బాకు (అజర్‌బైజాన్): మెర్సిడెస్ జట్టు డ్రైవర్ బొటాస్ ఈ సీజన్‌లో రెండో టైటిల్ ను దక్కించుకున్నాడు. ఆదివారం జరిగిన అజర్‌బైజాన్ గ్రాండ్‌ప్రిలో బొటాస్ విజేతగా నిలిచాడు. 51 ల్యాప్‌ల ఈ రేసును ‘పోల్ పొజిషన్’తో ప్రారంభించిన బొటాస్ గంటా 31 నిమిషాల 52.942 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. మెర్సిడెస్ జట్టుకే చెందిన హామిల్టన్ రెండో స్థానాన్ని సంపాదించాడు. దాంతో ఈ ఏడాది జరిగిన తొలి నాలుగు రేసుల్లోనూ తొలి రెండు స్థానాలు మెర్సిడెస్ జట్టు డ్రైవర్లకే వచ్చాయి. ఫార్ములావన్ చరిత్రలో ఇలా జరగడం ఇదే ప్రథమం. 1992లో విలియమ్స్ జట్టు సీజన్‌లోని తొలి మూడు రేసుల్లో ఈ ఘనత సాధించింది. ఆదివారం జరిగిన రేసుతో మెర్సిడెస్ ఈ రికార్డును సవరించింది.
Comments
Please login to add a commentAdd a comment