సావోపాలో: మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్‌కు ప్రపంచ డ్రైవర్స్ చాంపియన్‌షిప్ టైటిల్ ఖాయం కావడంతో ఫార్ములావన్ సీజన్‌లోని చివరి రెండు రేసులకు ప్రాధాన్యత తగ్గిపోయింది. అయితే హామిల్టన్‌కు టైటిల్ కోల్పోయిన మాజీ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ మాత్రం విజయమే లక్ష్యంగా బరిలోకి దిగాడు. అనుకున్నది సాధించాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన బ్రెజిల్ గ్రాండ్‌ప్రి రేసులో ఫెరారీ డ్రైవర్ వెటెల్ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఐదో విజయాన్ని, కెరీర్‌లో 47వ టైటిల్‌ను దక్కించుకున్నాడు. 71 ల్యాప్‌ల ఈ రేసును రెండో స్థానం నుంచి ప్రారంభించిన వెటెల్ గంటా 31 నిమిషాల 26.262 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు. ‘పోల్ పొజిషన్’తో రేసును ఆరంభించిన వాల్తెరి బొటాస్ (మెర్సిడెస్)ను తొలి మలుపు వద్ద ఓవర్‌టేక్ చేసిన వెటెల్ ఆధిక్యంలోకి వెళ్లి వెనుదిరిగి చూడలేదు. కిమీ రైకోనెన్ (ఫెరారీ) మూడో స్థానంలో, హామిల్టన్ నాలుగో స్థానంలో నిలిచారు.
భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా జట్టు డ్రైవర్ సెర్గియో పెరెజ్ తొమ్మిదో స్థానాన్ని సంపాదించాడు. మొత్తం 20 మంది డ్రైవర్లు పాల్గొనగా నలుగురు డ్రైవర్లు మధ్యలోనే వైదొలిగారు. ఇందులో ముగ్గురు ఒకాన్ (ఫోర్స్ ఇండియా), మాగ్నుసన్ (హాస్), వాన్‌డూర్నీ (మెక్‌లారెన్) తొలి ల్యాప్‌లోనే తప్పుకున్నారు. తాజా గెలుపుతో డ్రైవర్స్ చాంపియన్‌షిప్ విభాగంలో వెటెల్‌కు (302 పాయింట్లు) రెండో స్థానం ఖాయమైంది. రెండు వారాల క్రితం మెక్సికో గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌కు (345 పాయింట్లు) ప్రపంచ టైటిల్ ఖరారైంది. సీజన్‌లోని చివరిదైన రేసు అబుదాబి గ్రాండ్‌ప్రి ఈనెల 26న జరుగుతుంది.
వెటెల్‌కు ఊరట విజయం
Published Tue, Nov 14 2017 12:29 AM | Last Updated on Tue, Nov 14 2017 12:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment