Vettel
-
టైటిల్ వేటకు వేళాయె...!
మెల్బోర్న్: గతేడాది మాదిరిగానే ఈసారీ ఫార్ములావన్ సీజన్ తొలి గ్రాండ్‌ప్రి రేసులో ప్రపంచ చాంపియన్ లూయిస్ హామిల్టన్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. ఆదివారం జరిగే 2019 సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిని మెర్సిడెస్ డ్రైవర్ హామిల్టన్ తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 20.486 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మెర్సిడెస్‌కే చెందిన వాల్తెరి బొటాస్ రెండో స్థానం నుంచి... డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మూడో స్థానం నుంచి రేసును మొదలు పెడతారు. 2019 ఫార్ములావన్ సీజన్లో ముగ్గురు కొత్త డ్రైవర్లు అరంగేట్రం చేయనున్నారు. లాండో నోరిస్ (మెక్లారెన్ ), రసెల్ (విలియమ్స్), అలెగ్జాండర్ అల్బోన్ (ఎస్టీఆర్) ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలో తొలిసారి బరిలోకి దిగనున్నారు. ప్రపంచ మాజీ చాంపియన్ కిమీ రైకోనెన్ ఫెరారీ జట్టు నుంచి అల్ఫా రోమియో జట్టుకు మారాడు. తొమ్మిదేళ్ల తర్వాత రాబర్ట్ కుబికా పునరాగమనం చేయనున్నాడు. ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు గ్రిడ్ పొజిషన్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. బొటాస్ (మెర్సిడెస్), 3. వెటెల్ (ఫెరారీ), 4. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 5. లెక్లెర్క్ (ఫెరారీ), 6. గ్రోస్యెన్ (హాస్), 7. మాగ్నుసెన్(హాస్), 8. నోరిస్ (మెక్లారెన్ ), 9. రైకోనెన్ (అల్ఫా రోమియో), 10. పెరెజ్ (రేసింగ్ పాయింట్), 11. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 12. రికియార్డో (రెనౌ), 13. అల్బోన్ (ఎస్టీఆర్), 14. గియోవినాజి (అల్ఫా రోమియో), 15. క్వియాట్ (ఎస్టీఆర్), 16. స్ట్రోల్ (రేసింగ్ పాయింట్), 17. గాస్లీ (రెడ్‌బుల్), 18. సెయింజ్ (మెక్లారె¯Œ ), 19. జార్జి రసెల్ (విలియమ్స్), 20. కుబికా (విలియమ్స్). ఉదయం గం. 10.35 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2లో ప్రత్యక్ష ప్రసారం -
బొటాస్‌కు పోల్
సోచి: రష్యా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ ఆధిపత్యం కొనసాగింది. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ హోరాహోరీగా దూసుకెళ్లారు. చివరకు బొటాసే తన సహచరుడు, చాంపియన్ రేసర్ హామిల్టన్‌ను క్వాలిఫయింగ్ సెషన్లో అధిగమించి పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్ రేసులో బొటాస్ అందరి కంటే వేగంగా ల్యాప్‌ను 1 ని.31.387 సెకన్లలో పూర్తిచేశాడు. హామిల్టన్ ల్యాప్‌ను 1 ని.31.532 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలువగా, ఫెరారీ జట్టుకు చెందిన వెటెల్ (1:31.943 సె.) మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ సెషన్లలో హామిల్టన్ హవానే సాగింది. కానీ చివరి సెషన్లో మాత్రం అతని జోరు తగ్గింది. సీజన్లో రెండో పోల్ పొజిషన్ సాధించిన బొటాస్ ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు. -
హామిల్టన్‌కే పోల్
స్పా–ఫ్రాంకోర్చాంప్స్: బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా 1 ని.58.179 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రెండో స్థానం పొందగా, రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్స్టాపెన్, రికియార్డో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు. -
విజేత హామిల్టన్
బుడాపెస్ట్: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ హంగేరి గ్రాండ్‌ప్రిలో మళ్లీ దూసుకెళ్లాడు. ఈ సీజన్లో ఐదో విజయాన్ని నమోదు చేసిన ఈ బ్రిటన్ డ్రైవర్ హంగేరియన్ సర్క్యూట్లో ఆరోసారి టైటిల్ గెలిచాడు. ఓవరాల్‌గా కెరీర్లో అతనికిది 67వ గెలుపు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును హామిల్ట న్ అందరికంటే వేగంగా ముగించాడు. 70 ల్యాప్‌ల ఈ రేసును గంటా 37 నిమిషాల 16.427 సెకన్లలో పూర్తిచేశాడు. తాజా విజయంతో హామిల్టన్ 213 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో, రైకొనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 13, 14 స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్లో తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి వచ్చే నెల 26న జరుగనుంది. -
ఐదో విజయంపై హామిల్టన్ గురి
బుడాపెస్ట్: ఈ సీజన్లో ఐదో టైటిల్ సాధించేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ ఆదివారం జరిగే హంగేరి గ్రాండ్‌ప్రి రేసులో బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 35.658 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్ పొందాడు. మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానం నుంచి... రైకోనెన్, వెటెల్ (ఫెరారీ) మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ 18వ, 19వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
వెటెల్‌కు పోల్ పొజిషన్
హాకెన్‌హీమ్: సొంతగడ్డపై దుమ్మురేపుతూ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో ఐదోసారి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్లో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మన్ డ్రైవర్ వెటెల్... అందరికంటే వేగంగా ఒక నిమిషం 11.212 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు. మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తొలి క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 10వ, 16వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. నేటి ప్రధాన రేసును సాయంత్రం గం. 6.35 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2 చానెల్ ప్రసారం చేస్తుంది. -
వెటెల్ ఖాతాలో 50వ టైటిల్
మోంట్రియల్: వరుసగా నాలుగు రేసుల్లో టైటిల్‌కు దూరంగా నిలిచిన ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ మళ్లీ విజయాల ట్రాక్‌లోకి వచ్చాడు. ఫార్ములావన్ సీజన్లో భాగంగా జరిగిన కెనడా గ్రాండ్‌ప్రి రేసులో ఈ జర్మన్ డ్రైవర్ విజేతగా నిలిచాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన ఈ రేసులో వెటెల్ 68 ల్యాప్‌లను గంటా 28 నిమిషాల 31.377 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. వెటెల్ కెరీర్లో ఇది 50వ విజయంకాగా, ఈ సీజన్లో మూడోది. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వెటెల్ ఆద్యంతం ఆధిపత్యం చలాయించాడు. గత మూడేళ్లుగా ఈ రేసులో ‘పోల్ పొజిషన్’ సాధించడంతోపాటు విజేతగా నిలిచిన హామిల్టన్ (మెర్సిడెస్) ఈసారి ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్), వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), రికియార్డో (రెడ్‌బుల్) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. 2004 తర్వాత కెనడా గ్రాండ్‌ప్రిలో ఫెరారీ డ్రైవర్‌కు టైటిల్ దక్కడం ఇదే తొలిసారి. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఎస్టెబన్ ఒకాన్ తొమ్మిదో స్థానంలో, సెర్గియో పెరెజ్ 14వ స్థానంలో నిలిచారు. మరోవైపు రేసు ముగింపునకు సూచికగా చెకర్డ్ ఫ్లాగ్‌ను చివరిదైన 70 ల్యాప్నకు బదులుగా 68వ ల్యాప్‌లోనే మోడల్ విన్నీ హార్లో ఊపడంతో గందరగోళం చోటు చేసుకుంది. సీజన్లో ఏడు రేసులు ముగిశాక వెటెల్ 121 పాయింట్లతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ పట్టికలో మళ్లీ టాప్ ర్యాంక్‌లోకి వచ్చాడు. 120 పాయింట్లతో హామిల్టన్ రెండో స్థానంలో ఉన్నాడు. సీజన్‌లోని తదుపరి రేసు ఫ్రెంచ్ గ్రాండ్‌ప్రి ఈనెల 24న జరుగుతుంది. -
మొనాకో చాంప్ రికియార్డో
మొనాకో: రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో ఎట్టకేలకు మొనాకో గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచాడు. ఇక్కడ మూడేళ్లుగా టైటిల్ కోసం తన స్పీడుకు పదును పెడుతున్నప్పటికీ... అందని టైటిల్ ఈసారి మాత్రం చేతికందింది. పోల్ పొజిషన్ సాధించిన ఈ రెడ్‌బుల్ డ్రైవర్ టైటిలే లక్ష్యంగా ఆదివారం తన జోరు చూపెట్టాడు. మొదటి స్థానం నుంచి రేసును ఆరంభించిన రికియార్డో 78 ల్యాప్‌ల రేసును గంటా 42 నిమిషాల 54.807 సెకన్లలో పూర్తి చేశాడు. కేవలం 7.7336 సెకన్ల తేడాతో గత విజేత, ఫెరారీ డ్రైవర్ వెటెల్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్ మూడో స్థానంలో నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్ ఆరో స్థానంలో నిలువగా, సెర్గియో పెరెజ్ 12వ స్థానం పొందాడు. సీజన్‌లోని తదుపరి రేసు కెనడా గ్రాండ్‌ప్రి జూన్ 10న జరుగుతుంది. -
చైనా గ్రాండ్‌ప్రి చాంప్ రికియార్డో
షాంఘై: ఈ సీజన్లో జోరుమీదున్న సెబాస్టియన్ వెటెల్ ‘హ్యాట్రిక్’ ఆశలపై రెడ్‌బుల్ డ్రైవర్ డానియెల్ రికియార్డో నీళ్లు చల్లాడు. ఫార్ములావన్ చైనా గ్రాండ్‌ప్రిలో రికియార్డో విజేతగా నిలిచాడు. షాంఘై సర్క్యూట్లో ఈ ఆస్ట్రేలియన్ డ్రైవర్ అసాధారణ వేగంతో దూసుకెళ్లాడు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన రికియార్డో 56 ల్యాప్‌ల రేసును గంటా 35 నిమిషాల 36.380 సెకన్లలో పూర్తి చేశాడు. తన కెరీర్లో అతనికిది ఆరో విజయం. క్వాలిఫయింగ్‌లో పోల్ పొజిషన్ సాధించిన వెటెల్‌కు ఈ రేసు నిరాశను మిగిల్చింది. ఇప్పటికే రెండు రేసుల్ని తన ఖాతాలో వేసుకున్న ఫెరారీ డ్రైవర్ ఎనిమిదో స్థానంలో నిలిచాడు. ఇతని సహచరుడు, రెండో స్థానం నుంచి రేసును ఆరంభించిన రైకోనెన్‌కు మూడో స్థానం లభించగా, మెర్సిడెస్ డ్రైవర్ బొటాస్ రన్నరప్‌గా నిలిచాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 11, 12వ స్థానాలు పొందారు. ఈ సీజన్లో తదుపరి రేసు అజర్బైజాన్ గ్రాండ్‌ప్రి ఈ నెల 29న జరుగుతుంది. -
మళ్లీ వెటెల్‌కే పోల్
షాంఘై: ఫార్ములావన్ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేశాడు. చైనా గ్రాండ్‌ప్రిలోనూ అతను దూసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్లో ఫెరారీ డ్రైవర్ వెటెల్ తన జోరు చూపెట్టాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.095 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును అతను మొదటి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. ఈ సీజన్లో రెండు టైటిళ్లు గెలిచిన వెటెల్‌కు వరుసగా ఇది రెండో పోల్ పొజిషన్. ఫెరారీ మరో డ్రైవర్ కిమి రైకోనెన్ (1:31.182 సె.) రెండో స్థానం పొందగా, మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్ (1:31.625 సె.), హామిల్టన్ (1:31. 675 సె.) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఎనిమిది, 12వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. -
వెటెల్‌కు ఊరట విజయం
సావోపాలో: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం కావడంతో ఫార్ములావన్ సీజన్‌లోని చివరి రెండు రేసులకు ప్రాధాన్యత తగ్గిపోయింది. అయితే హామిల్టన్‌కు టైటిల్ కోల్పోయిన మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. అనుకున్నది సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్లో ఐదో విజయాన్ని, కెరీర్లో 47వ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్)ను తొలి మలుపు వద్ద ఓవర్టేక్ చేసిన వెటెల్ ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానాన్ని సంపాదించాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొనగా నలుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. ఇందులో ముగ్గురు ఒకాన్ (ఫోర్స్ ఇండియా), మాగ్నుసన్ (హాస్), వాన్డూర్నీ (మెక్లారెన్) తొలి ల్యాప్‌లోనే తప్పుకున్నారు. తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది. సీజన్‌లోని చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి ఈనెల 26న జరుగుతుంది. -
హామిల్టన్‌కే ‘పోల్’
నేడు చైనా గ్రాండ్‌ప్రి రేసు షాంఘై: గత ఏడాది జరిగిన తప్పిదాన్ని ఈసారి పునరావృతం చేయకుండా జాగ్రత్త పడిన మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ అనుకున్న ఫలితాన్ని సాధించాడు. ఫార్ములావన్ చైనా గ్రాండ్‌ప్రి రేసు క్వాలిఫయింగ్ సెషన్లో ఈ బ్రిటన్ డ్రైవర్ ‘పోల్ పొజిషన్’ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.678 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభించే అవకాశాన్ని అతను దక్కించుకున్నాడు. ఈ సీజన్లో హామిల్టన్‌కిది వరుసగా రెండో పోల్ పొజిషన్. సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియా గ్రాండ్‌ప్రిలోనూ హామిల్టన్‌కు పోల్ పొజిషన్ లభించిన సంగతి తెలిసిందే. గత ఏడాది చైనా గ్రాండ్‌ప్రి క్వాలి ఫయింగ్ సెషన్లో హామిల్టన్ నిబంధనలకు విరుద్ధంగా గేర్ బాక్స్‌ను మార్చాడు. దాంతో అతనిపై నిర్వాహకులు పెనాల్టీని విధించారు. ఫలితంగా హామిల్టన్ ప్రధాన రేసును చివరిదైన 22వ స్థానంతో ప్రారంభించాడు. కానీ ఈసారి మాత్రం క్వాలిఫయింగ్ సెషన్లో హామిల్టన్ 3 సెషన్స్‌లోనూ ఆధిపత్యాన్ని చాటుకున్నాడు. వెటెల్ (ఫెరారీ), బొటాస్ (మెర్సిడెస్) వరుసగా రెండు, మూడు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు సెర్గియో పెరెజ్, ఒకాన్ వరుసగా 8వ, 20వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. గ్రిడ్ పొజిషన్స్: 1. హామిల్టన్ (మెర్సిడెస్), 2. వెటెల్ (ఫెరారీ), 3. బొటాస్ (మెర్సిడెస్), 4. రైకోనెన్ (ఫెరారీ), 5. రికియార్డో (రెడ్‌బుల్), 6. మసా (విలియమ్స్), 7. హుల్కెన్‌బర్గ్ (రెనౌ), 8. పెరెజ్ (ఫోర్స్ ఇండియా), 9. క్వియాట్ (ఎస్టీఆర్), 10. లాన్స్ స్ట్రోల్ (విలియమ్స్), 11. కార్లోస్ సెయింజ్ (ఎస్టీఆర్), 12. మాగ్నుసెన్ (హాస్), 13. అలోన్సో (మెక్లారెన్), 14. ఎరిక్సన్ (సాబెర్), 15. గియోవినాజి (సాబెర్), 16. వాన్డూర్నీ (మెక్లారెన్), 17. గ్రోస్యెన్ (హాస్), 18. పాల్మెర్ (రెనౌ), 19. వెర్స్టాపెన్ (రెడ్‌బుల్), 20. ఒకాన్ (ఫోర్స్ ఇండియా). నేటి ప్రధాన రేసు ఉదయం గం. 11.25 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్ హెచ్డీ–2లో ప్రత్యక్ష ప్రసారం -
వెటల్ కు 'పోల్ పొజిషన్'
సింగపూర్:సింగపూర్ గ్రాండ్ ప్రిలో ఫెరారీ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ అదరగొట్టాడు. శనివారం జరిగిన సింగపూర్ గ్రాండ్ ప్రిలో వెటెల్ అందరి కంటే వేగంగా ల్యాప్ ను పూర్తి చేసిన పోల్ పొజిషన్ సాధించాడు. మరోవైపు వెటెల్ కంటే ఒక నిముషం 40 సెకన్లు వెనుకబడ్డ మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హమిల్టన్ ఐదో స్థానానికి పరిమితమయ్యాడు. ఈ సీజన్ లో మెర్సిడెస్ జట్టు ఆకట్టుకున్నా.. సింగపూర్ గ్రాండ్ ప్రిలో మాత్రం కాస్త వెనుకబడింది. ఇదిలా ఉండగా రెడ్ బుల్ డ్రైవర్ రికియార్డో రెండో స్థానం సాధించగా, ఫెరారీ డ్రైవర్ రైకోనెన్ మూడో స్థానం, ఎస్టీఆర్ డ్రైవర్ క్వియాట్ లు నాలుగో స్థానం సాధించారు. కాగా, ఫోర్స్ ఇండియా డ్రైవర్లు హుల్కెన్ బర్గ్ 11వ స్థానం,పెరెజ్ లు 13 స్థానంతో ల్యాప్ ను పూర్తి చేశారు.