
షాంఘై: ఫార్ములావన్ మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్‌లో ‘హ్యాట్రిక్’ టైటిల్‌పై కన్నేశాడు. చైనా గ్రాండ్‌ప్రిలోనూ అతను దూసుకెళ్తున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఫెరారీ డ్రైవర్ వెటెల్ తన జోరు చూపెట్టాడు. అందరికంటే వేగంగా ఒక నిమిషం 31.095 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి పోల్ పొజిషన్ సాధించాడు. నేడు జరిగే ప్రధాన రేసును అతను మొదటి స్థానం నుంచి ప్రారంభించనున్నాడు. ఈ సీజన్‌లో రెండు టైటిళ్లు గెలిచిన వెటెల్‌కు వరుసగా ఇది రెండో పోల్ పొజిషన్.
ఫెరారీ మరో డ్రైవర్ కిమి రైకోనెన్ (1:31.182 సె.) రెండో స్థానం పొందగా, మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్ (1:31.625 సె.), హామిల్టన్ (1:31. 675 సె.) వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా ఎనిమిది, 12వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.