
బుడాపెస్ట్: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ హంగేరి గ్రాండ్‌ప్రిలో మళ్లీ దూసుకెళ్లాడు. ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసిన ఈ బ్రిటన్ డ్రైవర్ హంగేరియన్ సర్క్యూట్‌లో ఆరోసారి టైటిల్ గెలిచాడు. ఓవరాల్‌గా కెరీర్‌లో అతనికిది 67వ గెలుపు. ఆదివారం జరిగిన ప్రధాన రేసును హామిల్ట న్ అందరికంటే వేగంగా ముగించాడు. 70 ల్యాప్‌ల ఈ రేసును గంటా 37 నిమిషాల 16.427 సెకన్లలో పూర్తిచేశాడు.
తాజా విజయంతో హామిల్టన్ 213 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వెటెల్ (ఫెరారీ) రెండో స్థానంలో, రైకొనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా 13, 14 స్థానాల్లో నిలిచారు. ఈ సీజన్‌లో తదుపరి రేసు బెల్జియం గ్రాండ్‌ప్రి వచ్చే నెల 26న జరుగనుంది.