Monaco Grand Prix title
-
రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో.. వెర్‌స్టాపెన్‌కు ఐదో గెలుపు..!
ఆద్యంతం ఆధిపత్యం కనబరుస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్స్టాపెన్ ఫార్ములావన్ తాజా సీజన్లో ఐదో విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం ఇటలీలో జరిగిన ఎమిలియా రొమాగ్నా గ్రాండ్‌ప్రిలో వెర్స్టాపెన్ విజేతగా నిలిచాడు.‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెర్స్టాపెన్ నిర్ణీత 63 ల్యాప్‌లను అందరికంటే వేగంగా ఒక గంటా 25 నిమిషాల 25.252 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. లాండో నోరిస్ (మెక్లారెన్) రెండో స్థానంలో, చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. సీజన్‌లోని తదుపరి రేసు మొనాకో గ్రాండ్‌ప్రి ఈనెల 26న జరుగుతుంది.ఇవి చదవండి: విన్‌రైజర్స్... -
మొనాకో చాంప్ రికియార్డో
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో ఎట్టకేలకు మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఇక్కడ మూడేళ్లుగా టైటిల్ కోసం తన స్పీడుకు పదును పెడుతున్నప్పటికీ... అందని టైటిల్ ఈసారి మాత్రం చేతికందింది. పోల్ పొజిషన్ సాధించిన ఈ రెడ్‌బుల్ డ్రైవర్ టైటిలే లక్ష్యంగా ఆదివారం తన జోరు చూపెట్టాడు. మొదటి స్థానం నుంచి రేసును ఆరంభించిన రికియార్డో 78 ల్యాప్‌ల రేసును గంటా 42 నిమిషాల 54.807 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 7.7336 సెకన్ల తేడాతో గత విజేత, ఫెరారీ డ్రైవర్ వెటెల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ ఆరో స్థానంలో నిలువగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానం పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 10న జరుగుతుంది. -
రోస్‌బర్గ్ ‘హ్యాట్రిక్’
మొనాకో గ్రాండ్‌ప్రిలో టైటిల్ సొంతం మోంటెకార్లో : నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న మొనాకో గ్రాండ్‌ప్రి రేసులో మెర్సిడెస్ రేసర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచి అరుదైన ‘హ్యాట్రిక్’ నమోదు చేశాడు. 65 ఏళ్ల చరిత్ర కలిగిన మొనాకో గ్రాండ్‌ప్రి రేసును వరుసగా మూడేళ్లు సాధించిన నాలుగో డ్రైవర్‌గా నిలిచాడు. గతంలో అయర్టన్ సెనా, అలైన్ ప్రాస్ట్, గ్రాహమ్ హిల్ మాత్రమే ఈ ఘనత సాధించారు. 78 ల్యాప్‌ల ఈ రేసును రోస్‌బర్గ్ గంటా 49 నిమిషాల 18.420 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. సెబాస్టియన్ వెటెల్ (ఫెరారీ-1:49:22.906) రెండో స్థానంలో నిలువగా... ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన హామిల్టన్ (మెర్సిడెస్-1:49:24.473) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’ జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ ఏడో స్థానంలో నిలువగా... మరో డ్రైవర్ హుల్కెన్‌బర్గ్ 11వ స్థానంలో నిలిచాడు. రేసులో 63వ ల్యాప్ వరకు హామిల్టన్ ఆధిక్యంలో ఉన్నాడు. ఈ దశలో చిన్నపాటి ప్రమాదం చోటు చేసుకోవడంతో సేఫ్టీ కారును రప్పించారు. అదే సమయంలో హామిల్టన్‌ను పిట్ స్టాప్‌లో ఆగాలని జట్టు ఆదేశించింది. అప్పటికే రెండో స్థానంలో ఉన్న రోస్‌బర్గ్, మూడో స్థానంలో ఉన్న వెటెల్ ముందుకు దూసుకుపోయారు. -
రయ్... రయ్... రోస్‌బర్గ్
మొనాకో గ్రాండ్‌ప్రి టైటిల్ సొంతం సీజన్లో రెండో విజయం మెర్సిడెస్వే తొలి రెండు స్థానాలు ఏకంగా 8 మంది డ్రైవర్లు అవుట్ మోంటెకార్లో: గత పదేళ్లలో తొమ్మిదిసార్లు మొనాకో గ్రాండ్‌ప్రిలో ‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన డ్రైవర్‌కే టైటిల్ లభించింది. ఈ ఏడాదీ ఆ సెంటిమెంట్ పనిచేసింది. ‘పోల్ పొజిషన్’తో రేసును మొదలుపెట్టిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఆద్యంతం ఆధిపత్యం కనబరిచాడు. సహచర డ్రైవర్ లూయిస్ హామిల్టన్ నుంచి గట్టిపోటీ లభించినా... ఎక్కడా నియంత్రణ కోల్పోకుండా డ్రైవ్ చేసిన రోస్‌బర్గ్ వరుసగా రెండో ఏడాది మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. మోంటెకార్లో నగర వీధుల్లో జరిగిన ఈ 78 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ గంటా 49 నిమిషాల 27.661 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేశాడు. గత నాలుగు రేసుల్లో విజేతగా నిలిచిన హామిల్టన్ ఈసారి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. రేసు ఆరంభ క్షణాల్లోనే ఆధిక్యంలోకి వెళ్లిన రోస్‌బర్గ్ చివరివరకూ తన జోరును కొనసాగించాడు. ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన ఆరు రేసుల్లోనూ మెర్సిడెస్ డ్రైవర్లకే టైటిల్ లభించడం విశేషం. అంతేకాకుండా ఫార్ములావన్ చరిత్రలో ఒక సీజన్లో ఆరంభ ఆరు రేసుల్లో టైటిల్ నెగ్గిన రెండో జట్టుగా మెర్సిడెస్ గుర్తింపు పొందింది. 1988లో మెక్లారెన్ జట్టు సీజన్లో వరుసగా 11 రేసుల్లో గెలిచింది. డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్‌కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. కారులో సాంకేతిక సమస్య ఏర్పడటంతో వెటెల్ ఎనిమిదో ల్యాప్‌లోనే రేసు నుంచి తప్పుకున్నాడు. వెటెల్తోపాటు మరో ఏడుగురు డ్రైవర్లు (మల్డొనాడో, సుటిల్, క్వియాట్, వెర్జెన్, బొటాస్, పెరెజ్, గుటిరెజ్) రేసును పూర్తి చేయకపోవడం గమనార్హం. భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు ఈ రేసు మిశ్రమ ఫలితాలు ఇచ్చింది. హుల్కెన్‌బర్గ్ ఐదో స్థానంలో నిలిచి 10 పాయింట్లు సంపాదించగా... సెర్గియో పెరెజ్ రేసు తొలి ల్యాప్‌లోనే వెనుదిరిగాడు. తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 8న జరుగుతుంది.