మోంటెకార్లో: ఈ ఏడాది ఫార్ములావన్ సీజన్‌లో తన జోరు కొనసాగిస్తూ రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ మాక్స్ వెర్‌స్టాపెన్ నాలుగో విజయం నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని ఆరో రేసు మొనాకో గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్ విజేతగా నిలిచాడు. ‘పోల్ పొజిషన్’ నుంచి రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్ నిరీ్ణత 78 ల్యాప్‌లను అందరికంటే వేగంగా 1 గంట 48 నిమిషాల 51.980 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఫెర్నాండో అలోన్సో (ఆస్టిన్ మార్టిన్) రెండో స్థానంలో, ఎస్టెబన్ ఒకాన్ (అలై్పన్ టీమ్) మూడో స్థానంలో నిలిచారు.
max cమెర్సిడెస్ జట్టు డ్రైవర్లు లూయిస్ హామిల్టన్, జార్జి రసెల్ వరుసగా నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నారు. ఈ సీజన్‌లో ఆరు రేసులు జరగ్గా ఆరింటిని రెడ్‌బుల్ డ్రైవర్లే గెల్చుకోవడం విశేషం. వెర్‌స్టాపెన్ బహ్రెయిన్, ఆ్రస్టేలియన్, మయామి, మొనాకో గ్రాండ్‌ప్రిలలో నెగ్గగా... సెర్జియో పెరెజ్ సౌదీ అరేబియా, అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలలో విజేతగా నిలిచాడు. ప్రస్తుతం 144 పాయింట్లతో వెర్‌స్టాపెన్ టాప్ ర్యాంక్‌లో, 105 పాయింట్లతో పెరెజ్ రెండో ర్యాంక్‌లో, 93 పాయింట్లతో అలోన్సో మూడో ర్యాంక్‌లో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు స్పానిష్ గ్రాండ్‌ప్రి జూన్ 4న జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment