
సోచి: రష్యా గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ ఆధిపత్యం కొనసాగింది. మెర్సిడెస్ డ్రైవర్లు బొటాస్, హామిల్టన్ హోరాహోరీగా దూసుకెళ్లారు. చివరకు బొటాసే తన సహచరుడు, చాంపియన్ రేసర్ హామిల్టన్‌ను క్వాలిఫయింగ్ సెషన్‌లో అధిగమించి పోల్ పొజిషన్ సాధించాడు. క్వాలిఫయింగ్ రేసులో బొటాస్ అందరి కంటే వేగంగా ల్యాప్‌ను 1 ని.31.387 సెకన్లలో పూర్తిచేశాడు.
హామిల్టన్ ల్యాప్‌ను 1 ని.31.532 సెకన్లలో పూర్తి చేసి రెండో స్థానంలో నిలువగా, ఫెరారీ జట్టుకు చెందిన వెటెల్ (1:31.943 సె.) మూడో స్థానంలో నిలిచాడు. తొలి రెండు క్వాలిఫయింగ్ సెషన్లలో హామిల్టన్ హవానే సాగింది. కానీ చివరి సెషన్‌లో మాత్రం అతని జోరు తగ్గింది. సీజన్‌లో రెండో పోల్ పొజిషన్ సాధించిన బొటాస్ ఆదివారం జరిగే ప్రధాన రేసును తొలి స్థానం నుంచి ప్రారంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా ఆరు, ఎనిమిది స్థానాల నుంచి రేసును మొదలు పెడతారు.
Comments
Please login to add a commentAdd a comment