
బుడాపెస్ట్: ఈ సీజన్‌లో ఐదో టైటిల్ సాధించేందుకు మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ ఆదివారం జరిగే హంగేరి గ్రాండ్‌ప్రి రేసులో బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్ సెషన్‌లో హామిల్టన్ అందరికంటే వేగంగా ల్యాప్‌ను ఒక నిమిషం 35.658 సెకన్లలో పూర్తి చేసి పోల్ పొజిషన్ పొందాడు.
మెర్సిడెస్‌కే చెందిన బొటాస్ రెండో స్థానం నుంచి... రైకోనెన్, వెటెల్ (ఫెరారీ) మూడు, నాలుగు స్థానాల నుంచి రేసును మొదలుపెడతారు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ 18వ, 19వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment