
హాకెన్‌హీమ్: సొంతగడ్డపై దుమ్మురేపుతూ సెబాస్టియన్ వెటెల్ ఈ సీజన్‌లో ఐదోసారి పోల్ పొజిషన్ సంపాదించాడు. శనివారం జరిగిన జర్మనీ గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో ఫెరారీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న జర్మన్ డ్రైవర్ వెటెల్... అందరికంటే వేగంగా ఒక నిమిషం 11.212 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఫలితంగా ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి మొదలుపెడతాడు.
మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ తొలి క్వాలిఫయింగ్‌లోనే వెనుదిరిగాడు. భారత్‌కు చెందిన ఫోర్స్ ఇండియా డ్రైవర్లు పెరెజ్, ఒకాన్ వరుసగా 10వ, 16వ స్థానాల నుంచి రేసును ఆరంభిస్తారు. నేటి ప్రధాన రేసును సాయంత్రం గం. 6.35 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–2 చానెల్ ప్రసారం చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment