతికందింది. పోల్ పొజిషన్ సాధించిన ఈ రెడ్‌బుల్ డ్రైవర్ టైటిలే లక్ష్యంగా ఆదివారం తన జోరు చూపెట్టాడు. మొదటి స్థానం నుంచి రేసును ఆరంభించిన రికియార్డో 78 ల్యాప్‌ల రేసును గంటా 42 నిమిషాల 54.807 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 7.7336 సెకన్ల తేడాతో గత విజేత, ఫెరారీ డ్రైవర్ వెటెల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ ఆరో స్థానంలో నిలువగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానం పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 10న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment