![Lewis Hamilton on pole position in Belgian GP - Sakshi](/styles/webp/s3/article_images/2018/08/26/homol.jpg.webp?itok=_b7DnkSC)
స్పా–ఫ్రాంకోర్‌చాంప్స్: బెల్జియం గ్రాండ్‌ప్రి క్వాలిఫయింగ్ సెషన్‌లో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ హామిల్టన్ పోల్ పొజిషన్ సాధించాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌లో అందరికంటే వేగంగా 1 ని.58.179 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేశాడు. ఆదివారం జరిగే ప్రధాన రేసును అతను తొలి స్థానం నుంచి ఆరంభిస్తాడు. ఫోర్స్ ఇండియా డ్రైవర్లు ఒకాన్, పెరెజ్ వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ఫెరారీ డ్రైవర్ వెటెల్ రెండో స్థానం పొందగా, రెడ్‌బుల్ డ్రైవర్లు వెర్‌స్టాపెన్, రికియార్డో ఏడు, ఎనిమిది స్థానాల్లో నిలిచారు.
Comments
Please login to add a commentAdd a comment